పెట్రోల్ రూటు సేప'రేటు'.. మరోసారి భగ్గుమన్న ఇంధన ధరలు..
న్యూఢిల్లీ : పెట్రోల్ ధరలు మంగళవారం (నవంబర్ 2) మళ్లీ పెరిగాయి. వరుసగా ఏడోసారి దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు (OMCలు) ఇంధన ధరల(fuel prices)ను రికార్డు స్థాయికి సవరించాయి, అయితే దేశవ్యాప్తంగా డీజిల్ ధరలను స్థిరంగా ఉంచాయి.
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOL) వెబ్‌సైట్ డేటా ప్రకారం నేటి పెరుగుదల తర్వాత పెట్రోల్ ధరలు 35 పైసలు పెరిగగా, డీజిల్ ధర మారలేదు.
ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.110.04, డీజిల్ ధర రూ.98.42గా ఉన్నాయి. ఢిల్లీలో గత 39 రోజుల్లో 30 రోజులు ఇంధన ధరలు లీటరుకు రూ.9.80 చొప్పున పెరిగాయి.
కోల్‌కతాలోని ప్రజలు సోమవారం పెట్రోల్ ధర కంటే 34 పైసలు పెంపుతో లీటర్ రూ.110.49 చెల్లించాలి. డీజిల్ ధరలు లీటరుకు రూ.101.56 వద్ద ఉంది. ముంబైలో పెట్రోల్ ధర 35 పైసల పెంపుతో రూ. 115.85 ఉండగా, డీజిల్ ధరలు రూ. 106.62 (మారలేదు)గా ఉంది.
చెన్నైలో పెట్రోలు ధర లీటరు రూ.106.66కి చేరగా, డీజిల్ ధర లీటరుకు రూ.102.59 వద్ద స్థిరంగా ఉంది. దేశంలోనే అత్యధిక రవాణా ఇంధన ధరలు రాజస్థాన్‌లోని శ్రీ గంగానగర్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.122.70 ,డీజిల్ ధర రూ.113.21గా ఉంది.
హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ.114.49(రూ.0.37పెరిగింది), డీజిల్ లీటర్ రూ.106.98. భోపాల్ పెట్రోల్ రూ.118.83/ltr(రూ.0.37పెరిగింది) & డీజిల్ రూ.107.90/ltr
అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలే తాజా పెంపుదలలకు ప్రధాన కారణమని చెప్పవచ్చు. పోస్ట్-పాండమిక్ డిమాండ్ రికవరీ, పెట్రోలియం ఎగుమతి దేశాల సంస్థ (ఒపెక్) ప్రధాన వినియోగదారుల నుండి ఎక్కువ చమురు కోసం డిమాండ్ ఉన్నప్పటికీ నెలవారీ ఉత్పత్తిని నెమ్మదిస్తుంది.
గత ఏడాది అక్టోబర్‌లో పెట్రోల్ డిమాండ్ 3.9 శాతం పెరగ్గా, డీజిల్ 5.1 శాతం క్షీణించడం ఇక్కడ ప్రస్తావించదగ్గ విషయం. రోజువారీ ధరల విధానం ప్రకారం, OMCలు ఆటో ఇంధనాల రిటైల్ ధరలను రోజువారీగా సవరిస్తాయి. అదనంగా, పెట్రోల్ మరియు డీజిల్ ధరలు బ్రెంట్ ముడి చమురు ధరలపై ఆధారపడి ఉంటాయి, ఎందుకంటే భారతదేశం ఇంధన అవసరాలలో 82 శాతం దిగుమతి చేసుకుంటుంది.
VAT (విలువ ఆధారిత పన్ను), సరుకు రవాణా ఛార్జీలు వంటి స్థానిక పన్నుల బట్టి ఆటో ఇంధన ధరలు రాష్ట్రాల నుండి రాష్ట్రానికి మారుతూ ఉంటాయి. పెట్రోల్ పంపు ధరలో 61 శాతానికి పైగా, డీజిల్ ధరపై 56 శాతానికి పైగా కేంద్ర, రాష్ట్ర పన్నులు ఉంటుందని గమనించాల్సిన విషయం. కేంద్ర ప్రభుత్వం లీటర్ పెట్రోల్‌పై రూ.32.90, డీజిల్‌పై రూ.31.80 ఎక్సైజ్ సుంకం విధిస్తోంది.