MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Petrol Diesel Prices Today: తెలుగు రాష్ట్రాల్లో నేటి పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లివే..!

Petrol Diesel Prices Today: తెలుగు రాష్ట్రాల్లో నేటి పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లివే..!

గత సంవత్సర కాలంగా మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడూ లేనంతగా పెరిగిపోతున్నాయి. ఈ ప్రభావం సామాన్యులపై బాగా పడుతోంది. వారి జేబులకు చిల్లు పడుతోంది. గతేడాది ఏప్రిల్‌లో ముడి చమురు ధరలు జీవితకాల కనిష్ఠానికి చేరినా మన దేశంలో మాత్రం తగ్గలేదు. పైగా పెరుగుతూ వస్తున్నాయి.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Apr 25 2022, 08:50 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

సోమ‌వారం కూడా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగానే ఉన్నాయి. దేశీ ఇంధన ధరలు నిలకడగా ఉండ‌టం ఇది వరుసగా 19వ రోజు కావడం గమనార్హం. వాహనదారులకు ఇది భారీ ఉపశమనం. అయితే పెట్రోల్, డీజల్ రేట్లు ఈ నెలలో ఇప్పటి దాకా చూస్తే లీటరుకు రూ.3.6 మేర పైకి చేరింది. గత నెలలో ఇంధ‌న‌ రేట్లు రూ.6.4 మేర పెరిగిన విషయం అందరికీ తెలిసిందే. కాగా హైదరాబాద్‌లో నేటి రేట్ల విషయానికి వస్తే.. పెట్రోల్ రూ.119.49 వద్ద, డీజిల్ రూ.105.49 వద్ద ఉన్నాయి. విజయవాడలో లీటర్‌ పెట్రోల్ ధర నేడు రూ.121.56గా ఉంది. డీజిల్ లీట‌ర్‌ రూ.107.12 వ‌ద్ద‌ ఉంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ లిమిటెడ్ (IOCL) చమురు ధరలకు సంబంధించి సోమ‌వారం (ఏప్రిల్ 25, 2022) కొత్త ధరలను విడుదల చేశాయి. దేశీయంగా సోమ‌వారం కూడా ధ‌ర‌లు స్థిరంగా ఉన్నాయి. సాధారణంగా దేశీయ చమురు మార్కెటింగ్ సంస్థలు ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ధరలను సవరిస్తాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ఇటీవల పైకి, కిందకు కదులుతున్నాయి. ఈ ప్రభావం దేశీయంగా పెట్రోల్, డీజిల్ పైన ఉంటుంది.
 

35

పెట్రోల్‌, డీజిల్ ధరలివే..!

- దేశ రాజధాని న్యూఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 105.41 కాగా, డీజిల్‌ రూ. 96.67 వద్ద కొనసాగుతోంది.
 
- దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 120.51 కాగా, డీజిల్‌ రూ. 104.77గా ఉంది.
 
- చెన్నైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 110.85 కాగా, డీజిల్ రూ. 100.94గా నమోదైంది. 

- బెంగళూరులో లీటర్‌ పెట్రోల్‌ రూ. 111.09 కాగా, డీజిల్‌ రూ. 94.79 వద్ద కొనసాగుతోంది.
 
- కోల్‌కతాలో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 115.12 కాగా, డీజిల్ ధర లీటర్ కు రూ. 99.83గా ఉంది. 

45

తెలుగు రాష్ట్రాల్లో ధరలు..!

- హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 119.49 వద్ద కొనసాగుతుండగా, డీజిల్‌ రూ. 105.49గా ఉంది.

- విజ‌య‌వాడ‌లో లీటర్‌ పెట్రోల్‌ రూ. 121.56కాగా, డీజిల్‌ రూ. 107.12గా ఉంది.

అంతర్జాతీయ మార్కెట్లలో క్రూడాయిల్ ధరలు భారీగా పెరిగినందున ధరలు మరింత ఎగుస్తాయని అంచనాలున్నాయి. దీంతో దేశీయంగా ద్రవ్యోల్బణం పెరిగి, గ్రోత్‌పై ప్రభావం చూపనుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. భారతదేశం ఎక్కువగా పెట్రోల్, డీజిల్ అవసరాలపై ఇతర దేశాలపైనే ఆధారపడుతోంది. పెట్రోల్-డీజిల్ ధరలు ప్రతిరోజూ మారుతాయి. ఉదయం 6 గంటలకు సవరిస్తారు. 

55

మీరు రోజువారీ పెట్రోల్, డీజిల్ ధరను SMS ద్వారా కూడా తెలుసుకోవచ్చు (How to check diesel petrol price daily). ఇండియన్ ఆయిల్ కస్టమర్లు సిటీ కోడ్‌తో పాటు RSPని 9224992249కి పంపడం ద్వారా, BPCL కస్టమర్‌లు RSPని 9223112222 నంబర్‌కు మెసేజ్ చేయడం ద్వారా సమాచారాన్ని పొందవచ్చు. అదే సమయంలో, HPCL వినియోగదారులు HP Price అని టైప్ చేసి 9222201122 నంబర్‌కు మెసేజ్  పంపడం ద్వారా ధరను తెలుసుకోవచ్చు.

About the Author

SG
Sreeharsha Gopagani
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Badam Sabudana Kheer: అమ్మవారికి ఇష్టమైన స్పెషల్ పాయసం....ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి
Recommended image2
Amazon Flipkart Festive Sale : పండగ్ సేల్ లో భారీ డిస్కౌంట్లు చూసి కొనేస్తున్నారా? ఈ ట్రిక్స్ తో మనీ సేవ్ చేసుకోండి
Recommended image3
Gold Price Hike: పండుగల వేళ పసిడి ధరల పెరుగుదల.. హైదరాబాద్‌లో తులం బంగారం ఎంతంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved