తగ్గిన క్రూడాయిల్.. స్థిరంగా పెట్రోల్ డీజిల్.. ఈ రోజు ఒక లీటరు ధర ఎంతంటే..?
నేడు అక్టోబర్ 12న అంతర్జాతీయ మార్కెట్‌లో ఈరోజు క్రూడాయిల్ ధరలో స్వల్ప తగ్గుదల కనిపించింది. గురువారం ఉదయం 6 గంటల ప్రాంతంలో డబ్ల్యుటిఐ క్రూడ్ బ్యారెల్‌కు $83.15 డాలర్లకు, బ్రెంట్ క్రూడ్ కూడా బ్యారెల్‌కు $85.57 డాలర్లకు పడిపోయింది.
petrol pump
దేశంలోని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ తాజాగా ధరలను విడుదల చేశాయి. భారతదేశంలో ఇంధన ధరలు ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు సవరించబడతాయి. జూన్ 2017కి ముందు ప్రతి 15 రోజులకు ఒకసారి ధరల సవరణ జరిగేది.
భారతీయ చమురు కంపెనీలు అక్టోబర్ 12 గురువారం నాడు అన్ని ప్రముఖ నగరాల్లో చిన్న చిన్న మార్పులతో దాదాపు ఒకే స్థాయిలో పెట్రోల్ డీజిల్ ధరలను ఉంచాయి. అయితే, ఇవి వాల్యూ ఆధారిత పన్ను (VAT), సరుకు రవాణా ఛార్జీలు, స్థానిక పన్నులు మొదలైన వాటి కారణంగా రాష్ట్రాల నుండి రాష్ట్రాలకు మారుతూ ఉంటాయి.
మహారాష్ట్రలో పెట్రోల్ 40 పైసలు, డీజిల్ 39 పైసలు పెరిగింది. పశ్చిమ బెంగాల్‌లో పెట్రోల్ ధర 44 పైసలు, డీజిల్ ధర 41 పైసలు పెరిగింది. మరోవైపు జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్ సహా మరికొన్ని రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్పంగా తగ్గాయి.
ప్రస్తుతం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉంది. ముంబైలో లీటరు పెట్రోల్ ధర రూ.106.31, డీజిల్ ధర రూ.94.27గా ఉంది. కోల్‌కతాలో పెట్రోలు ధర రూ.106.03గా ఉండగా, డీజిల్ ధర లీటరుకు రూ.92.76గా ఉంది. మరోవైపు చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.102.63, డీజిల్ ధర రూ.94.24.
భారతదేశంలో, ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం వంటి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (OMCలు) పెట్రోల్ డీజిల్ ధరలను నిర్ణయిస్తాయి. ఇవి రోజువారీ ప్రాతిపదికన చేయబడుతుంది ఇంకా ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రూడాయిల్ ధరలకు అనుగుణంగా రేట్లు నిర్ణయించబడతాయి.
బెంగళూరులో పెట్రోల్ ధర రూ. 101.94, డీజిల్ ధర రూ. 87.89
చండీగఢ్ లో పెట్రోల్ ధర రూ. 96.20, డీజిల్ ధర రూ. 84.26
గురుగ్రామ్ లో పెట్రోల్ ధర రూ. 96.84, డీజిల్ ధర రూ. 89.72
లక్నోలో పెట్రోల్ ధర రూ. 96.57, డీజిల్ ధర రూ. 89.76
నోయిడాలో పెట్రోల్ ధర రూ. 96.79, డీజిల్ ధర రూ. 89.96
హైదరాబాద్ లో పెట్రోల్ డీజిల్ ధరలు చాలా వరకు స్థిరంగా ఉన్నాయి. పెట్రోల్ ధర రూ .109.67 , డీజిల్ ధర రూ .97.82
మీరు పెట్రోల్ డీజిల్ ధరలను SMS ద్వారా కూడా తెలుసుకోవచ్చు. ఇండియన్ ఆయిల్ కస్టమర్‌లు RSP అండ్ వారి సిటీ కోడ్‌ని 9224992249కి sms పంపడం ద్వారా సమాచారాన్ని పొందవచ్చు. BPCL కస్టమర్‌లు RSP అండ్ వారి సిటీ కోడ్‌ని టైప్ చేయడం ద్వారా 9223112222కి SMS పంపడం ద్వారా సమాచారాన్ని పొందవచ్చు. అయితే, HPCL వినియోగదారులు HPPrice అండ్ వారి సిటీ కోడ్‌ను 9222201122కు sms పంపడం ద్వారా ధరలాను తెలుసుకోవచ్చు.