MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • పెట్రోల్, డీజిల్ కొత్త ధరలు: ఇవాళ మీ నగరంలో లీటరుకు ఎంతో తెలుసుకోండి..

పెట్రోల్, డీజిల్ కొత్త ధరలు: ఇవాళ మీ నగరంలో లీటరుకు ఎంతో తెలుసుకోండి..

 ఈరోజు అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలు పైకి ఎగబాకుతున్నాయి. అయితే డబ్ల్యూటీఐ క్రూడ్ ధర తగ్గుతోంది. బుధవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో WTI క్రూడ్ కొద్దిగా తగ్గి బ్యారెల్‌కు $75.24 డాలర్ల వద్ద,  బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 2 డాలర్లు పెరిగి $81.07 డాలర్లకు చేరుకుంది. 

2 Min read
Author : Ashok Kumar
| Updated : Dec 27 2023, 10:01 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

 దేశంలోని ఆయిల్  మార్కెటింగ్ కంపెనీలు తాజాగా పెట్రోల్, డీజిల్ ధరలను విడుదల చేశాయి. భారతదేశంలో, ఇంధన ధరలు ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు సవరించబడతాయి. జూన్ 2017కి ముందు, ప్రతి 15 రోజులకు ఒకసారి ధరల సవరణ ఉండేది.

ఉత్తరప్రదేశ్‌లో పెట్రోల్, డీజిల్ ధర 21 పైసలు పెరిగింది. పశ్చిమ బెంగాల్‌లో పెట్రోలు ధర 44 పైసలు, డీజిల్ ధర 41 పైసలు పెరిగింది. అంతేకాకుండా రాజస్థాన్, మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. మరోవైపు, ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్ 21 పైసలు, డీజిల్ 19 పైసలు తగ్గింది. హిమాచల్ ప్రదేశ్‌లో కూడా పెట్రోల్ 28 పైసలు, డీజిల్ 26 పైసలు తగ్గాయి. జమ్మూ కాశ్మీర్‌, గోవాలో కూడా ధరల్లో తగ్గుదల కనిపిస్తోంది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
Petrol Diesel station

Petrol Diesel station

ప్రస్తుతం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72కు , డీజిల్ ధర రూ.89.62గా ఉంది. ముంబైలో లీటరు పెట్రోల్ ధర రూ.106.31, డీజిల్ ధర  రూ.94.27గా ఉంది. కోల్‌కతాలో పెట్రోలు ధర రూ.106.03గా ఉండగా, డీజిల్ ధర లీటరుకు రూ.92.76గా ఉంది. మరోవైపు చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.102.63, డీజిల్ ధర రూ.94.24గా ఉంది.

భారతదేశంలో, ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం ఇంకా  హిందుస్థాన్ పెట్రోలియం వంటి ఆయిల్  మార్కెటింగ్ కంపెనీలు (OMCలు) పెట్రోల్  డీజిల్ ధరలను నిర్ణయిస్తాయి. ధరల సవరింపు ప్రతిరోజూ జరుగుతుంది ఇంకా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముడి చమురు ధరకు అనుగుణంగా రేట్లు నిర్ణయించబడతాయి.
 

34

ఈ నగరాల్లో ఇంధన ధరలు

- నోయిడాలో లీటరు పెట్రోల్ ధర రూ.96.65, డీజిల్ ధర రూ.89.82గా ఉన్నాయి.

– ఘజియాబాద్‌లో పెట్రోల్ ధర లీటర్‌కు రూ.96.58కి, డీజిల్ లీటరుకు రూ.89.75కి చేరింది.

– లక్నోలో లీటరు పెట్రోల్ ధర రూ.96.47, డీజిల్ ధర రూ.89.66గా ఉంది.

– పాట్నాలో లీటరు పెట్రోల్ ధర రూ.107.24, డీజిల్ ధర రూ.94.04గా ఉంది.

– పోర్ట్ బ్లెయిర్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.84.10, డీజిల్ ధర రూ.79.74గా ఉంది.

-తెలంగాణలో లీటరు పెట్రోల్‌ ధర రూ.109.66,  లీటరు డీజిల్ ధర రూ.97.82

రాష్ట్రాలలో ఇంధన ధరలు ఎందుకు మారుతున్నాయి?

ప్రతి రోజు ధరలు కొత్తవి అయినా లేదా మారకపోయినా ఉదయం 6 గంటలకు ప్రకటించబడతాయి. అయితే ఇవి రాష్ట్రాన్ని బట్టి మారుతూ ఉంటాయి; ఇంకా  విలువ ఆధారిత పన్ను (VAT), సరుకు రవాణా ఛార్జీలు, స్థానిక పన్నులు మొదలైన ప్రమాణాల కారణంగా ఉంటాయి.

44

ఇంట్లో కూర్చొని కూడా పెట్రోల్, డీజిల్ ధరలను SMS  ద్వారా తెలుసుకోవచ్చు. మీరు ఇండియన్ ఆయిల్ వినియోగదారులు అయితే, RSP అండ్  మీ సిటీ కోడ్‌ని టైప్ చేసి 9224992249 నంబర్‌కు SMS పంపండి, BPCL వినియోగదారులు  RSP అండ్  సిటీ కోడ్‌ని  టైప్ చేసి 9223112222 నంబర్‌కు SMS పంపాలి. దీని తర్వాత మీకు SMS ద్వారా మొత్తం సమాచారం ఇవ్వబడుతుంది. HPCL వినియోగదారులు HPPrice అండ్  సిటీ కోడ్‌ని టైప్ చేసి  9222201122కు SMS  పంపాలి.

About the Author

AK
Ashok Kumar
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Price Hike: పండగ వేళ పసిడి షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు!
Recommended image2
8th Pay Commission: ఉద్యోగులకు బంపర్ న్యూస్.. జీతాల పెంపు, డిఏ విలీనంపై 5 కీలక డిమాండ్లు
Recommended image3
Top 10 Countries With Most Billionaires: అత్యధిక బిలియనీర్లు ఉన్న టాప్ 10 దేశాలు ఇవే, భారత్ స్థానం ఎంతంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved