- Home
- Business
- petrol diesel prices: నేడు స్థిరంగా ఇంధన ధరలు.. కేంద్రం గుడ్ న్యూస్ తో చౌకగా పెట్రోల్, డీజిల్..
petrol diesel prices: నేడు స్థిరంగా ఇంధన ధరలు.. కేంద్రం గుడ్ న్యూస్ తో చౌకగా పెట్రోల్, డీజిల్..
నేడు మే 27న శుక్రవారం ఇంధన ధరలు యథాతథంగా ఉన్నాయి. చమురు మార్కెటింగ్ కంపెనీలు ఈరోజు ఉదయం 6 గంటలకు పెట్రోల్, డీజిల్ కొత్త ధరలను విడుదల చేశాయి. ముడిచమురు బ్యారెల్‌కు 117 డాలర్లు దాటినప్పటికీ ఐదో రోజు ధరల్లో ఎలాంటి మార్పు లేకపోవడంతో శుక్రవారం వినియోగదారులకు ఊరట లభించింది.

ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.96.72, డీజిల్ రూ.89.62గా ఉంది. పోర్ట్ బ్లెయిర్‌లో చౌకైగా పెట్రోల్ ధర లీటరుకు రూ. 84.10, డీజిల్ ధర లీటరుకు రూ. 79.74. కాగా, నేటికీ దేశంలో అత్యంత ఎక్కువగా పెట్రోల్ మహారాష్ట్రలోని పర్భానీలో లీటరుకు రూ.114.38గా ఉంది. ముంబైలో ప్రస్తుతం పెట్రోల్ ధర రూ.111.35 కాగా, డీజిల్ ధర రూ.97.28గా ఉందని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వెబ్‌సైట్ వెల్లడించింది.
గత వారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పెట్రోల్‌పై లీటరుకు 8, డీజిల్‌పై 6 రూపాయల చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తున్నట్లు ప్రకటించిన తర్వాత పెట్రోలు, డీజిల్ ధరలు గణనీయంగా తగ్గాయి. ప్రభుత్వ నిర్ణయంతో దేశ రాజధానిలో లీటర్ పెట్రోల్ ధర రూ.8.69 తగ్గగా, డీజిల్ ధర రూ.7.05 తగ్గింది.
Image: Sanchit Khanna/HT/Getty Images
తదనంతరం, కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన తరువాత వినియోగదారులకు మరింత ఉపశమనం కలిగించాలని సీతారామన్ పిలుపు మేరకు మహారాష్ట్ర, రాజస్థాన్, కేరళ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్‌ను తగ్గించాయి.
దేశంలో పెట్రోలు, డీజిల్ ధరలు స్థానిక పన్ను (vat), సరుకు రవాణా ఛార్జీల ఆధారంగా రాష్ట్రాల నుండి రాష్ట్రాలకు భిన్నంగా ఉంటాయి. అంతేకాకుండా ఇంధనాలపై కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని వసూలు చేస్తుంది.
OMCలు సాధారణంగా అంతర్జాతీయ మార్కెట్లో బెంచ్‌మార్క్ ఇంధనం సగటు ధర, అంతకుముందు 15-రోజుల విదేశీ మారకపు ధరల ఆధారంగా ప్రతిరోజూ పెట్రోల్, డీజిల్ ధరలను సవరిస్తాయి.
అంతకుముందు సెషన్‌లో రెండు నెలల గరిష్ఠ స్థాయికి చేరిన తర్వాత పెట్టుబడిదారులు ప్రపంచ సరఫరా సంకేతాలపై దృష్టి సారించడంతో శుక్రవారం ఆసియా వాణిజ్యంలో చమురు ధరలు కొద్దిగా తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ 0:08 GMT నాటికి 11 సెంట్లు తగ్గి బ్యారెల్ $117.29కి పడిపోయింది. జూలై డెలివరీ WTI క్రూడ్ ఫ్యూచర్స్ బ్యారెల్‌కు 19 సెంట్లు తగ్గి $113.90కి చేరుకుంది.
భారతదేశంలోని ప్రధాన నగరాల్లో శుక్రవారం పెట్రోల్, డీజిల్ ధరలు:
ఢిల్లీ
పెట్రోలు: లీటరుకు రూ. 96.72
డీజిల్: లీటరుకు రూ. 89.62
ముంబై
పెట్రోలు: లీటరుకు రూ. 111.35
డీజిల్: లీటరుకు రూ. 97.28
కోల్‌కతా
పెట్రోలు: లీటరుకు రూ. 106.03
డీజిల్: లీటరుకు రూ. 92.76
చెన్నై
పెట్రోలు: లీటరుకు రూ. 102.63
డీజిల్: లీటరుకు రూ. 94.24
భోపాల్
పెట్రోలు: లీటరుకు రూ. 108.65
డీజిల్: లీటరుకు రూ. 93.90
హైదరాబాద్
పెట్రోలు: లీటరుకు రూ. 109.66
డీజిల్: లీటరుకు రూ. 97.82