ఇంటి నుండి వెళ్లే ముందు కొత్త ఇంధన ధరలను తెలుసుకోండి.. నేడు ఒక లీటరు పెట్రోల్ డీజిల్ ఎంతంటే..?
ఈరోజు 21 అక్టోబర్ 2023న అంటే శనివారం దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ కొత్త ధరలు విడుదలయ్యాయి. అయితే జాతీయ స్థాయిలో నేడు ఇంధన ధరల్లో పెద్దగా మార్పు కనిపించలేదు. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలను బట్టి భారత్‌లో ఇంధన ధరలు నిర్ణయించబడుతుంది.
భారతీయ ఇంధన కంపెనీలు ప్రతిరోజు పెట్రోల్ డీజిల్ ధరలను ప్రకటిస్తాయి. దేశంలోని మెట్రో నగరాలతో సహా చాలా రాష్ట్రాల్లో ఇంధన ధరలు స్థిరంగా ఉన్నాయి. అయితే పలు నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరల్లో స్వల్ప మార్పు చోటు చేసుకుంది.
గత ఏడాది మే 2022 నుండి దేశంలో ఇంధన ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి, దీని వల్ల ప్రజలకు ఉపశమనం లభించిందని చెప్పవచ్చు. పెట్రోల్ డీజిల్ ధరలు ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు సమీక్షిస్తారు. వివిధ రాష్ట్రాల్లో వ్యాట్ రేటు కారణంగా పెట్రోల్ డీజిల్ రేటు అన్ని రాష్ట్రాలలో ఒకేలా ఉండదు.
ఇజ్రాయెల్-హమాస్ వివాదం మిడిల్ ఈస్ట్ కు విస్తరించి ఇంధన ధరలను పెంచుతుందనే భయంతో శుక్రవారం చమురు ధరలు పెరిగాయి. నవంబర్‌లో బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ బ్యారెల్‌కు 77 సెంట్లు పెరిగి $93.15కి, US వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ బ్యారెల్‌కు $90.36 వద్ద 99 సెంట్లు ఎగిసింది ఎగిసింది.
ఢిల్లీలో పెట్రోల్ ధర రూ. 96.72, డీజిల్ ధర రూ. 89.62. చెన్నైలో లీటరు పెట్రోల్ ధర రూ. 102.65, డీజిల్ ధర రూ. 94.24 లీటరు.
ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 106.31, డీజిల్ ధర రూ. 97.28 లీటరు. బెంగళూరులో ఈరోజు పెట్రోల్ ధర రూ. 101.94 లీటరు, డీజిల్ ధర రూ. 87.89 లీటరు.
నోయిడాలో పెట్రోల్ ధర రూ.96.59, డీజిల్ ధర రూ. 89.93
లక్నోలో పెట్రోల్ ధర రూ.96.57, డీజిల్ ధర రూ. 89.76
బెంగళూరులో పెట్రోల్ ధర రూ.101.94, డీజిల్ ధర రూ. 87.89
జైపూర్ లో పెట్రోల్ ధర రూ.108.48, డీజిల్ ధర రూ. 93.72
త్రివేండ్రంలో పెట్రోల్ ధర రూ.109.42, డీజిల్ ధర రూ. 98.27
భువనేశ్వర్ లో పెట్రోల్ ధర రూ.103.04, డీజిల్ ధర రూ. 94.76
హైదరాబాద్‌లో పెట్రోల్ ధర రూ. 109.66, డీజిల్ ధర రూ. 97.82 లీటరు.
మీరు SMS ద్వారా మీ నగరంలోని పెట్రోల్, డీజిల్ ధరలను కూడా తెలుసుకోవచ్చు. ఇండియన్ ఆయిల్ (IOC) కస్టమర్‌లు RSP<డీలర్ కోడ్>ని 9224992249కి అలాగే HPCL (HPCL) కస్టమర్‌లు HPPRICE <డీలర్ కోడ్>ని 9222201122కి sms పంపవచ్చు. BPCL కస్టమర్లు RSP<డీలర్ కోడ్>ని 9223112222కి sms పంపవచ్చు.