MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • SIP: పదిహేను వేల రూపాయల జీతం వచ్చేవారు SIPలో ఇలా పెట్టుబడి పెడితే త్వరలో లక్షాధికారి కావచ్చు

SIP: పదిహేను వేల రూపాయల జీతం వచ్చేవారు SIPలో ఇలా పెట్టుబడి పెడితే త్వరలో లక్షాధికారి కావచ్చు

నెలవారీ ఆదాయం 15 వేల రూపాయలు మాత్రమే ఉన్నవారు కూడా లక్షాధికారి కావచ్చు. ఇందుకోసం SIPలో పెట్టబడి పెట్టాల్సి వస్తుంది. నిజానికి SIP ఒక గొప్ప మార్గం అని చెప్పుకోవాలి. 

2 Min read
Author : Haritha Chappa
Published : Sep 02 2025, 02:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
సిప్ అంటే ఏమిటి?
Image Credit : Pixabay

సిప్ అంటే ఏమిటి?

SIP అనగా సిస్టమేటిక్ ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్. ఇది మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడానికి సులువైన మార్గం. నిజానికి ఇది ఒక రకమైన డిజిటల్ పిగ్గి బ్యాంక్ అని చెప్పుకోవాలి. చిన్నచిన్న పెట్టుబడులు పెట్టడానికి సులువుగా వెనక్కి తీసుకోవడానికి సిప్ ఎంతో సౌకర్యంగా ఉంటుంది. మీరు 100 రూపాయలు నుంచి కూడా సిప్ లో పెట్టుబడి పెట్టవచ్చు. తక్కువ జీతాలు పొందే వారికి ఎక్కువ లాభాలను ఇచ్చే పద్ధతి సిప్.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25
తక్కువ జీతం ఉన్నా..
Image Credit : Pixabay

తక్కువ జీతం ఉన్నా..

15వేల రూపాయలు జీతం వచ్చేవారు పొదుపు చేసే పద్ధతి తెలియక ఇబ్బంది పడతారు. నిజానికి పదిహేను వేల రూపాయలు వచ్చేవారు కూడా త్వరగానే సిప్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా లక్ష రూపాయలు కూడబెట్టవచ్చు. ఇక్కడ మేము 15 వేల రూపాయల జీతం వచ్చే వారు త్వరగా లక్ష రూపాయలు ఎలా సంపాదించాలో సిప్ లో ఏ విధంగా పెట్టుబడి పెట్టాలో ఇచ్చాము.

Related Articles

Related image1
ఇరవైఏళ్ల పాటూ ఇలా సిప్ చేయండి, అయిదు కోట్లు రూపాయలు చేతికొస్తాయి
Related image2
నెలకు రూ.500 సిప్ చేస్తే లక్షల్లో రాబడి.. పెట్టుబడికి బెస్ట్ ప్లాన్!
35
నెలకి వెయ్యి రూపాయలు పొదుపు చేస్తే
Image Credit : Pixabay

నెలకి వెయ్యి రూపాయలు పొదుపు చేస్తే

15వేల రూపాయల జీతం వచ్చేవారు నెలకు 1000 రూపాయలు పొదుపు చేయాలి. ఈ వెయ్యి రూపాయలను సిప్ చేయాల్సి వస్తుంది. మీరు చేసిన ప్రతి 1000 రూపాయలపై 12 శాతం వడ్డీ రాబడి ఉంటుంది. మీరు ప్రతి నెల 1000 రూపాయలు సిప్ చేస్తే ఆరు సంవత్సరాల లో మీకు లక్ష రూపాయలు పొదుపు అవుతుంది. 2000 రూపాయలు సిప్ చేస్తే మీకు ఆరు సంవత్సరాల్లో రెండు లక్షలకు పైగా చేతికొచ్చే అవకాశం ఉంది.

45
ఎంత లాభం?
Image Credit : Pixabay

ఎంత లాభం?

అదే 3000 రూపాయలు చేస్తే నాలుగు లక్షల రూపాయల వరకు వచ్చే అవకాశం ఉంది. మీరు చేసే పొదుపుపై 12 శాతం వడ్డీని అందిస్తుంది. ప్రతినెలా 1000 రూపాయలు సిప్ చేసే వారికి ఆరు సంవత్సరాల లో 1,06,000 రూపాయలు చేతికి వస్తుంది. అయితే మీరు అందులో పెట్టేది అసలు 72,000 మాత్రమే మిగతాది వడ్డీ. మీరు నెలకు 5000 రూపాయలు సిప్ చేయగలిగితే ఆరేళ్లలో మీ చేతికి ఐదు లక్షలకు పైగా డబ్బులు వచ్చే అవకాశం ఉంది. ఇందులో మీరు పెట్టే అసలు పెట్టుబడి 3,60,000 రూపాయలు మాత్రమే మిగతా లక్షన్నర పైగా వడ్డీయే పడుతుంది.

55
పొదుపు చేయక తప్పదు
Image Credit : Pixabay

పొదుపు చేయక తప్పదు

తక్కువ పొదుపుతో ఎక్కువ లాభాలను పొందాలంటే రిస్కు లేని పద్ధతి సిప్. సిప్ లో ఎంత కాలం ఎక్కువ కాలం పాటు పెట్టుబడి పెడితే మీరు అంత ఎక్కువ లాభం పొందుతారు. ఉదాహరణకు మీరు నెలకు 1000 రూపాయల చొప్పున పదేళ్లపాటు పెట్టుబడి పెడితే మీకు వచ్చే రాబడి ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వడ్డీ 12 శాతం పడుతూ ఉంటుంది. కాబట్టి తక్కువ జీతమైనా కూడా కనీసం నెలకి 1000 రూపాయలు నుంచి 5 వేల రూపాయలలోపు పొదుపు చేసేందుకు సిప్ లో పెట్టుబడి పెట్టేందుకు ప్రయత్నించండి. ఇది మీకు ఎక్కువ లాభాన్ని అందిస్తుంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
వ్యాపారం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
ఇక‌పై వాహ‌నాలు నీటితో న‌డ‌వ‌నున్నాయా.? విదేశీ సంస్థ వినూత్న ఆవిష్క‌ర‌ణ‌.
Recommended image2
రిటైర్మెంట్ తర్వాత ఎవరిపై ఆధారపడొద్దా.? ఇలా చేస్తే ప్రతీ 3 నెల‌ల‌కు మీ అకౌంట్‌లోకి రూ. 61 వేలు
Recommended image3
Business Idea: కిర్రాక్ వ్యాపారం.. యాభై వేల పెట్టుబడి పెడితే నెలకు లక్ష సంపాదించవచ్చు
Related Stories
Recommended image1
ఇరవైఏళ్ల పాటూ ఇలా సిప్ చేయండి, అయిదు కోట్లు రూపాయలు చేతికొస్తాయి
Recommended image2
నెలకు రూ.500 సిప్ చేస్తే లక్షల్లో రాబడి.. పెట్టుబడికి బెస్ట్ ప్లాన్!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved