ఇరవై ఏళ్లలో సింపుల్ గా  5 కోట్లు సంపాదించాలనుకుంటే, SIP లో స్మార్ట్ ట్రిక్ ఉంది. దీనివల్ల లాంగ్ టర్మ్ లో ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు. సరైన మ్యూచువల్ ఫండ్స్, రెగ్యులర్ ఇన్వెస్ట్మెంట్ తో త్వరగా ఫండ్ పొందవచ్చు కూడా. 

ఇరవై ఏళ్లలో అయిదు కోట్ల రూపాయలు పొదుపు చేయగలిగితే … జీవితంలో బిందాస్ గా సాగిపోతుంది. ఇప్పుడిప్పుడే ఉద్యోగాల్లో చేరిన వారు మొదటి నెల నుంచి పొదుపు చేయడం ప్రారంభించాలి. అలాగే మరొక ఇరవై ఏళ్లు సర్వీసు ఉన్న వాళ్లు కూడా ఇక్కడ మేము చెప్పిన పద్ధతిలో పెట్టుబడులు పెడితే వారు రిటైర్ అయ్యే సమయానికి అయిదు కోట్ల రూపాయల ఫండ్ వారి దగ్గర ఉంటుంది. ఇందుకోసం మీరు SIP చేయాలి. 

SIP (Systematic Investment Plan) చాలా మంచి ఆప్షన్. లాంగ్ టర్మ్ లో SIP ఇన్వెస్ట్మెంట్ వల్ల త్వరగా డబ్బు పెరుగుతుంది. ముఖ్యంగా ఈక్విటీ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలి. సరైన స్ట్రాటజీ, ప్లానింగ్ తో త్వరగా లక్ష్యం చేరుకోవచ్చు. ఎలా పెద్ద మొత్తంలో పొదుపు చేయవచ్చో తెలుసుకుందాం.

₹5 కోట్లు సంపాదించడం ఎలా?

5 కోట్ల రూపాయలు కావాలంటే, స్టెప్ అప్ SIP ఉత్తమమైన మార్గం. ఇందులో కాలానుగుణంగా SIP మొత్తాన్ని పెంచుకుంటూ పోవాలి. దీనివల్ల ఇన్వెస్ట్మెంట్ కూడా త్వరగా పెరుగుతుంది. కంపౌండింగ్ ప్రయోజనాలు కూడా అధికంగా ఉంటాయి. మెచ్యూరిటీ అయ్యాక పెద్ద మొత్తంలో డబ్బు చేతికి వస్తుంది. అంటే చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్స్ తో లాంగ్ టర్మ్ లో పెద్ద మొత్తంలో డబ్బును సంపాదించవచ్చు.

కోట్లలో కూడబెట్టాలంటే స్టెప్ అప్ అంటే టాప్-అప్ SIP చాలా మంచిది. ఇందులో ప్రతి సంవత్సరం మీ ఆదాయానికి అనుగుణంగా SIP మొత్తాన్ని పెంచుకోవాలి. ఉదాహరణకు ప్రారంభంలో నెలకు ₹25,000 SIP చేసి, ప్రతి సంవత్సరం 10% పెంచుకుంటూ పోవాలి. అంచనా రిటర్న్ 12% ఉంటే, SIP కాలిక్యులేటర్ ప్రకారం, 20 సంవత్సరాలలో మొత్తం ఇన్వెస్ట్మెంట్ ₹1.72 కోట్లు అవుతుంది. మొత్తం ₹4.97 కోట్లు అంటే దాదాపు ₹5 కోట్ల దాకా చేతికి వస్తుంది.

మీరు స్టెప్ అప్ SIP లేకుండా అదే మొత్తం ఇన్వెస్ట్ చేస్తే, 20 సంవత్సరాల పాటూ ఇన్వెస్ట్ చేసినా కూడా పెద్ద మొత్తమే చేతికి అందుతుంది. మీరు 20 ఏళ్లలో చేసే మొత్తం ఇన్వెస్ట్మెంట్ ₹60 లక్షలు అవుతుంది. చేతికొచ్చే మొత్తం ₹2.3 కోట్లు (SIP కాలిక్యులేటర్ ప్రకారం) వస్తుంది. అంటే ఈ విధంగా SIP చేస్తే డబుల్ అవుతుంది.

సరైన మ్యూచువల్ ఫండ్ ఎలా ఎంచుకోవాలి?

  • SIP చేయడం వల్ల మాత్రమే ఎక్కువ మొత్తం చేతికి అందదు. అదే సమయంలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే డబ్బు పెరిగే అవకాశం ఎక్కువ.
  • చాలా కాలం పాటు మంచి పనితీరు కనబరిచిన ఫండ్స్ ఎంచుకోవాలి. 5 నుంచి 10 సంవత్సరాల ట్రాక్ రికార్డు చూసి అప్పుడు ఎంచుకోవాలి.
  • డెట్ ఓరియెంటెడ్ స్కీమ్స్ కంటే ఈక్విటీ ఫండ్స్ త్వరగా పెరుగుతాయి.
  • లాంగ్ టర్మ్ లో కంపౌండింగ్ ప్రయోజనం కనిపిస్తుంది.

SIP ఎప్పుడు ఆపకండి

నిపుణులు చెబుతున్న ప్రకారం మార్కెట్ హెచ్చుతగ్గులకు భయపడకూడదు. మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ సమయంలో మార్కెట్ పడిపోవడం, లేవడం సాధారణం. సలహా లేకుండా SIP ఆపకూడదు, యూనిట్స్ అమ్మకూడదు. మార్కెట్ పడిపోయినప్పుడు ప్రయోజనం పొందాలి. తక్కువ ధరకు ఎక్కువ యూనిట్స్ కొనాలి, దీనివల్ల లాంగ్ టర్మ్ లో రిటర్న్ పెరుగుతుంది.

మ్యూచువల్ ఫండ్ నుండి డివిడెండ్ వచ్చినప్పుడు లేదా బోనస్, ఇన్సెంటివ్ లేదా గిఫ్ట్ వస్తే, దాన్ని కూడా SIP లో వేసేయాలి. దీనివల్ల డబ్బు త్వరగా పెరుగుతుంది, కంపౌండింగ్ ప్రయోజనం పెరుగుతుంది. త్వరగా ఎక్కువ డబ్బు కూడుతుంది.

నిరాకరణ: ఈ వ్యాసం సాధారణ సమాచారం కోసం మాత్రమే. ఇందులో ఇచ్చిన సమాచారం ఇన్వెస్ట్మెంట్ సలహా కాదు. మ్యూచువల్ ఫండ్స్, SIP లో ఇన్వెస్ట్మెంట్ మార్కెట్ రిస్క్ కి లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు మీ ఆర్థిక సలహాదారుని లేదా సెబీ రిజిస్టర్డ్ నిపుణుడిని సంప్రదించండి.