నెలకు రూ.500 సిప్ చేస్తే లక్షల్లో రాబడి.. పెట్టుబడికి బెస్ట్ ప్లాన్!
చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టి.. పెద్ద మొత్తంలో రాబడి పొందాలి అనుకుంటున్నారా? అయితే మ్యూచువల్ ఫండ్స్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. రిస్క్ తక్కువ. రాబడి ఎక్కువ. నెలకు కేవలం రూ.500 పెట్టుబడితో లక్షలు పొందవచ్చు. ఎలాగో ఇక్కడ చూద్దాం.

Step by Step Mutual Fund Guide
తక్కువ పెట్టుబడితో ఎక్కువ డబ్బులు సంపాదించాలని ఎవరూ కోరుకోరు చెప్పండి. మీరు కూడా చిన్న మొత్తాల్లో పెట్టుబడి పెడుతూ హై రిటర్న్స్ రావాలని కోరుకుంటున్నారా? అయితే సరైన పద్ధతిలో సరైన చోట ఇన్వెస్ట్ చేస్తే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చు. ప్రతినెలా తక్కువ పెట్టుబడి పెట్టి లక్షల్లో రాబడి పొందవచ్చు. రిస్క్ తక్కువ. రిటర్న్స్ ఎక్కువ. మ్యూచువల్ ఫండ్స్ లో ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. తక్కువ మొత్తంలో ఇన్వెస్ట్ చేస్తూనే ఎక్కువ ఆదాయం పొందవచ్చు. ఎలాగో ఇక్కడ తెలుసుకుందాం.
నెలకు రూ. 500 పెట్టుబడి..
మ్యూచువల్ ఫండ్స్ సిప్ (SIP- Systematic Investment Plan) ద్వారా నెలకు కేవలం రూ. 500 చొప్పున ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయవచ్చు. క్రమం తప్పకుండా ఒక నిర్దిష్ట మొత్తాన్ని పెట్టుబడి పెట్టడానికి ఇది ఒక మంచి మార్గం. మీరు రూ. 500 పెట్టుబడి పెట్టినా.. దీర్ఘకాలంలో గణనీయమైన మొత్తాన్ని సంపాదించవచ్చు.
మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి ఎలా పెట్టాలి?
మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టడానికి.. మీరు ముందుగా మ్యూచువల్ ఫండ్ కంపెనీ వెబ్‌సైట్‌ను సందర్శించాలి. మీరు ఎంచుకునే స్కీమ్, టైం పీరియడ్ ఆధారంగా మీ చేతికి అందే మొత్తం మారుతుంది. మీరు SIP ద్వారా పెట్టుబడి పెట్టాలనుకుంటే, నెలవారీ లేదా త్రైమాసిక ప్రాతిపదికన ఒక నిర్ధిష్ట మొత్తాన్ని పెట్టుబడి పెట్టవచ్చు.
స్టెప్-అప్ కాన్సెప్ట్:
పెట్టుబడి పెట్టే విషయంలో స్టెప్-అప్ కాన్సెప్ట్ చాలా ముఖ్యం. దీని అర్థం ప్రతి సంవత్సరం పెట్టుబడి మొత్తాన్ని కొంచెం కొంచెం పెంచుకుంటూ పోవడం. మీ జీతం పెరిగే కొద్దీ.. పెట్టుబడి మొత్తాన్ని కూడా పెంచుకోవాలి. తద్వారా లక్షల్లో ఆదాయం పొందవచ్చు. మీ ప్రారంభ పెట్టుబడి నెలకు 500 రూపాయలు అనుకుందాం. మీరు 25 సంవత్సరాలు ప్లాన్ తీసుకున్నారనుకోండి. ఏటా పది శాతం పెట్టుబడి పెంచుకుంటే పోతే.. 15 శాతం వడ్డీతో మీ చేతికి రూ. 80 లక్షల వరకు అందుతుంది.
గమనిక
మ్యూచువల్ ఫండ్స్ సిప్ రాబడి మార్కెట్ మీద ఆధారపడి ఉంటుంది. సరైన అవగాహన లేకుండా పెట్టుబడి పెడితే నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆర్థిక నిపుణుల సలహా తీసుకున్న తర్వాత పెట్టుబడి పెట్టడం మంచిది.