Best selling cars: ఎలాంటి డిస్కౌంట్ ఇవ్వకపోయినా ఈ కార్లను ఎగబడి కొంటున్నారు
Best selling cars: హ్యుందాయ్ ఇండియా అక్టోబర్ 2025 అమ్మకాల నివేదికను వెల్లడించింది. అందులో విపరీతంగా కొన్ని కార్లను అమ్మింది. హ్యూండాయ్ వెన్యూ, క్రెటా, ఎక్స్‌టర్ కార్లను విపరీతంగా కొన్నారు. మొత్తం 53,792 యూనిట్లు అమ్ముడయ్యాయి.

హ్యుండాయ్ కార్ల అమ్మకాలు
హ్యుండాయ్ ఇండియా అక్టోబర్ 2025లో ఎన్ని కార్లను అమ్మిందో ఆ అమ్మకాల వివరాలను వెల్లడించింది. ఆ కంపెనీ ప్రస్తుతం పది మోడళ్లను విక్రయిస్తోంది. క్రెటా మళ్లీ కంపెనీ నంబర్ 1 ఎస్‌యూవీగా నిలిచింది. వెన్యూ, ఎక్స్‌టర్ కూడా మంచి వృద్ధిని సాధించాయి. ఈ కార్లకు భారీగా అభిమానులు ఉన్నారు. అందుకే వీటి అమ్మకాలే భారీగా జరిగాయి
వెన్యూ అమ్మకాలు
ఎస్‌యూవీ విభాగంలో క్రెటా 18,381 యూనిట్లతో అగ్రస్థానంలో ఉంది. వెన్యూ అక్టోబర్‌లో 11,738 యూనిట్లు అమ్ముడైంది. ఎక్స్‌టర్ 6,294 యూనిట్ల అమ్మకాలతో మంచి స్థానంలో ఉంది. ఆరా, గ్రాండ్ ఐ10 నియోస్ కార్లను కూడా భారీగానే అమ్ముడయ్యాయి.
హ్యుందాయ్ ఇండియా రిపోర్ట్
వెర్నా, టూసాన్, ఐయానిక్ 5 కార్లను మాత్రం పెద్దగా కొనేందకు ఎవరూ ఇష్టపడడం లేదు. వీటి అమ్మకాలు 1,000 యూనిట్లకు కూడా చేరలేదు. అయినా, హ్యుందాయ్ మొత్తం అమ్మకాలు నిరంతరం పెరుగుతున్నాయి. క్రెటా, వెన్యూ, ఎక్స్‌టర్ వంటి ఎస్‌యూవీలే అధికంగా అమ్ముడవుతున్నాయి.