Success Story : పార్లె 20-20 బిస్కెట్స్ వెనక ఇంత స్టోరీ ఉందా..? ఇది కదా సక్సెస్ అంటే...
ఎన్ని ఫెయిల్యూర్స్ ఎదురైనా మన ప్రయత్నాన్ని ఆపకూడదు… విజయం దక్కేవరకు ముందుకు సాగాలి. ఇందుకు ఉదాహరణ పార్లే 20-20 సక్సెస్ స్టోరీ.

Parle 20-20 ఇలా పుట్టిందా?
Parle-G : కొన్నిసార్లు మనం ఎంత ప్రయత్నించినా విజయం వరించదు... కానీ కొన్నిసార్లు హటాత్తుగా జరిగిన సంఘటనలు ఊహించని సక్సెస్ అందిస్తాయి. ఇలాంటి అద్భుతమే ప్రముఖ అహార పదార్థాల సంస్థ పార్లే లో జరిగింది. అదే పార్లే 20-20 బిస్కెట్స్ ఎంత సక్సెస్ అయ్యిందో అందరికీ తెలిసిందే... ఇది ఆ కంపెనీ అత్యుత్తమ ఉత్పత్తుల్లో ఒకటిగా నిలిచింది. అయితే ఈ ప్రోడక్ట్ బయటకు వచ్చేముందు పార్లే అనేక ఫెయిల్యూర్స్ ను చూసింది... చివరికి ఓ సంఘటనతో ఇది సక్సెస్ అయ్యిందట. ఈ ఆసక్తికరమైన స్టోరీని గతంలో పార్లె మార్కెటింగ్ హెడ్ గా పనిచేసిన కృష్ణారావు బుద్ద యూట్యూబ్ పాడ్ కాస్ట్ రా టాక్స్ విత్ వికె లో వెల్లడించారు.
పార్లె 20-20 వెనక ఆసక్తికర స్టోరీ
పార్లె... ఇండియాలో ఈ పేరు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. చిన్నపిల్లల నుండి ముసలివారి వరకు ప్రతిఒక్కరు ఎప్పుడో ఒకసారి ఈ పార్లె ప్రోడక్ట్స్ తినివుంటారు... కనీసం చూసయినా వుంటారు. అంతటి చరిత్ర కలిగిన ఈ కంపెనీ కొన్నిసార్లు ప్రత్యర్థి కంపెనీల పోటీని తట్టుకునేందుకు ప్రయోగాలు చేయాల్సి ఉంటుంది. ఇలాంటి ప్రయోగాల నుండి పార్లే 20-20 బిస్కట్ పుట్టిందని సీనియర్ మార్కెటింగ్ నిపుణులు, పార్లెలో దాదాపు 24 ఏళ్లపాటు పనిచేసిన కృష్ణారావు బుద్ద తెలిపారు.
గుడ్ డే కు పోటీగా పార్లే 20-20
పార్లె ఉత్పత్తుల్లో పార్లె-జి ఎంత సక్సెస్ అయ్యిందో అందరికీ తెలిసిందే. స్వాతంత్య్రానికి పూర్వమే అంటే 1939 లో ప్రారంభమైన ఈ బిస్కెట్స్ ఉత్సత్తి ఇప్పటికీ కొనసాగుతోంది. అయితే మధ్యలో బ్రిటానియా నుండి పార్లె గట్టి పోటీని ఎదుర్కొంది. 1987లో భారత మార్కెట్లోకి బ్రిటానియా గుడ్ డే బిస్కెట్ బాగా సక్సెస్ అయ్యింది... దీనికి పోటీగా తమ ప్రోడక్ట్ తీసుకురావడానికి పార్లె ఎంతలా ప్రయత్నించింది? ఎన్ని ఫెయిల్యూర్స్ తర్వాత సక్సెస్ అయ్యింది? అనేది కృష్ణారావు బుద్ద వెల్లడించారు.
పార్లె సక్సెస్ కు ధోనీ టీం కూడా కారణమే...
గుడ్ డే కు పోటీగా మొదట పార్లె హైడ్ ఆండ్ సీక్ కుకీస్ తీసుకువచ్చింది... తర్వాత పార్లే కుకీస్, క్రంచి మంచి, గెలాక్సి కుకీస్ వంటి కొత్తకొత్త ప్రోడక్ట్స్ కూడా తీసుకువచ్చింది. కానీ ఏదీ అనుకున్నంత సక్సెస్ కాలేదు. ఇలా అనేక ఫెయిల్యూర్స్ తర్వాత ఓ సంఘటన పార్లెకు కలిసివచ్చింది.. అదే 2007 టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా విజయం. ఈ విజయంతో క్రికెట్ లో 20-20 ఫార్మాట్ బాగా ప్రాచుర్యం పొందింది.
పార్లె సక్సెస్ స్టోరీ
20-20 వరల్డ్ కప్ గెలిచాక టీమిండియా ఆటగాళ్లకు ముంబైలో ఘనస్వాగతం లభించింది... ఇది చూస్తుండగానే పార్లె ఛైర్మన్ కు ఓ ఆలోచన వచ్చిందని కృష్ణారావు బుద్ద తెలిపారు. ఈ 20-20 పేరుతో ఓ బిస్కెట్ బ్రాండ్ తీసుకువస్తే ఎలా ఉంటుందన్న ఆ ఆలోచలోంచే పార్లె 20-20 పుట్టిందని... తర్వాత ఇది ఎంత సక్సెస్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఇలా పార్లె 20-20 వెనకున్న ఆసక్తికర స్టోరీని యూట్యూబ్ పాడ్ కాస్ట్ రా టాక్స్ విత్ వికె లో వెల్లడించారు కృష్ణారావు.
యూట్యూబ్ పాడ్ కాస్ట్ రా టాక్స్ విత్ వికె కృష్ణారావు ఇంటర్వ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.