- Home
- Business
- భారత్ లో కూడా త్వరలో పెయిడ్ బ్లూటిక్ సర్వీసు ప్రారంభం, నెలకు ఎంత చెల్లించాలో తెలుసుకోండి..
భారత్ లో కూడా త్వరలో పెయిడ్ బ్లూటిక్ సర్వీసు ప్రారంభం, నెలకు ఎంత చెల్లించాలో తెలుసుకోండి..
ట్విట్టర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత, ఎలోన్ మస్క్ నిరంతరం అందులో మార్పులు చేయడంలో బిజీగా ఉన్నారు. ఇటీవలే వివాదాస్పదంగా మారి నిలిపివేసిన బ్లూటిక్ సర్వీసును తిరిగి ప్రారంభిస్తామని ప్రకటించారు మస్క్. 'బ్లూ వెరిఫైడ్ సర్వీస్ రాక్ సాలిడ్‌గా ఉందని నవంబర్ 29న మళ్లీ ప్రారంభిస్తామంటూ' మస్క్ ట్వీట్ చేశాడు.

ఎలాన్ మస్క్ ట్విట్టర్‌ని టేకోవర్ చేసిన తర్వాత అనేక మార్పులు పెద్ద ప్రకటనలు తెరపైకి వచ్చాయి. ట్విట్టర్ పెయిడ్ బ్లూ టిక్ సర్వీసు ఇటీవల మస్క్ ద్వారా పరిచయం చేయబడింది. దీని కింద యూజర్లు బ్లూ టిక్ కోసం 7.99 డాలర్లు చెల్లించాలని కోరారు. ఈ సర్వీసు ప్రారంభించిన తర్వాత, చాలా నకిలీ ఖాతాలు బ్లూ టిక్‌తో వెరిఫైడ్ అయిపోయాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని, కంపెనీ ఈ ఫీచర్‌ను వెంటనే సస్పెండ్ చేసింది.
అయితే ఇప్పుడు మళ్లీ ప్రజెంట్ చేసేందుకు మస్క్ సన్నాహాలు చేశాడు. బ్లూ టిక్‌ని నవంబర్ 29న రీలాంచ్ చేయనున్నట్లు ఎలాన్ మస్క్ ట్వీట్ ద్వారా తెలిపారు. ఇది కాకుండా, అన్ని ఖాతాల నుండి బ్లూ టిక్ తొలగించబడుతుందని మస్క్ ట్వీట్‌లో తెలిపారు. అంటే ఇప్పటికే బ్లూ టిక్ ఉన్న యూజర్లు మళ్లీ డబ్బులు చెల్లించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
అలాగే, ట్వీట్ థ్రెడ్‌లో, అధికారిక బ్యాడ్జ్ లేదా హైలైట్ సెలబ్రిటీ గురించి అడిగినప్పుడు, ఎవరు సెలబ్రిటీ, ఎవరు కాదో నిర్ణయించడం కష్టం అని మస్క్ చెప్పాడు. ఈ వ్యత్యాసాన్ని తెలుసుకునేందుకు ఆ అకౌంట్‌ను ఫాలో అవుతున్న వారి సంఖ్యను చూసి.. అదే సమయంలో అది వేరొకరి పేరు మీద క్రియేట్ అయ్యిందా అనేది నిర్ధారిస్తామని అంటున్నారు.
భారతదేశంలో బ్లూ సబ్‌స్క్రిప్షన్ ధరకు సంబంధించి, దీని కోసం యూజర్లు రూ. 719 చెల్లించి పొందవచ్చని పేర్కొన్నారు. అయితే ఈ ధరలో మార్పు వచ్చే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు.
elon musk
ట్విట్టర్ బ్లూ టిక్ పెయిడ్ సర్వీసు చేయగానే అమెరికాలో అనేక నకిలీ ట్విట్టర్ ఖాతాలు 8 డాలర్లు చెల్లించి ప్రముఖ సంస్థలు, ప్రముఖుల పేర్లతో ఫేక్ పేజీలను సృష్టించేశారు. ఏకంగా జీసస్ క్రైస్ట్ అనే నకిలీ ట్విట్టర్ ఖాతా 8 డాలర్లు చెల్లించి బ్లూ టిక్ తీసుకున్నాడో ఓ నకిలీ యూజర్. ఇలాంటి అనేక ఖాతాలు వెలుగులోకి వచ్చిన తర్వాత, ట్విట్టర్ బ్లూ టిక్స్ ఇచ్చే ప్రక్రియను నిలిపివేశారు.
ట్విట్టర్‌లో డొనాల్డ్ ట్రంప్, సూపర్ మారియో, జీసస్ క్రైస్ట్ పేర్లతో నకిలీ ఖాతాలను సృష్టించడం ద్వారా బ్లూ టిక్‌లు తీసుకున్న ఖాతాలను నిలిపివేయాలని ఎలాన్ మస్క్ హెచ్చరించాడు . ఫ్రముఖ ఫార్మా కంపెనీ Eli Lilly పేరిట కూడా ఓ ఫేక్ పేజ్ సృష్టించి 8 డాలర్లు చెల్లించి బ్లూటిక్ పొందిన ఓ యూజర్, ఆ పేజీలో ఫ్రీగా ఇన్సులిన్ ఇస్తామని చెప్పేశాడు. దీంతో Eli Lilly సంస్థ తాము ఆ ప్రకటన ఇవ్వలేదని సంజాయిషీ ఇవ్వాల్సి వచ్చింది.