OYO: ఇక ఓయో రూమ్స్‌లో ఆధార్ చూపించాల్సిన పనిలేదు.. ఎంత మంచి అవకాశమో
OYO: ఓయో రూమ్స్‌తో పాటు మరే ఇతర రూమ్స్ తీసుకోవాలన్నా ఫిజికల్ ఆధార్ కార్డు చూపించాల్సిందే. అయితే ఇకపై ఆ అవసరం లేకుండా యూనిక్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఇండియా (UIDAI) కొత్త సదుపాయాన్ని తీసుకొస్తోంది. ఇంతకీ అదేంటే.?

సెకన్లలో గుర్తింపు వెరిఫికేషన్
డిజిటల్ ఇండియా దిశగా కేంద్రం మరో కీలక అడుగు వేస్తోంది. UIDAI, కేంద్ర ప్రభుత్వం కొత్త ఆధార్ యాప్‌ను తీసుకొస్తున్నాయి. ప్రస్తుతం టెస్టింగ్ స్టేజ్‌లో ఉన్న ఈ యాప్‌ను త్వరలోనే అందరికీ అందుబాటులోకి తీసుకున్నారు. ఈ యాప్ సహాయంతో హోటల్స్, ఆసుపత్రులు, షాపులు, పరీక్షా కేంద్రాలలో కేవలం QR కోడ్ స్కాన్ ద్వారా మీ గుర్తింపు తక్షణమే ధృవీకరించవచ్చు. ఫింగర్‌ప్రింట్ లేదా ఐరిస్ స్కాన్ అవసరం ఉండదు, భద్రత గ్యారంటీ ఉంటుంది అలాగే సమయం కూడా ఆదా అవుతుంది.
అసలేంటీ యాప్.?
త్వరలోనే విడుదల కానున్న ఈ ఆధార్ యాప్ డిజిటల్ గుర్తింపు సౌలభ్యాన్ని అందిస్తుంది. ఇది mAadhaar యాప్ అప్డేట్ వెర్షన్‌గా చెప్పొచ్చు. ఈ యాప్ ద్వారా వ్యక్తిగత గుర్తింపు పూర్తి డిజిటల్ విధానంలోనే చెయ్యవచ్చు. "డిజిటల్ ఇండియా" లక్ష్యం సాధనలో ఇది పెద్ద అడుగుగా అభివర్ణిస్తున్నారు.
ఎలా పనిచేస్తుంది?
యూజర్ మొబైల్‌లో యాప్ ఓపెన్ చేసి QR కోడ్ స్కాన్ చేస్తే సరిపోతుంది. స్కాన్ చేసిన వెంటనే UIDAI సర్వర్ ద్వారా ఆధార్ వివరాలు వెరిఫై అవుతాయి. ఈ విధానం వల్ల నకిలీ ఆధార్ కార్డుల వాడకం తగ్గి, సెక్యూరిటీ పెరుగుతుంది. దీంతో పాటు మరెన్నో ఫీచర్లు ఈ కొత్త యాప్ ద్వారా తీసుకురానున్నారు.
ఉపయోగాలు
* ఆధార్ ఫోటోకాపీ ఇవ్వాల్సిన అవసరం లేదు.
* హోటల్స్, బ్యాంకులు, షాపులు, ఇతర పబ్లిక్ ప్లేస్‌లలో QR స్కాన్ ద్వారా గుర్తింపు వెంటనే వెరిఫికేషన్ అవుతుంది.
* సమయం ఆదా అవుతుంది, ప్రతి లావాదేవీ సులభతరం అవుతుంది.
ఫింగర్‌ప్రింట్ లేదా ఐరిస్ అవసరం లేదు
ఇకపై ఆధార్ వెరిఫికేషన్ కోసం బయోమెట్రిక్ అవసరం లేదు. వృద్ధులు, ఫిజికల్ ఇబ్బందులు కలిగిన వారు కూడా సులభంగా ఉపయోగించవచ్చు. అన్ని ప్రక్రియలు డిజిటల్‌గా పూర్తి అవుతాయి, వేగవంతంగా సులభంగా ఉంటుంది.
భద్రతా మార్పులు
ఇంతకుముందు ఆధార్ కార్డుల ఫోటోకాపీ దుర్వినియోగం అయ్యే అవకాశం ఉండేది. కొత్త యాప్‌లో మీ వ్యక్తిగత వివరాలు సురక్షితంగా ఉంటాయి, ఎక్కడా డేటా లీక్ అవ్వదు. ప్రింటౌట్ తీసుకెళ్ళాల్సిన అవసరం లేకుండా, ఆధార్ డిజిటల్ రూపంలోనే వినియోగించవచ్చు. ఈ కొత్త యాప్‌ను ఈ ఏడాది చివరిలో లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది.