Oppo: అద్భుతమైన ఫీచర్స్‌తో లాంచ్ అయిన Oppo F29, F29 ప్రో: ధర ఎంతో తెలుసా?
Oppo: ఒప్పో కంపెనీ ఇండియాలో F29 5G, F29 ప్రో 5G విడుదల చేసింది. ఈ రెండు ఫోన్లు దేనికవే స్పెషల్ ఫీచర్స్ ని కలిగి ఉన్నాయి. వన్ ప్లస్, శాంసంగ్ ఫోన్లకు పోటీగా ఒప్పో ఫోన్లు నిలుస్తున్నాయి. ఈ రెండు ఫోన్లలో ప్రత్యేకతలు తెలుసుకుందాం రండి.

Oppo తన కొత్త F29 సిరీస్‌ను ఇండియాలో విడుదల చేసింది. అవే F29 5G, Oppo F29 ప్రో 5G. ఇవి మార్కెట్లో ఇప్పటికే రిలీజ్ అయిన వన్ ప్లస్ నార్డ్ 4, శాంసంగ్ గెలాక్సీ A36, నథింగ్ ఫోన్ 3aతో పోటీ పడేలా ఉన్నాయి. ఎందుకంటే ఈ రెండు ఫోన్లు దాదాపు అలాంటి ఫీచర్లనే కలిగి ఉన్నాయి. కొత్త Oppo ఫోన్లలో ఉన్న ప్రత్యేక ఫీచర్ల గురించి పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి.
Oppo F29, Oppo F29 ప్రో: డిస్‌ప్లే
రెండు ఒప్పో ఫోన్లలో 6.7 అంగుళాల ఫుల్ HDతో పాటు అమోల్డ్ స్క్రీన్లు ఉన్నాయి. వీటిలో 1200 నిట్స్ మాక్సిమం బ్రైట్ నెస్, 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంది. IP66, IP68, IP69 రేటింగ్ లు ఉండటం వల్ల ఈ ఫోన్లు దుమ్మును రక్షణ కలిగి ఉంటాయి. నీటిలో పడినా దెబ్బతినవు.
Oppo F29, Oppo F29 ప్రో: ప్రాసెసర్
F29 ప్రో 5Gలో మీడియా టెక్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ ప్రాసెసర్ ఉంది. ఈ మోడల్‌కు రెండు OS అప్‌గ్రేడ్‌లు, మూడు సంవత్సరాల సెక్యూరిటీ ఫిక్స్‌లు వస్తాయి. ఇది ColorOS 15తో పనిచేస్తుంది. F29 5G విషయానికొస్తే ఇందులో స్నాప్ డ్రాగన్ 6 జెన్ 1 చిప్‌సెట్ ఉంది.
Oppo F29, Oppo F29 ప్రో: కెమెరా
ఒప్పో F29 ప్రో 5Gలో 16 మెగాపిక్సెల్ సోనీ ఫ్రంట్ కెమెరా, OISతో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉన్నాయి.
బేసిక్ F29 5Gలో 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ సెన్సార్, 50 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్ ఉన్నాయి.
Oppo F29, Oppo F29 ప్రో: బ్యాటరీ
బేసిక్ F29 5Gలో 45W ఛార్జింగ్ సపోర్ట్‌తో 6500mAh బ్యాటరీ ఉంది.
ప్రో వేరియంట్‌లో 80W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 6,000mAh బ్యాటరీ ఉంది.
Oppo F29, Oppo F29 ప్రో: ధర
F29 ప్రో 5G మూడు మోడల్స్‌లో లభిస్తుంది. 8GB RAM/128GB స్టోరేజ్ ధర రూ. 27,999, 8GB RAM/256GB స్టోరేజ్ ధర రూ. 29,999, 12GB RAM/256GB స్టోరేజ్ ధర రూ. 31,999.
F29 5G విషయానికొస్తే 8GB RAM/256GB వేరియంట్ ధర రూ. 25,999, 8GB RAM/128GB ధర రూ.23,999గా ఉంది.
ఇది కూడా చదవండి ఈ 4 సెట్టింగ్స్ మార్చకపోతే మీరు ఫోన్ డేంజర్‌లో ఉన్నట్టే!