MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Business
  • Ola Bike: దసరా పండుగ బంపర్ ఆఫర్ కేవలం రూ.49,999కే ఓలా బైక్, వారం రోజులే ఈ ఆఫర్

Ola Bike: దసరా పండుగ బంపర్ ఆఫర్ కేవలం రూ.49,999కే ఓలా బైక్, వారం రోజులే ఈ ఆఫర్

దసరా, దీపావళి పండుగ ఆఫర్ సందర్భంగా ఓలా ఎలక్ట్రిక్ బైక్ (Ola bike) చాలా తక్కువ ధరకే లభించబోతోంది.  ఓలా ఎలక్ట్రిక్ బైక్ 'ఓలా ముహూరత్ మహోత్సవ్' పేరుతో పండగ ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్ సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 1 వరకు ఉంటుంది.

2 Min read
Author : Haritha Chappa
Published : Sep 24 2025, 11:13 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఓలా ముహూరత్ మహోత్సవ్ ఆఫర్
Image Credit : our own

ఓలా ముహూరత్ మహోత్సవ్ ఆఫర్

మనదేశంలో పండగ సీజన్ కోసం ఓలా ఎలక్ట్రిక్ మంచి ఆఫర్‌తో ముందుకు వచ్చింది. 'ఓలా సెలబ్రేట్స్ ఇండియా' అనే ప్రత్యేక ప్రచారంలో భాగంగా 'ఓలా ముహూరత్ మహోత్సవ్' అనే కొత్త ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. దీని ద్వారా ఓలా S1 ఎలక్ట్రిక్ స్కూటర్లు, రోడ్‌స్టర్ X ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లు కేవలం రూ.49,999 ప్రారంభ ధరకే అందుబాటులో ఉన్నాయి. ఈ ఆఫర్ సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 1 వరకు మొత్తం తొమ్మిది రోజులు మాత్రమే ఉంటుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఓలా ఎలక్ట్రిక్ ఆఫర్
Image Credit : Google

ఓలా ఎలక్ట్రిక్ ఆఫర్

ఈ ఆఫర్లో కొన్ని వాహనాలు మాత్రమే అమ్మకానికి ఉంటాయి. కాబట్టి ముందుగా ఎవరు కొంటారో వారికే ముందు దక్కుతాయి.  ప్రతిరోజూ వాహనాలను బుక్ చేసుకునే ముహూర్త సమయాన్ని ఓలా తన సోషల్ మీడియాలో ప్రకటిస్తుంది. ఇందులో S1 X (2kWh) స్కూటర్, రోడ్‌స్టర్ X (2.5kWh) బైక్ ఒక్కొక్కటి రూ.49,999కే లభిస్తాయి. అధిక సామర్థ్యం గల S1 ప్రో+ (5.2kWh) స్కూటర్, రోడ్‌స్టర్ X+ (9.1kWh) బైక్ రూ.99,999కి అందిస్తారు.

Related Articles

Related image1
Apple iphone 17: నెలకి రూ.3,454 కట్టండి చాలు.. అదనపు వడ్డీ లేకుండా ఐఫోన్ 17 సొంతం చేసుకోవచ్చు
Related image2
5 రోజుల్లో 30% పెరిగిన ఓలా ఎలక్ట్రిక్ షేర్లు.. కొనాలా, అమ్మాలా లేక హోల్డ్ చేయాలా?
34
ఓలా స్కూటర్ ఆఫర్
Image Credit : Google

ఓలా స్కూటర్ ఆఫర్

ఈ ఆఫర్ తర్వాత, ఓలా తన రెగ్యులర్ మోడళ్ల అమ్మకాలను కొనసాగిస్తుంది. అందులో S1 ప్రో+ (5.2kWh, 4kWh) ధరలు రూ.1,69,999, రూ.1,51,999గా ఉన్నాయి. S1 ప్రో (4kWh, 3kWh) ధరలు రూ.1,37,999, రూ.1,20,999గా ఉన్నాయి. సాధారణ ప్రజల కోసం S1 X+ (4kWh) రూ.1,11,999కి, S1 X సిరీస్ (2kWh, 3kWh, 4kWh) రూ.81,999 నుంచి రూ.1,03,999 వరకు ధరలను నిర్ణయించారు.

44
రోడ్‌స్టర్ బైక్ ధర తగ్గింపు
Image Credit : Google

రోడ్‌స్టర్ బైక్ ధర తగ్గింపు

మోటార్‌సైకిల్ విభాగంలో రోడ్‌స్టర్ X (2.5kWh, 3.5kWh, 4.5kWh) ధరలు రూ.99,999 నుంచి రూ.1,24,999 వరకు ఉన్నాయి. రోడ్‌స్టర్ X+ (4.5kWh) రూ.1,27,499కి అమ్ముతున్నారు. కొత్త 4680 భారత్ సెల్ బ్యాటరీ టెక్నాలజీతో వచ్చే S1 ప్రో+ (5.2kWh) రూ.1,69,999కి, రోడ్‌స్టర్ X+ (9.1kWh) రూ.1,89,999కి లభిస్తాయి. ఇవి నవరాత్రుల నుంచి కస్టమర్లకు డెలివరీ అవుతాయి. అదనంగా, 2026 జనవరి నుంచి S1 ప్రో స్పోర్ట్ అనే కొత్త స్పోర్ట్స్ స్కూటర్ రూ.1,49,999 ధరతో ప్రారంభం కానుంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
వ్యాపారం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
మ‌రో రంగంలోకి ముఖేష్ అంబానీ.. ధ‌ర‌ 10 రూపాయ‌ల‌ నుంచే ప్రారంభం
Recommended image2
Facts: చెక్‌పై రాసే మొత్తానికి చివర ‘Only’ ఎందుకు రాస్తారు.? అసలు కారణం ఏంటంటే
Recommended image3
7th vs 8th Pay Commission: 8వ పే కమిషన్‌తో మారనున్న జీతాలు.. మీ చేతికి ఎంత వస్తుందో తెలుసా?
Related Stories
Recommended image1
Apple iphone 17: నెలకి రూ.3,454 కట్టండి చాలు.. అదనపు వడ్డీ లేకుండా ఐఫోన్ 17 సొంతం చేసుకోవచ్చు
Recommended image2
5 రోజుల్లో 30% పెరిగిన ఓలా ఎలక్ట్రిక్ షేర్లు.. కొనాలా, అమ్మాలా లేక హోల్డ్ చేయాలా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved