- Home
- Business
- Apple iphone 17: నెలకి రూ.3,454 కట్టండి చాలు.. అదనపు వడ్డీ లేకుండా ఐఫోన్ 17 సొంతం చేసుకోవచ్చు
Apple iphone 17: నెలకి రూ.3,454 కట్టండి చాలు.. అదనపు వడ్డీ లేకుండా ఐఫోన్ 17 సొంతం చేసుకోవచ్చు
ఆపిల్ తన కొత్త ఐఫోన్ 17ను (iphone) భారత్‌లో విడుదల చేసింది. ఆపిల్ ఫోన్లకు అభిమానులు ఎక్కువ. ఐఫోన్ 17 ధరలు పెరగడంతో ఎంతో మంది కొనేందుకు వెనుకాడుతున్నారు. దీన్ని ఈఎమ్ఐ పద్ధతిలో అదనపు వడ్డీ లేకుండా, నెలకు రూ.3,454 చెల్లించి ఈ ఫోన్‌ను కొనుగోలు చేయొచ్చు.

ఐఫోన్ 17 కొనాలనుకుంటున్నారా?
ఆపిల్ తన కొత్త ఐఫోన్ 17ను విడుదల చేసింది. ఈ ఫోన్ రాక కోసం ఎంతో మంది ఐఫోన్ ప్రేమికులు ఎదురుచూస్తూనే ఉన్నారు. ఒకేసారి మొత్తం డబ్బు పెట్టి ఈ ఫోన్ కొనలేని వారికి నో-కాస్ట్ ఈఎంఐ సదుపాయం ఉంది. నెలకు కేవలం రూ.3,454 చెల్లిస్తూ ఉంటే చాలు. అదనపు వడ్డీ లేకుండా ఈ ఫోన్ కొనొచ్చు.
ఫోన్ న్ని రంగుల్లో
ఐ ఫోన్ 17 కోసం విద్యార్థులు, ఉద్యోగులు అత్యధికంగా ఆసక్తి చూపిస్తున్నారు. వారు ఇలా నో కాస్ట్ ఈఎమ్ఐ పద్ధతిలో ఐఫోన్ 17 సొంతం చేసుకోవచ్చు. ఇది లావెండర్, సేజ్, మిస్ట్ బ్లూ, బ్లాక్, వైట్ వంటి రంగుల్లో లభిస్తుంది. A19 చిప్‌సెట్‌తో ఇది చాలా వేగంగా పనిచేస్తుంది. మిగతా ఐఫోన్లత పోలిస్తే ఇది ఎంతో ప్రత్యేకమైనది.
ఐఫోన్ 17 ధరలు ఇలా
ఐఫోన్ 17 ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. దీని బ్యాటరీ లైఫ్ ఎక్కువ కాలం వస్తుంది. ఇక ధరల విషయానికి వస్తే ఐఫోన్ 17 ధర రూ.82,900 నుంచి మొదలవుతుంది. ప్రో, ప్రో మ్యాక్స్ మోడల్స్ ధర రూ.1,34,900 నుంచి రూ.2,29,900 వరకు ఉంది. ఏ ఫోన్ అయినా మీరు నో కాస్ట్ ఈఎమ్ఐ పద్ధతిలో కొనవచ్చు.
ఎక్కడ కొనాలి?
నోకాస్ట్ ఈఎమ్ఐ పద్ధతిలో ఆపిల్ ఫోన్లు ఎక్కడ కొనాలా అని వెతుకుతున్నారా? దగ్గర్లో ఉన్న ఆపిల్ స్టోర్లకు వెళ్లచ్చు. లేదా క్రోమా, రిలయన్స్ డిజిటల్‌లో కూడా కొనవచ్చు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో కూడా ఈ సేల్ నడుస్తోంది. నో-కాస్ట్ ఈఎంఐతో పాటూ క్యాష్‌బ్యాక్ ఆఫర్లు కూడా దీనికి ఉన్నాయి.