ఈ పథకంలో మీ పిల్లలను చేర్చితే కోటీశ్వరులవుతారు
ప్రతి పేరెంట్స్ వారి పిల్లల భవిష్యత్తు కోసం ఎంతో కష్టపడతారు. వారి సంపాదనలో కొత్త మొత్తం దాచి అవసరమైన సమయంలో ఒకే సారి ఇచ్చేలా ప్లాన్ చేస్తుంటారు. అలాంటి ఓ అద్భుతమైన సెంట్రల్ గవర్నమెంట్ స్కీం గురించి ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నారు. ఈ పథకంలో మీ పిల్లలను చేర్చితే వారు భవిష్యత్తులో కోటీశ్వరులవుతారు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జూలై 2024 బడ్జెట్‌లో ఒక కొత్త పథకాన్ని ప్రకటించారు. ఈ పథకం NPS కింద పిల్లల కోసం పెన్షన్ పథకంగా రూపొందించి ప్రవేశ పెట్టారు. దీనిని NPS వాత్సల్య యోజన పథకం అని పిలుస్తారు. సెప్టెంబర్ 18 నుండి ఈ పథకం అమలులోకి వచ్చింది. NPS వాత్సల్య పథకం కింద 18 సంవత్సరాలలోపు ఏ మైనర్ అయినా ఈ పథకంలో చేరవచ్చు. పిల్లల పేరు మీద వారి తల్లిదండ్రులు కాని, గార్డియన్ గాని పెట్టుబడి పెట్టవచ్చు.
NPS వాత్సల్య యోజన అంటే ఏమిటి?
తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు కోసం పెన్షన్ ఖాతా ద్వారా పొదుపు చేయడానికి సహాయపడే పథకమే NPS వాత్సల్య యోజన (NPS Vatsalya Yojana). దీనిలో దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టడం ద్వారా సమ్మేళన వడ్డీ ప్రయోజనాన్ని పొందవచ్చు. NPS వాత్సల్య పథకంలో చేరాలంటే కనీసం రూ.1000 డిపాజిట్ చేయాలి. గరిష్టంగా ఎంతైనా కట్టొచ్చు.
NPS వాత్సల్య నిబంధనలు
PAN, ఆధార్ కార్డు ఉన్న 18 సంవత్సరాలలోపు ఏ మైనర్ అయినా ఈ ఖాతాను ప్రారంభించవచ్చు. ఈ పథకం కింద మీరు సంవత్సరానికి కనీసం రూ. 1000 పెట్టుబడి పెట్టాలి. ఆపై ఎంతైనా డిపాజిట్ చేయొచ్చు. సాధారణంగా ఆ వయసులో పిల్లలు సంపాదించలేరు కాబట్టి వారి పేరు మీద తల్లిదండ్రులు పెట్టుబడి పెట్టొచ్చు. పిల్లల వయసు 18 సంవత్సరాలు నిండిన తర్వాత ఈ ఖాతా సాధారణ NPS ఖాతాకు మార్చబడుతుంది. అప్పుడు 3 సంవత్సరాల లాక్-ఇన్ వ్యవధి ఉంటుంది. ఆ తర్వాత మీరు 25% మొత్తాన్ని 3 సార్లు ఉపసంహరించుకోవచ్చు.
NPS వాత్సల్య గణన
ఈ పథకం ద్వారా మీరు మీ పిల్లల పేరుపై సంవత్సరానికి కనీసం 2.5 లక్షల రూపాయలకు పైగా డిపాజిట్ చేయగలిగితే అందులో 80% మీ అవసరాలకు తీసుకోవచ్చు. మొత్తం మొత్తంలో 20% ఒకేసారి ఉపసంహరించుకోవచ్చు. మరణం సంభవించినప్పుడు పూర్తి మొత్తం సంరక్షకుడి పేరుకు బదిలీ అవుతుంది.
ఉదాహరణకు NPS వాత్సల్య యోజన కింద సంవత్సరానికి 10 వేల రూపాయలను 18 సంవత్సరాల పాటు డిపాజిట్ చేస్తున్నారని అనుకుందాం. NPS ఈక్విటీ కింద 14 శాతం, కార్పొరేట్ డెట్ కింద 9.1 శాతం, ప్రభుత్వ సెక్యూరిటీల ద్వారా 8.8 శాతం రాబడి వస్తుంది. ఇలా 18 సంవత్సరాల తర్వాత మొత్తం పెట్టుబడి 5 లక్షల రూపాయలు అవుతుంది. దీనిపై సంవత్సరానికి 10 శాతం లాభం వస్తుంది.
NPS వడ్డీ రేటు
ఈ మొత్తాన్ని 60 సంవత్సరాలు ఉంచితే 10% వార్షిక రాబడితో కలిపి మొత్తం కార్పస్ రూ.2.75 కోట్లు ఉంటుంది. అదే అప్పుడున్న ఫైనాన్సియల్ పరిస్థితుల రీత్యా 11.59% వార్షిక రాబడి వస్తే 60 సంవత్సరాల వయస్సులో ఈ కార్పస్ రూ.5.97 కోట్లు ఉంటుంది. అదేవిధంగా 12.86% వార్షిక రాబడి ఆధారంగా 60 సంవత్సరాల వయస్సులో మొత్తం కార్పస్ రూ.11.05 కోట్లు ఉంటుంది. అంటే మీ పిల్లలు వారి జీవితాల్లో లక్ష్యాలు చేరుకొని రిలాక్స్ అయ్యే టైం కి ఇలా రూ.కోట్లు వారికి సింపుల్ గా అందుతాయన్న మాట.
ఈ డాక్యుమెంట్లు ఇవ్వాలి
పిల్లల బర్త్ సర్టిఫికేట్, పాఠశాల బదిలీ సర్టిఫికేట్, మెట్రిక్యులేషన్ సర్టిఫికేట్, PAN, పాస్‌పోర్ట్ సబ్మిట్ చేయాలి. ఇవి కాకుండా గార్డియన్ వద్ద KYC గుర్తింపు, చిరునామా రుజువు (ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్, ఓటరు గుర్తింపు కార్డు, 100 రోజుల పథకం గుర్తింపు కార్డు మరియు జాతీయ జనాభా రిజిస్టర్) ఉండాలి. NRI అయితే NRE/NRO బ్యాంక్ ఖాతా ఉండాలి.