ఫోన్ పే, గూగుల్ పే చేసే వారికి ఇది శుభవార్తే!
ఆన్‌లైన్ పేమెంట్ యాప్స్ కి NPCI శుభవార్త చెప్పింది. 30% మార్కెట్ క్యాప్ పరిమితిని మళ్ళీ వాయిదా వేసింది. ముఖ్యంగా ఇది గూగుల్ పే, ఫోన్ పే కంపెనీలకు లాభం చేకూర్చే విషయం ఎందుకంటే 90 శాతం డిజిటల్ పేమెంట్స్ ఈ రెండు యాప్స్ ద్వారానే జరుగుతాయి. అందువల్ల వీటిని ఉపయోగించే వినియోగదారులకు కూడా ఇది శుభవార్తే అవుతుంది. అసలు విషయం ఏంటో ఇక్కడ క్లియర్ గా తెలుసుకుందాం రండి.
ప్రస్తుతం డిజిటల్ పేమెంట్ అంటే గూగుల్ పే లేదా ఫోన్ పే. ఈ రెండింటినే ఎక్కువగా ఉపయోగిస్తుంటారు కదా.. కాని ఆన్ లైన్ పేమెంట్స్ చేయడానికి ఇలాంటి యాప్ లు చాలా ఉన్నాయి. అయితే ఎక్కువ ప్రజాదరణ పొందినవి మాత్రం ఈ రెండే. అందుకే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఓ నిర్ణయం తీసుకుంది. డిజిటల్ పేమెంట్స్ ని ఎంకరేజ్ చేయడానికి ఇతర పేమెంట్ యాప్స్ కి కూడా అవకాశం ఇవ్వాలని 30% మార్కెట్ క్యాప్ లిమిట్ ని పెట్టింది. అయితే ఇప్పుడు ఆ నిర్ణయాన్ని వాయిదా వేసింది.
30% మార్కెట్ షేర్ నిబంధన
NPCI ప్రతిపాదించిన నియమం ప్రకారం ఒక్కొక్క UPI యాప్ 30% కంటే ఎక్కువ మార్కెట్ షేర్ కలిగి ఉండకూడదని నిర్ణయించారు. UPI సేవల్లో సమతుల్యతను తీసుకురావడం, మరిన్ని యాప్‌లకు అవకాశం కల్పించడమే ఈ నిర్ణయం వెనుక ఉద్దేశం. అందకే 30 % మార్కెట్ షేర్ పరిమితిని అమలు చేయడానికి మొదట డిసెంబర్ 31, 2024 వరకు గడువు ఇచ్చారు. కానీ ప్రస్తుతం PhonePe, Google Pay లాంటి యాప్‌లకు మార్కెట్‌లో ఎక్కువ శాతం ఉన్నందున ఈ నిబంధనను అమలు చేయడం కష్టం అవుతోంది. దాంతో NPCI ఈ గడువును డిసెంబర్ 31, 2026 వరకు పొడిగించింది. NPCI ఇలా గడువు పొడిగించడం ఇది రెండోసారి.
PhonePe, Google Pay వంటి యాప్‌లు UPI సేవల్లో మెజారిటీ యూజర్ల విశ్వాసం పొందాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఒకేసారి 30% షేర్ క్యాప్ పెట్టడం వల్ల వినియోగదారులకు అసౌకర్యం కలుగుతుందని భావిస్తున్నారు. చిన్నపాటి UPI యాప్‌లకు సమర్థత పెంచడం కోసం మరింత సమయం అవసరమని NPCI అంచనా వేసింది.
ఈ మేరకు PhonePe, Google Pay తదితర సంస్థలతో చర్చల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. PhonePe, Google Payకి లిమిటేషన్స్ పెడితే UPI వాడకం తగ్గుతుందని NPCI భావిస్తోంది. 2025 లో UPI లావాదేవీలు 10 రెట్లు పెరిగే అవకాశం ఉందని అంచనా.
PhonePe, Google Pay లాంటి యాప్‌లు తమ సేవలను కొనసాగించడానికి, వ్యాపారాన్ని పెంచుకోవడానికి మరింత సమయం లభించింది. అయితే ఇతర యాప్‌లను కూడా ఎంకరేజ్ చేసి ఎక్కువ డిజిటల్ పేమెంట్స్ జరిగేలా చూడాలని NPCI ప్రయత్నిస్తోంది. అందువల్ల వినియోగదారులకు ప్రస్తుతం ఎటువంటి మార్పులు ఉండవు.
ఈ నిర్ణయం డిజిటల్ పేమెంట్స్ ప్రపంచంలో సమతుల్యతను తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తుంది. 2026 నాటికి అన్ని యాప్‌లు 30% మార్కెట్ షేర్ పరిమితిని పాటించాల్సి ఉంటుంది.
NPCI నిర్ణయం ఫోన్ పే, గూగుల్ పే లకు ప్రస్తుతం లాభం చేకూర్చినట్లే. దాదాపు 90% UPI లావాదేవీలు ఈ యాప్స్ ద్వారా జరుగుతాయి.
WhatsApp పే పై ఉన్న అన్ని వినియోగదారుల పరిమితులను NPCI తొలగించింది. దీంతో 500 మిలియన్లకు పైగా WhatsApp వినియోగదారులు UPI వాడుకోవచ్చు.