వాట్సాప్ లో ఆధార్ కార్డు ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి?
How Download Aadhaar Card From Whatsapp: ఆధార్ కార్డు ను ఇప్పుడు వాట్సాప్ ద్వారా కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వాట్సాప్ లో MyGov Helpdesk చాట్‌బాట్ ద్వారా సురక్షితంగా ఆధార్ కార్డును పీడీఎఫ్ రూపంలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ప్రతిచోట ఆధార్ కార్డు అవసరం
ఆధార్ కార్డు ప్రస్తుతం ప్రతి భారతీయుడికి తప్పనిసరి గుర్తింపు కార్డుగా మారింది. బ్యాంకింగ్ సేవలు, ప్రభుత్వ పథకాలు, మొబైల్ సిమ్, పాఠశాల అడ్మిషన్లు, ప్రయాణం వంటి అనేక అవసరాలకు ఆధార్ కార్డు అవసరం అవుతుంది.
ప్రతి పౌరుడు దానిని కలిగి ఉండటం తప్పనిసరిగా మారింది. ఆధార్ హార్డ్ కాపీ లేని సమయంలో మీరు సాఫ్ట్ కాపీతో కూడా మీ పనిని పూర్తి చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు వాట్సాప్ లో కూడా ఆధార్ కార్డును డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
వాట్సాప్ లో ఆధార్ డౌన్‌లోడ్ సౌకర్యం
ఆధార్ కార్డు ప్రతిచోట అవసరం కావడంతో ప్రభుత్వం వాట్సాప్ లో కూడా ఆధార్ కార్డు సేవలను తీసుకొచ్చింది. ఇప్పుడు కొత్తగా వాట్సాప్ (WhatsApp) ద్వారా ఆధార్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
మన వద్ద ఫోటోకాపీ లేదా స్కాన్ కాపీ లేకపోయినా, కేవలం వాట్సాప్ సహాయంతో పీడీఎఫ్ రూపంలో ఆధార్ కార్డు పొందవచ్చు. ఈ సౌకర్యం MyGov Helpdesk అధికారిక వాట్సాప్ నంబర్ ద్వారా అందుబాటులోకి వచ్చింది.
వాట్సాప్ లో ఆధార్ కార్డు సేవలు పొందడం ఎలా?
వాట్సాప్ లో ఆధార్ కార్డు పొందడానికి కొన్ని ముఖ్యమైన కండీషన్లు ఉన్నాయి. వాటిలో
• మీ ఆధార్‌కి లింక్ అయిన మొబైల్ నంబర్ ఉండాలి.
• డిజిలాకర్ అకౌంట్ ఉండాలి. అది లేకుంటే వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్‌లో సులభంగా క్రియేట్ చేసుకోవచ్చు.
• MyGov Helpdesk అధికారిక వాట్సాప్ నంబర్ +91-9013151515 మీ ఫోన్‌లో సేవ్ చేసుకోవాలి.
వాట్సాప్ లో ఆధార్ కార్డు ను డౌన్ లోడ్ చేసుకోవడం ఎలా? స్టెప్-బై-స్టెప్ ప్రాసెస్
1. ముందుగా +91 9013151515 నంబర్‌ను "MyGov Helpdesk" పేరుతో ఫోన్‌లో సేవ్ చేసుకోండి.
2. వాట్సాప్ ఓపెన్ చేసి ఆ నంబర్‌కి "Hi" లేదా "Namaste" అని మెసేజ్ పంపాలి.
3. చాట్‌బాట్ మీకు పలు ఆప్షన్లు ఇస్తుంది. వాటిలో "DigiLocker Services" ను ఎంచుకోవాలి.
4. మీరు DigiLocker అకౌంట్ కలిగి ఉన్నారా అని అడుగుతుంది. అకౌంట్ లేకుంటే ముందుగా DigiLockerలో రిజిస్టర్ కావాలి.
5. ఇప్పుడు మీ 12 అంకెల ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేయాలి.
6. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది. దానిని వాట్సాప్ చాట్‌లో ఎంటర్ చేయాలి.
7. వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత DigiLockerలో ఉన్న మీ డాక్యుమెంట్ల జాబితాను చూపిస్తుంది.
8. అందులో ఆధార్‌ను ఎంచుకుని నంబర్ టైప్ చేయాలి.
9. కొన్ని సెకన్లలోనే మీ ఆధార్ కార్డు PDF రూపంలో WhatsApp చాట్‌లో కనిపిస్తుంది.
UIDAI తో పాటు ఎంఆధార్ నుంచి కూడా ఆధార్ కార్డును పొందవచ్చు
ఇప్పటి వరకు UIDAI వెబ్‌సైట్ లేదా mAadhaar యాప్ ద్వారా ఆధార్ కార్డు డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం ఉండేది. అలాగే DigiLockerలో కూడా ఇది లభించేది. కానీ ఇప్పుడు వాట్సాప్ సౌకర్యం చేరడంతో, మరింత సులభంగా, వేగంగా ఆధార్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రత్యేకంగా ప్రయాణాల్లో లేదా అత్యవసర సందర్భాల్లో ఈ సౌకర్యం ఎంతో ఉపయోగకరంగా మారనుంది.