న్యూ ఇయర్ షాపింగ్: టాప్ ప్లేస్ లో ఉన్న ఐటమ్ ఏంటో తెలుసా?
2025 నూతన సంవత్సర వేడుకలు ప్రపంచవ్యాప్తంగా ధూంధాం గా జరిగాయి. బాణసంచా పేలుళ్లు, కేక్ కటింగులు, రెస్టారెంట్స్ కి వెళ్లడం, మందు పార్టీలు ఇలా రకరకాలుగా ప్రజలంతా ఫుల్ గా ఎంజాయ్ చేశారు. ఈ క్రమంలో ఫుడ్ ఐటమ్స్ నుంచి డ్రెస్సులు, నగలు, గిఫ్టులు ఇలా రకరకాల వస్తువులను ఆన్ లైన్ లో ఆర్డర్ పెట్టి కొనుగోలు చేశారు. ఈ వేడుకల్లో ఎక్కువ మంది ప్రజలు ఏ ఐటమ్ ఆర్డర్ చేశారో తెలుసుకుందాం రండి.
జొమాటో, స్విగ్గీ, ఇన్‌స్టామార్ట్‌లలో మీరు ఊహించనటువంటి కొన్ని వస్తువులు బాగా ఆర్డర్ అయ్యాయి. నూతన సంవత్సర వేడుకలు జరపడానికి జరుపుకోవడానికి ప్రజలు రకరకాల వస్తువులను కొనుగోలు చేశారు. బ్లింకిట్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, జొమాటో వంటి వేదికల్లో ఆర్డర్‌లు పెరిగాయి. నూతన సంవత్సర వేడుకలకు వివిధ రకాల వస్తువులను కస్టమర్‌లు ఆర్డర్ చేశారు. వాటిలో అత్యధికంగా అమ్ముడైన కొన్ని వస్తువులను చూద్దాం.
టాప్ లో ఉన్న ఐటమ్ ఇదే..
బ్లింకిట్ CEO అల్బిందర్ ధిండ్సా తన ఎక్స్ పోస్ట్‌లో కొత్త సంవత్సరం సందర్భంగా ఇండియాలో ఏ వస్తువులను ఎక్కువగా కొనుగోలు చేశారో తెలిపారు. దేశ వ్యాప్తంగా బ్లింకిట్ కు వచ్చిన ఆర్డర్లలో ‘ఆలు భుజియా’ అగ్రస్థానంలో నిలిచింది. ఆలు భుజియా అంటే ఇదొక క్రంచీ స్నాక్స్ ఐటమ్. ఇది సలాడ్స్, ఛాట్స్, భేల్ పూరి కంటే టేస్టీగా ఉంటుంది.
నూతన సంవత్సరం రోజున దేశ వ్యాప్తంగా 2,34,512 ఆలు భుజియా ప్యాకెట్లకు ఆర్డర్ వచ్చింది. అందుకే ఈ ఐటమ్ టాప్ 1 పొజిషన్ లో ఉంది. రెండో స్థానంలో 45,531 టానిక్ వాటర్ డబ్బాలు, తర్వాతి స్థానంలో 6,834 ఐస్ క్యూబ్స్ ప్యాకెట్లు, 1,003 లిప్‌స్టిక్‌లు, లైటర్‌లు నూతన సంవత్సర వేడుకల కోసం ఆర్డర్ చేశారు. తదుపరి 10 నిమిషాల్లో అన్నీ డెలివరీ అవుతాయని బ్లింకిట్ CEO అల్బిందర్ ధిండ్సా పేర్కొన్నారు.
ఇక స్విగ్గీ విషయానికొస్తే స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ సహ వ్యవస్థాపకుడు ఫణి కిషన్ తెలిపిన వివరాల ప్రకారం దేశ వ్యాప్తంగా నూతన సంవత్సర రోజున భారీ సంఖ్యలో ఐస్ ఆర్డర్లు అందాయట. డిసెంబర్ 31 నేడు రాత్రి 7:41 గంటలకు 119 కిలోల ఐస్ డెలివరీ చేసినట్లు స్విగ్గీ సహ వ్యవస్థాపకుడు వెల్లడించారు. చెన్నైలో కోల్డ్ డ్రింక్స్ ఆర్డర్‌లు రెట్టింపు అయ్యాయి. వీటితో పాటు ముంబై, బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో భారీ సంఖ్యలో ఆర్డర్లు ముందంజలో ఉన్నాయి. నూతన సంవత్సర ఆర్డర్‌లలో స్నాక్స్ కంటే పురుషుల డ్రాయర్లు, బనియన్లు ఎక్కువగా ఆర్డర్ అయ్యాయని ఫణి కిషన్ ప్రకటించారు. ఇది చాలా చిత్రమైన విషయమని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు.