ముకేశ్ అంబానీకి అజ్ఞాతవాసి నుండి ఇమెయిల్ ! రూ.400 కోట్లు ఇవ్వకుంటే ఊరుకునేది లేదని మళ్లీ బెదిరింపు!
400 కోట్లు డిమాండ్ చేస్తూ రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీకి గుర్తు తెలియని వ్యక్తి నుంచి మరో బెదిరింపు ఇమెయిల్ వచ్చిందని పోలీసులు నేడు మంగళవారం తెలిపారు. అంబానీ కంపెనీకి సోమవారం కూడా ఈమెయిల్ వచ్చింది. నాలుగు రోజుల్లో అంబానీకి ఈ రోజు వచ్చింది మూడో బెదిరింపు ఇమెయిల్ అని పోలీసు అధికారి తెలిపారు.
ఇంతకుముందు కూడా గుర్తుతెలియని వ్యక్తి నుంచి రూ.20 కోట్లు ఇవ్వాలని తొలి ఇమెయిల్ వచ్చింది. అంబానీ సెక్యూరిటీ గార్డు చేసిన ఫిర్యాదు ఆధారంగా గామ్‌దేవి పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది.
గత శనివారం రిలయన్స్‌కు అదే వ్యక్తి నుంచి రూ.200 కోట్లు కావాలని మరో ఇమెయిల్ వచ్చింది. మొదటి మెయిల్‌కు సమాధానం రాకపోవడంతో ఈ మొత్తం పెంచినట్లు పేర్కొంది.
దింతో సోమవారం మూడవ ఇమెయిల్ వచ్చింది. 400 కోట్లకు డిమాండ్ రెట్టింపు చేసిందని ఓ పోలీసు అధికారి చెబుతున్నారు. ముంబయి పోలీసులు, క్రైమ్ బ్రాంచ్ ఇంకా సైబర్ టీం ఇమెయిల్ పంపిన వారిని కనుగొనే పనిలో ఉన్నాయని ఆయన తెలిపారు.
బెల్జియం నుండి ఒకే ఇమెయిల్ ఐడి నుండి మూడు ఇమెయిల్‌లు పంపినట్లు పోలీసులు గుర్తించారు. పంపిన వ్యక్తి షదాబ్ ఖాన్ అని కూడా తెలిసిందన్నారు.
గతేడాది కూడా అంబానీకి, అతని కుటుంబ సభ్యులకు బెదిరింపు కాల్స్ చేసినందుకు బీహార్‌లోని దర్భంగాకు చెందిన ఓ వ్యక్తిని ముంబై పోలీసులు అరెస్టు చేశారు. ముంబయిలోని హెచ్‌ఎన్ రిలయన్స్ ట్రస్ట్ ఆస్పత్రిని పేల్చివేస్తామని నిందితులు బెదిరించారు.