ముకేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ భర్త సంపద ఎంతో తెలుసా.. షాక్ అవుతారు..
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఏకైక కుమార్తె ఇషా అంబానీని పిరమల్ గ్రూప్ వ్యవస్థాపకుడు అజయ్ పిరమల్ కుమారుడు ఆనంద్ 2018లో వివాహం చేసుకున్నారు. రెండు కుటుంబాలు దేశంలోని అత్యంత సంపన్న కుటుంబాలలో ఒకటి.
ప్రపంచంలోని బిలియనీర్లలో ముఖేష్ అంబానీ ఐదవ స్థానంలో ఉన్నారు. ఇషా అంబానీ భర్త అనగా అజయ్ పిరమల్ ఈ జాబితాలో 1267 వ స్థానంలో ఉన్నారు. ముఖేష్ అంబానీతో ఎంతమంది ధనవంతులు ఉన్నారో, వారు ఏమి చేస్తారో తెలుసుకుందాం..
ఇషా అంబానీ ఆనంద్ పిరమల్ 12 డిసెంబర్ 2018న వివాహం చేసుకున్నారు. ప్రతుత్తం ఆనంద్, పిరమల్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు.
దేశంలోని టాప్ 50 ధనవంతులలో ఒకరైన అజయ్ పిరమల్ తాత 1920 లో ఈ పిరమల్ గ్రూప్ ని ప్రారంభించారు. 1977లో 22 సంవత్సరాల వయస్సులో, అజయ్ పిరమల్ తన కుటుంబ వ్యాపారాన్ని చేపట్టి గొప్ప స్థాయికి చేరుకున్నాడు. 2005లో అజయ్ పిరమల్ కుమారుడు ఆనంద్ వ్యాపార ప్రవేశం తరువాత, పిరమల్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా నియమితులయ్యారు.
ఆనంద్ పిరమాల్ వయసు 25 ఆక్టోబర్ 1985లో జన్మించారు. ప్రస్తుతం ఇతని వయసు 34 ఏళ్ళు, హార్వర్డ్ బిజినెస్ స్కూల్ చదువు పూర్తి చేశాడు. ఇక ఈశ అంబానీ 23 ఆక్టోబర్ 1991లో జన్మించారు. ఈమె వయసు 28 ఏళ్ళు, ముకేష్ అంబానీ ఏకైక కుమార్తె. విదేశాలలో చదువు పూర్తి చేసింది.
పిరమల్ వ్యాపారం ప్రపంచవ్యాప్తంగా 100కి పైగా నగరాల్లో విస్తరించి ఉంది. అజయ్ పిరమల్ ఫార్మాస్యూటికల్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్, రియల్ ఎస్టేట్, గ్లాస్ ప్యాకేజింగ్ రంగాలలో వ్యాపారం నిర్వహిస్తున్నారు.
నికర విలువ విషయంలో ముఖేష్ అంబానీ తన భాగస్వామి అజయ్ పిరమల్ కంటే చాలా ముందున్నారు. రిలయన్స్ గ్రూప్ దేశంలో ఒక అతిపెద్ద సమూహం, ముఖేష్ అంబానీ దేశంలో అత్యంత ధనవంతుడు కూడా.
ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితా ప్రకారం, అజయ్ పిరమల్ ప్రస్తుతం ప్రపంచంలో 1267వ ధనవంతుడు. ముఖేష్ అంబానీ ఈ జాబితాలో 5 వ స్థానంలో ఉన్నారు. అజయ్ పిరమల్ మొత్తం సంపద 2.5 బిలియన్ డాలర్లు అంటే రూ .18,400 కోట్లు. ఇషా అంబానీ భర్త ఆనంద్ తండ్రి అయిన అజయ్ పిరమల్ ముఖేష్ అంబానీ సంపదలో పదోవంతుకు సమానమైన ఆస్తులను కలిగి ఉన్నారు.