- Home
- Business
- Business Ideas: మోదీ ప్రభుత్వం అందిస్తున్న ముద్రా రుణాలతో ఈ మూడు తిరుగులేని వ్యాపారాలు చేస్తే..లక్షల్లో ఆదాయం
Business Ideas: మోదీ ప్రభుత్వం అందిస్తున్న ముద్రా రుణాలతో ఈ మూడు తిరుగులేని వ్యాపారాలు చేస్తే..లక్షల్లో ఆదాయం
వ్యాపారం చేయడమే మీ లక్ష్యమా, ఏ వ్యాపారం చేయాలో మీకు అర్థం కావడం లేదా. అయితే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి ముద్రా రుణాలతో మీరు పలు వ్యాపారాలను ప్లాన్ చేసుకోవచ్చు. ముఖ్యంగా ముద్రా రుణాలను నిరుద్యోగ యువతకు కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది. ముద్ర రుణం కిందట మనకు 50 వేల నుంచి పది లక్షల వరకు రుణాలను అందిస్తున్నారు.

ముద్రా రుణాలను వాణిజ్య బ్యాంకులు స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, కోపరేటివ్ బ్యాంకులు, ఇతర NBFCల నుంచి పొందవచ్చు. ప్రధాని నరేంద్ర మోడీ 2015 ఏప్రిల్ 8న ఈ స్కీంను ప్రారంభించారు. ఈ స్కీమ్ ద్వారా శిశు, కిషోర్, తరుణ్ విభాగాల కింద రుణాలను అందిస్తారు. 50వేల లోపు రుణాలను శిశు రుణాలు అంటారు. ఇక 50 వేల నుంచి ఐదు లక్షల లోపు రుణాలను కిషోర్ విభాగంలో రుణాలను అందిస్తారు, ఇక ఐదు లక్షల నుంచి పది లక్షల లోపు రుణాలను తరుణ్ స్కీం కింద అందిస్తారు. ఈ రుణాలను వ్యాపారం చేస్తున్న వారు సైతం తీసుకోవచ్చు.
ఇక ముద్రా రుణం ఉపయోగించి మీరు ఏమేమి వ్యాపారాలు చేయవచ్చు తెలుసుకుందాం. ముందుగా అన్ని ప్రాంతాలను అన్ని నగరాల్లోనూ అన్ని పట్టణాల్లోనూ ఏ ప్రదేశం లోనైనా అవసరమైనది ఒక కిరాణా షాపు, దీని ఏర్పాటు చేసుకుంటే మనకు మంచి ఆదాయం లభించే అవకాశం ఉంది. స్థానికంగా ప్రజలు ఏమేం వస్తువులు వాడుతున్నారో నిత్యవసర వస్తువులు అలాగే కాస్మోటిక్స్, గృహోపకరణాలు, ఇతర పచారీ సామాన్లు, అన్నింటినీ అందుబాటులో ఉంచుకోవడం ద్వారా ఈ కిరాణా కొట్టును ఏర్పాటు చేసుకోవచ్చు. కిరాణా సామాన్లను మనం హోల్సేల్ మార్కెట్ నుంచి తెచ్చుకొని లాభం మార్జిన్ నిర్ణయించుకొని విక్రయిస్తే చక్కటి ఆదాయం మీకు లభిస్తుంది. అలాగే, కూల్ డ్రింక్స్, బ్రెడ్డు, కోడిగుడ్లు వంటి వస్తువులను అందుబాటులో ఉంచుకోవడం ద్వారా కూడా మంచి ఆదాయం పొందే వీలుంది.
ముద్రా రుణం ద్వారా ఏర్పాటు చేసుకునే మరొక వ్యాపార అవకాశం గురించి ఇప్పుడు చూద్దాం. స్టేషనరీ షాపును ఏర్పాటు చేసుకోవడం ద్వారా మీరు ప్రతి నెల చక్కటి ఆదాయం పొందే వీలుంది. ముఖ్యంగా కాలేజీలు స్కూల్లో అలాగే కార్యాలయాలు ఉన్న ప్రదేశంలో స్టేషన్ ఏర్పాటు చేసుకుంటే చక్కటి ఆదాయం పొందే వీలుంది. ముఖ్యంగా జిరాక్స్ మెషిన్ అలాగే ప్రింటర్ ఉంచుకోవడం ద్వారా మీకు ప్రతిరోజూ పని లభిస్తుంది. అదేవిధంగా నోటు పుస్తకాలు పెన్నులు విద్యార్థులకు ఉపయోగపడే అన్ని వస్తువులు బొమ్మలు ఇతర పుస్తకాలు టెక్స్ట్ బుక్కులు వంటివి షాప్ లో విక్రయించడం ద్వారా మీకు చక్కటి లాభం లభిస్తుంది. ఈ వస్తువులు పాడైపోవు కావున ఎంతకాలమైనా వీటిని షాపులోనే ఉంచి విక్రయించడం ద్వారా మీకు ఆదాయం లభిస్తుంది.
అదేవిధంగా ముద్రా రుణాలతో మీరు ఒక కూరగాయల షాపును కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. ముఖ్యంగా కాలనీలు టౌన్ షిప్స్ అదేవిధంగా జన సముదాయం అత్యధికంగా ఉండే ప్రదేశాల్లో ఈ కూరగాయల షాపును ఏర్పాటు చేసుకోవడం ద్వారా మీరు చక్కటి ఆదాయం పొందవచ్చు. కూరగాయల షాపుల కోసం మీరు రైతుల వద్ద నుంచి నేరుగా కూరలను కొనుగోలు చేసుకుని విక్రయిస్తే, మంచి లాభం పొందే వీలుంది. అలాగే కూరగాయల షాపులోనే పండ్లను కూడా విక్రయిస్తే మంచి ఆదాయం పొందవచ్చు.
ముద్రా రుణంతో బేకరీ ఏర్పాటు చేసుకోవడం ద్వారా కూడా చక్కటి ఆదాయం పొందే వీలుంది. ముఖ్యంగా బేకరీ ఐటమ్స్ తయారీ కోసం మీరు డిప్లమా కోర్సులు చేయాల్సి ఉంటుంది. తద్వారా మీకు బేకరీ ఐటమ్స్ అయినటువంటి బిస్కెట్లు, కేకులు, చిరుతిళ్లను మీరు స్వయంగా తయారు చేయడం నేర్చుకుంటే పని వాళ్ళ మీద ఆధారపడకుండా చక్కటి ఆదాయం పొందే వీలుంది.