Modi Gold: ఇదిగో మోడీ గోల్డ్ .. తులం బంగారం ధర 37 వేల రూపాయలే
బంగారం కొనాలనుకునే వారికి కేంద్ర ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇచ్చింది. 37 వేల రూపాయలకే తులం బంగారాన్ని అందిస్తోంది. అది కూడా హాల్ మార్క్ తో. ఇంత తక్కువ ధరకు బంగారం ఎలా వస్తుందో అని ఆశ్చర్యం వేస్తోందా? అయితే తెలుసుకోండి.

మోడీ గోల్డ్ అంటే?
బంగారం పేరు వింటేనే భారతీయ మహిళల మనసు సంతోషంతో నిండిపోతుంది. బంగారం కొనాలని ప్రతి మహిళ కలగంటుంది. కానీ ధరలు పెరిగిపోవడంతో బంగారం కొనాలంటేనే భయపడుతున్నారు. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం హాల్ మార్క్ బంగారాన్ని తులం 37 వేల రూపాయలకే అందిస్తోంది. ఆ బంగారం 9 క్యారెట్ల గోల్డ్. దీన్నే మోడీ గోల్డ్ అని పిలుచుకుంటారు.
అతి తక్కువ ధరకే బంగారం
పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం కొనాలంటే మీరు లక్షన్నర రూపాయలకు పైగా ఖర్చు పెట్టాల్సిందే. బంగారంలో 9 క్యారెట్లు, 14 క్యారెట్లు, 18 క్యారెట్లు, 22 క్యారెట్లు, 24 క్యారెట్...లు ఇలా వివిధ విభాగాల్లో బంగారం లభిస్తుంది. వాటి క్యారెట్లను బట్టి బంగారం విలువ ఆధారపడి ఉంటుంది. హాల్ మార్క్ ఉన్న బంగారాన్ని మాత్రమే మీరు కొనాలి
హాల్ మార్క్ తప్పనిసరి
అయితే 9 క్యారెట్ల బంగారు ఆభరణాలకు మొన్నటి వరకు ఎలాంటి హాల్‌మార్కు లేదు. దాంతో ఆ బంగారంలో కూడా మోసాలు జరగడం మొదలయ్యాయి. అందుకే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హాల్ మార్క్ నిబంధనలను సవరించింది. 9 క్యారెట్ల బంగారు ఆభరణాలు కూడా హాల్ మార్క్ తప్పనిసరి చేసింది. తొమ్మిది క్యారెట్ల నుంచి 24 క్యారెట్ల వరకు బంగారు నగలు ఏవైనా కూడా వాటికి హాల్ మార్క్ తప్పనిసరి.
కేంద్రం ఎందుకిలా చేసింది?
ఒకపక్క ధరలు పెరగడం.. మరోపక్క మోసాలు కూడా ఎక్కువ అవడంతో బంగారం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటోంది కేంద్ర ప్రభుత్వం. బంగారం కొనుగోలు చేసే వారిలో విశ్వాసం పెరగడానికి కేంద్రం ఇలా చేస్తున్నట్టు వివరిస్తోంది. అలాగే తక్కువ ధరకే జ్యువెలరీని అందించడం కూడా దీని ఉద్దేశం. 24 క్యారెట్లు, 22 క్యారెట్ల బంగారాన్ని కొనలేని వారు తొమ్మిది క్యారెట్ల బంగారాన్ని కొనే అవకాశం ఉంటుంది. పది గ్రాముల తొమ్మిది క్యారెట్ల బంగారం ధర 37వేల రూపాయలకే వస్తుంది. 24 క్యారెట్ల బంగారంతో పోల్చితే ఇది చాలా తక్కువ ధరకే లభిస్తుంది.
హాల్ మార్క్ ఇలా చెక్ చేయండి
బంగారు నగలు కొనుగోలు చేసే ముందు ప్రతి ఒక్కరు కూడా హాల్ మార్కును చెక్ చేయాలి. హాల్ మార్క్ ఉన్న బంగారమే స్వచ్ఛమైనదని అర్థం. మీరు కొని బంగారం నగలు పై BIS లోగో ఉండాలి. దాని ప్యూరిటీని కూడా చెక్ చేసుకోవాలి. ప్రతి జ్యువెలరీకి ఒక కోడ్ ఉంటుంది. దాన్ని కూడా మీరు చెక్ చేసుకోవాలి. ప్రతి ఆభరణానికి 6 అంకెల హాల్ మార్క్ ఐడి ఉంటుంది. మీరు BIS యాప్ లో ఆ బంగారు ఆభరణం తాలూకు వివరాలను తెలుసుకోవచ్చు.