- Home
- Business
- Gold Rates: ఈ ఏడాదే బంగారం కొనేయండి, 2026లో తులం బంగారం ఎంతవుతుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు
Gold Rates: ఈ ఏడాదే బంగారం కొనేయండి, 2026లో తులం బంగారం ఎంతవుతుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు
మన దేశంలో బంగారానికి ఎంతో డిమాండ్ ఉంది. అందుకే బంగారం ధరలు కూడా ఎప్పుడు పెరుగుతూనే ఉంటాయి. ప్రపంచ మార్కెట్లో ఉన్న అస్థిరత వల్ల ఇప్పుడు బంగారం అమాంతం పెరిగిపోతోంది. 2026 నాటికి మరింతగా పెరిగే అవకాశం ఉంది.

ఈ ఏడాదే బంగారం కొనేయండి
మనదేశంలో ఆడవారికి బంగారం అంటే ఎంతో ఇష్టం. అందుకే ప్రతి ఏడాది విపరీతంగా కొనుగోళ్లు జరుగుతాయి. ఇప్పుడు ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర లక్ష రూపాయలు దాటింది. అదే 10 గ్రాముల వస్తువు కావాలంటే లక్షన్నర రూపాయలు ఖర్చు పెట్టాల్సిందే. మీకు బంగారం కొనాలనిపిస్తే ఈ ఏడాది కొనడం మంచిది. వచ్చే ఏడాది మరింతగా పెరిగిపోతుంది.
2026లో బంగారం ధరలు
మార్కెట్ నిపుణులు అంచనా ప్రకారం 2026 నాటికి 10 గ్రాముల బంగారం ధర లక్షా పాతిక వేల రూపాయల వరకు ఉంటుంది. అంటే మీరు 10 గ్రాముల వస్తువును కొనాలంటే పన్నులు, మజూరీలు అన్నీ కలిపి రెండు లక్షల దాకా చేరుకునే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు మీరు బంగారాన్ని ఈ ఏడాది కొనేందుకు ప్రయత్నించండి. ఎంతో కొంత తక్కువ ధరకు రావచ్చు.
ఎందుకలా పెరుగుతోంది?
ప్రపంచ మార్కెట్లో ప్రస్తుతం అస్థిర పరిస్థితులు ఉన్నాయి. ఒకవైపు అమెరికా సుంకాలు కూడా ప్రభావాన్ని చూపిస్తున్నాయి. కేంద్ర బ్యాంకులు కూడా బంగారం కొనుగోళ్లను విపరీతంగా పెంచింది. భవిష్యత్తులో వడ్డీరేట్లు తగ్గుతాయని అంచనాలు కూడా ఉన్నాయి. వీటన్నింటి వల్లే బంగారం ధర ప్రతి ఏటా పెరిగిపోతూ వస్తోంది.
2027లో బంగారం ధరలు
నిజానికి బంగారం ధర కొన్నేళ్లుగా చూసుకుంటే స్థిరంగా పెరుగుతుంది. ఎక్కడా కూడా తగ్గిన సందర్భాలు కనబడలేదు. పేద ప్రజలకు, మధ్యతరగతి వారికి ఇప్పుడు బంగారం కొనే పరిస్థితులు లేవు. లక్ష రూపాయలకు పైగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. తులం వస్తువు కోసమే లక్షన్నర చెల్లించాలి. 2007లో తులం బంగారం కేవలం ఎనిమిది వేల రూపాయల మాత్రమే ఉంది. అది ఇప్పుడు 2027కి తులం బంగారం లక్షన్నర రూపాయలు దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ప్రస్తుతం బంగారం ధర
ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర వాటి క్వాలిటీని బట్టి ఆధారపడి ఉంటుంది. 99 వేల రూపాయలతో మొదలై నుంచి 1,10,000 రూపాయల మధ్యలో ఉంది. ఇక 2026 ప్రథమార్గంలోనే 1,10,000 నుండి లక్షా పాతిక వేల రూపాయలకు ఇది పెరిగే అవకాశం ఉందని ఐసిఐసిఐ బ్యాంక్ ఎకనామిక్ రీసెర్చ్ గ్రూపు పరిశోధన తెలియజేస్తోంది. కాబట్టి మీకు బంగారం కొనేందుకు ఇంకా మూడు నెలలు మాత్రమే ఉంది. ఈ మూడు నెలలు ఎంతో కొంత బంగారం కొని దాచుకోండి.