త్రీ లేయర్డ్  బంగారు నల్ల పూసలు అనేది కేవలం ఒక ఆభరణం మాత్రమే కాదు, మహిళలకు పెళ్లయ్యాక ముఖ్యమైన సంప్రదాయం కూడా.  దీన్ని రోజూ ధరిస్తారు. పండుగల సమయంలో మాత్రం ట్రెండీ డిజైన్లను ఎంపిక చేసుకుంటారు. ఇక్కడ మేము అందమైన నల్ల పూజల డిజైన్లు ఇచ్చాము.

బంగారు మంగళసూత్రం ప్రతి పెళ్లయిన మహిళకు ముఖ్యమైన ఆభరణం. భర్తకు మంచి జరగాలని కోరుతూ భార్య వేసుకునే నల్ల పూసలకు సంప్రదాయ పరంగా ఎంతో విలువ ఉంది. ఇప్పుడు ఎన్నో రకాల డిజైన్లు మార్కెట్లో లభిస్తాయి. త్రీ లేయర్డ్ మంగళసూత్రాలు కొత్త ట్రెండ్ గా మొదలయ్యాయి. ఇవి చూసేందుకు ఎంతో అందంగా ఉండటమే కాదు మెడ నిండా నిండుగా ఉంటాయి. ఇలా త్రీ లేయర్డ్ నల్ల పూసలు తీసుకోవడం వల్ల అవి త్వరగా తెగిపోయే, చిక్కులు పడే అవకాశం తక్కువ. అందుకే ఇప్పుడు ఎంతో మంది మహిళలు ఒకటి లేదా రెండు పొరలకు బదులుగా మూడు లేయర్డ్ మంగళసూత్రాలను ఎంపిక చేసుకుంటున్నారు. మీరు కొత్త మంగళసూత్రం కొనుక్కోవాలనుకుంటే ఈ త్రీ లేయర్డ్ డిజైన్లను ఒకసారి చూడండి.

క్లాసిక్ త్రీ లేయర్డ్ నల్ల పూసల మంగళసూత్రం

ఈ డిజైన్ లో త్రీ లేయర్డ్ సాధారణ నల్ల పూసల గొలుసుతో ఉంటాయి, మధ్యలో బంగారు పెండెంట్ ఉంటుంది. పెండెంట్ పూల డిజైన్, గుండ్రంగా, రాళ్లతో ఏ డిజైన్ లోనైనా ఉండవచ్చు. ఈ డిజైన్ రోజూ ధరించడానికి సౌకర్యంగా, అందంగా ఉంటుంది.

డైమండ్ పెండెంట్ తో మంగళసూత్రం

 మీరు మరింత ఆకర్షణీయంగా కనిపించాలనుకుంటే త్రీ లేయర్డ్ నల్ల పూసలను ఎంపిక చేసుకోవాలి. మధ్యలో డైమండ్ పెండెంట్ ఉన్న డిజైన్ ను ఎంచుకుంటే ఎంతో అందంగా కనిపిస్తుంది. నిజమైన వజ్రాల పెండెంట్ ఉన్న నల్లపూసలను కొనుక్కుంటే పండుగలు, పార్టీలకు వేసేందుకు అనువుగా ఉంటుంది. త్రీ లేయర్డ్ నల్ల పూసలు సన్నగా ఉండటం వల్ల రోజూ ధరించడానికి కూడా సౌకర్యంగా ఉంటుంది.

పూల డిజైన్లలో మంగళసూత్రం

పూల డిజైన్ ఉన్న బంగారు పెండెంట్ ఎప్పుడూ ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ డిజైన్ లో త్రీ లేయర్డ్ గొలుసును ఒక చిన్న బంగారు క్లాస్ప్ తో కలుపుతారు. మధ్యలో పూల డిజైన్ పెండెంట్ ఉంటుంది. ఇది సంప్రదాయబద్ధంగా కనిపిస్తుంది… చీర లేదా సూట్ రెండింటి మీదకి అందంగా ఉంటుంది.

టెంపుల్ స్టైల్ మంగళసూత్రం

మీరు దక్షిణ భారతీయ లేదా సంప్రదాయ లుక్ కావాలనుకుంటే టెంపుల్ ఆభరణాల డిజైన్ ఉన్న పెండెంట్ ఎంపిక చేసుకోండి. త్రీ లేయర్డ్ జాలీ డిజైన్, పెండెంట్ మంగళసూత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.

ముత్యాలు నల్ల పూసలతో మంగళసూత్రం

ఇది ఆధునిక డిజైన్. త్రీ లేయర్డ్ నల్ల పూసల్లో చిన్న ముత్యాలు ఉంటాయి. దీనివల్ల మెడ మెరిసిపోతుంది. పెండెంట్ చిన్నదిగా ఉంటే… గొలుసుతో అందంగా ఉంటుంది. పాశ్చాత్య దుస్తులతో కూడా ఇది చాలా అందంగా ఉంటుంది.