MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • credit card: క్రెడిట్ కార్డు బిల్లులో మినిమమ్ పేమెంట్ అనేది ఒక ట్రాప్: అందులో మీరు పడకూడదంటే ఇలా చేయండి

credit card: క్రెడిట్ కార్డు బిల్లులో మినిమమ్ పేమెంట్ అనేది ఒక ట్రాప్: అందులో మీరు పడకూడదంటే ఇలా చేయండి

credit card: క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపులో మినిమమ్ పేమెంట్ పద్ధతి వల్ల ఎక్కువ వడ్డీ భారం పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి క్రెడిట్ కార్డు బిల్లులు భారం కాకుండా ఉండాలంటే పేమెంట్స్ ఎలా చేయాలో వివరంగా తెలుసుకుందాం.  

2 Min read
Author : Naga Surya Phani Kumar
| Updated : May 19 2025, 03:42 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మినిమమ్ పేమెంట్ ఒక టెక్నిక్
Image Credit : freepik

మినిమమ్ పేమెంట్ ఒక టెక్నిక్

క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లించేటప్పుడు 'మినిమమ్ పేమెంట్' చేయడం అన్నది ఒక పెద్ద టెక్నిక్. అధిక వడ్డీ రాబట్టే బ్యాంకుల బిజినెస్ ట్రిక్. ఇది తెలియక చాలా మంది వినియోగదారులు మినిమమ్ కడితే ఒక నెల ఇబ్బంది ఉండదని సంతోషపడతారు. కానీ మినిమమ్ కట్టినపుడు భద్రతా ఫీజులు, వడ్డీ మొత్తం పెరిగిపోతాయని వారికి తెలియదు. 

25
క్రెడిట్ వడ్డీ ఎక్కువ
Image Credit : our own

క్రెడిట్ వడ్డీ ఎక్కువ

మీరు క్రెడిట్ కార్డు బిల్లులో మినిమమ్ పేమెంట్ చేసినా బ్యాంకులు భవిష్యత్తులో అధిక వడ్డీలు వసూలు చేస్తాయి. దీనివల్ల వినియోగదారులు అసలు మొత్తాన్ని చెల్లించకుండానే వడ్డీ మీద వడ్డీ కట్టాల్సిన పరిస్థితిలో పడుతారు. కొన్ని క్రెడిట్ కార్డులు మినిమమ్ బకాయిలు ఉన్నవారిపై సంవత్సరానికి 36% నుంచి 48% వడ్డీ వసూలు చేస్తున్నట్లు సమాచారం.

Related Articles

Related image1
home business ideas: ఇంట్లో ఉండే ఇన్ని రకాల బిజినెస్‌లు చేయొచ్చా?
Related image2
Best Summer Business Idea: వేసవిలో ఈ బిజినెస్ కి తిరుగేలేదు.. ఎగబడి మరీ టికెట్స్ కొంటారు
35
మినిమమ్ కడితే వడ్డీ పెరుగుతుంది
Image Credit : Gemini

మినిమమ్ కడితే వడ్డీ పెరుగుతుంది

ఉదాహరణకి మీరు రూ.10,000 క్రెడిట్ కార్డు బిల్లు కట్టాల్సి ఉంటే మినిమమ్ 5% అంటే.. రూ. 500 చెల్లిస్తే ఆ నెలకు ఇబ్బంది ఉండదు. కాని తరువాత నెల మొత్తం రూ.10,000 కట్టాలి. ఇలా ప్రతి నెలా రూ.500 చొప్పున కట్టుకుంటూ పోతే నెలల తరబడి వడ్డీ పెరుగుతుంది తప్ప అసలు తీరదు. ఇలా మినిమమ్ పేమెంట్ చేసే వినియోగదారుల్లో చాలామంది బకాయిలు పెరిగిపోయి డీఫాల్ట్ స్థితిలోకి వెళ్లే ప్రమాదం ఉంది. ఇది వారి క్రెడిట్ స్కోర్‌ను తీవ్రంగా దెబ్బతీస్తుంది.

45
డీఫాల్ట్ అవ్వద్దు
Image Credit : iSTOCK

డీఫాల్ట్ అవ్వద్దు

అత్యధిక మినిమమ్ పేమెంట్ కట్టేవారిలో 30-40 శాతం మంది తరువాత పెద్ద మొత్తాన్ని చెల్లించలేక డీఫాల్ట్ అవుతున్నారు. దీనివల్ల తర్వాత ఎప్పుడైనా పెద్ద బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీల నుండి రుణాలు పొందలేకపోతున్నారు. ప్రైవేట్ బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు కూడా ఇలా రిస్క్ పెరిగిన వినియోగదారులకు రుణం ఇవ్వడానికి వెనుకాడుతున్నాయి.

55
నిపుణులు ఏమంటున్నారంటే..
Image Credit : adobe stock

నిపుణులు ఏమంటున్నారంటే..

నిపుణులు సూచించేది ఏంటంటే.. నెలవారీ బిల్లు మొత్తం పూర్తిగా కట్టటం వల్లే తక్కువ వడ్డీ భారం తగ్గుతుంది. డబ్బులు అడ్జస్ట్ కాకపోతే ఒక నెలా లేదా రెండు నెలలు మినిమమ్ కట్టినా ఇబ్బంది లేదు కాని నెలల తరబడి మినిమమ్ పేమెంట్ కడుతూ ఉంటే క్రెడిట్ స్కోర్ పడిపోతుంది. 

కనుక మినిమమ్ పేమెంట్ ఒక ట్రాప్ అని గుర్తు పెట్టుకోంది. ఆర్థిక విషయాల్లో తెలివితేటలతో వ్యవహరించాలి. బిల్లులు కట్టడంతో తప్పులు చేయకుండా జాగ్రత్తగా క్రెడిట్ కార్డు వినియోగించడం చాలా అవసరం.

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.
బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్
పర్సనల్ పైనాన్స్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
స్టేటస్ కోసం కొత్త కారు కొంటున్నారా.? వారెన్ బ‌ఫెట్ చెప్పిన విష‌యం వింటే ఆలోచ‌న మార‌డం ఖాయం
Recommended image2
Budget Smartphone : కేవలం ఏడు వేలకే.. 5000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 128GB స్టోరేజీ స్మార్ట్ ఫోన్ మీ సొంతం..!
Recommended image3
Today Gold Rate: బంగారం ధరలకు రెక్కలు..ఇప్పుడు కొనడం మంచిదేనా?
Related Stories
Recommended image1
home business ideas: ఇంట్లో ఉండే ఇన్ని రకాల బిజినెస్‌లు చేయొచ్చా?
Recommended image2
Best Summer Business Idea: వేసవిలో ఈ బిజినెస్ కి తిరుగేలేదు.. ఎగబడి మరీ టికెట్స్ కొంటారు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved