- Home
- Business
- Microsoft Layoffs: మైక్రోసాఫ్ట్ లాభాల్లో ఉండగా 15,000 ఉద్యోగుల తొలగింపు ఎందుకు? సత్య నాదెళ్ల కామెంట్స్ వైరల్
Microsoft Layoffs: మైక్రోసాఫ్ట్ లాభాల్లో ఉండగా 15,000 ఉద్యోగుల తొలగింపు ఎందుకు? సత్య నాదెళ్ల కామెంట్స్ వైరల్
Microsoft Layoffs: ఉద్యోగుల తొలగింపుపై మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల స్పందించారు. ఉద్యోగులను ఉద్దేశించి తన మెమోలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగుల తొలగింపుపై సత్య నాదెళ్ల ఎమోషనల్
మైక్రోసాఫ్ట్ వేల మంది ఉద్యోగులకు బిగ్ షాక్ ఇచ్చింది. 2025లో ఇప్పటివరకు ఏకంగా 15,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించింది. అలాగే, పనితీరు తక్కువగా ఉన్నట్టు భావించిన సుమారు 2,000 మంది సిబ్బందిని కూడా కంపెనీ విధుల నుంచి తీసివేసింది.
ఈ నేపథ్యంలో కంపెనీ సీఈవో (CEO) సత్య నాదెళ్ల గురువారం ఓ మెమో ద్వారా స్పందించారు. “ఇది మానసికంగా నన్నెంతో ప్రభావితం చేస్తోంది. ఇదే విషయాన్ని మీరు కూడా ఆలోచిస్తారని నాకు తెలుసు” అంటూ ఉద్యోగులను ఉద్దేశించి తన మెమోలో పేర్కొన్నారు.
KNOW
మైక్రోసాఫ్ట్ లాభాలు పెరిగినా ఉద్యోగాల్లో కోత ఎందుకు?
ఈ ఉద్యోగుల తొలగింపు సమయంలోనే మైక్రోసాఫ్ట్ బలమైన ఆర్థిక ఫలితాలు నమోదు చేస్తోంది. భారీగా లాభాలు వచ్చాయి. గత మూడు ఆర్థిక త్రైమాసికాల్లో కంపెనీ $75 బిలియన్ నికర లాభాన్ని సాధించింది.
జూలై 9న మైక్రోసాఫ్ట్ షేర్లు మొదటిసారిగా $500 మార్కును దాటాయి. అంతేకాకుండా, మైక్రోసాఫ్ట్ కృత్రిమ మేధస్సు (AI) మౌలిక వసతుల అభివృద్ధికి $80 బిలియన్లను మదుపు చేసింది.
ఈ నేపథ్యంలో ఉద్యోగాల తొలగింపుపై ప్రశ్నలు రావడం సహజమే. అయితే “ప్రతి పరిమాణ పరమైన కొలమానంలో మైక్రోసాఫ్ట్ అభివృద్ధి చెందుతోంది. మార్కెట్ ప్రదర్శన, వ్యూహాత్మక స్థితి, వృద్ధి.. అన్ని బలంగా ఉన్నాయి” అంటూ నాదెళ్ల వివరించారు.
ఈ రంగానికి స్థిరమైన ఫ్రాంచైజ్ విలువ లేదు: నాదెళ్ల
నాదెళ్ల తన మెమోలో.. “ఈ రంగానికి స్థిరమైన ఫ్రాంచైజ్ విలువ లేదు. పురోగతి ఎప్పుడు ఒకే విధంగా ఉండదు. ఇది డైనమిక్ వ్యవస్థ.. కొన్నిసార్లు భలే మంచిగా ఉంటుంది. మరికొన్ని సార్లు కఠినమైనది మారుతుంది. అలాగే, ఏఐ కొత్త అవకాశాలను కూడా ఇస్తుంది.. మేము ఆ కొత్త అవకాశాలను పొందగలము” అని తెలిపారు.
సాఫ్ట్‌వేర్ ఫ్యాక్టరీ నుంచి ఇంటెలిజెన్స్ ఇంజిన్ వైపు మైక్రోసాఫ్ట్ పరుగులు
సత్య నాదెళ్ల మరో కీలక అంశాన్ని ప్రస్తావిస్తూ.. “భవిష్యత్తులో విజయాలు అందుకోవాలంటే తాము ‘అన్‌లెర్న్’ నుంచి ‘లెర్న్’ చేయాల్సిన అవసరం ఉంది. మైక్రోసాఫ్ట్ ప్రస్తుతం సాఫ్ట్‌వేర్ ఫ్యాక్టరీ నుంచి ఇంటెలిజెన్స్ ఇంజిన్” వైపు మార్పు చెందుతోందని ఆయన తెలిపారు.
ఈ మార్పు కస్టమర్ల అవసరాలను తీర్చేలా, ప్రస్తుత వ్యాపారాన్ని కొనసాగించడంతో పాటు కొత్త వాణిజ్య నమూనాలు సృష్టించాలనే లక్ష్యంతో ఉందని నాదెళ్ల వివరించారు.
మైక్రోసాఫ్ట్ లో ఇదే అతిపెద్ద లేఆఫ్స్
ఉద్యోగాల తొలగింపు మైక్రోసాఫ్ట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న మొత్తం శ్రామిక బలగంలో సుమారు 7%కు సమానం. 2014 తరువాత అత్యధిక తొలగింపులు చేసిన ఇదే కంపెనీ. అయితే, కంపెనీ స్టాక్ మాత్రం ఈ ఏడాది 21% పెరిగింది.
లేఆఫ్స్ అయిన కొందరు ఉద్యోగులు CNBCతో మాట్లాడుతూ, మైక్రోసాఫ్ట్‌లో పని చేసిన అనుభవాన్ని ప్రేమగా గుర్తు చేసుకుంటూనే.. ఉద్యోగం పోవడం బాధాకరమని తెలిపారు.
ఎన్ వీడియా తర్వాత మైక్రోసాఫ్ట్ ప్రపంచంలో రెండవ అత్యంత విలువైన కంపెనీగా ఉంది. Windows, Office వంటి ఉత్పత్తులు ఇంకా మార్కెట్‌లో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, Azure క్లౌడ్ సేవలు వేగంగా వృద్ధి చెందుతున్నాయి.
సత్య నాదెళ్ల తన మెమోలో చివరగా, "ఇది మేం కలిసి చేసిన ప్రయాణాన్ని పునర్విమర్శించే సమయం. ఇప్పటి స్థిరమైన పునాదికి వారే కారణం" అంటూ సంస్థ నుంచి తొలగించిన వారికి ధన్యవాదాలు తెలిపారు. అయితే భవిష్యత్తులో మరిన్ని లేఆఫ్స్ ఉండవచ్చనే విషయం కాకుడా గ్రోత్ మైండ్‌సెట్ తో సంస్థలోని ఉద్యోగులు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
కంపెనీలు కృత్రిమ మేధస్సు (ఏఐ) ఆధారిత విధానాలను స్వీకరించి తమ కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా తిరిగి ప్రారంభిస్తున్నాయి. ఈ క్రమంలోనే చాలా కంపెనీలు ఉద్యోగులకు తగ్గించుకుంటున్నాయి. వారి స్థానంలో ఏఐ సేవలను ఉపయోగించుకుంటున్నాయి.

