548 కి.మీ రేంజ్, 7 ఎయిర్ బ్యాగ్స్, మసాజర్ సీట్లు.. ఇది కారు కాదు.. లగ్జరీ లాంజ్!
MG M9 Electric MPV : ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్‌లో ఎంజీ మోటార్స్ (MG Motors) దూసుకుపోతోంది. బడ్జెట్ లోనే లగ్జరీ కార్లను అందుబాటులోకి తీసుకవస్తుంది. తర్వలో ఎంజీ ఎం9 ఎలక్టిక్ కారు( MG M9) ను తీసుకరాబోతుంది. ఈ కారు ఫీచర్స్ ఏంటో ఓ లూక్కేయండి.

అదిరిపోయే రేంజ్
ఎంజీ ఎం9 లో 90kWh సామర్థ్యంతో కూడిన బ్యాటరీ ఇవ్వబడింది. ఇది 241bhp పవర్, 350Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఒక్కసారి చార్జ్ చేస్తే.. ఈ లగ్జరీ ఎలక్ట్రిక్ MPV 548 కి.మీ. వరకు ప్రయాణించగలదు. పర్మామెన్స్ పరంగా చూస్తే.. ఇది కియా కార్నివల్, టయోటా వెల్ఫైర్ వంటి లగ్జరీ MPVలతో పోటీ పడనుంది.
లగ్జరీకి కొత్త నిర్వచనం
ఎంజీ ఎం9 (MG M9) ను లగ్జరీ స్థాయికి తీసుకెళ్లేందుకు కంపెనీ అత్యాధునిక ఫీచర్లను అందించింది. అందులో ముఖ్యంగా లెవల్ 2 ADAS ( అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టం) ఉంది. ఇది డ్రైవింగ్‌ను సురక్షితంగా, సౌకర్యంగా మార్చుతుంది. ఈ ఫీచర్‌తో పాటు కారులో మసాజర్ సీట్లు, 360° కెమెరా, పెద్ద టచ్ స్క్రీన్ వంటి ఫీచర్స్ దీనికి హైలైట్స్.
ఎంజీ ఎం9 లో అదిరే ఫీచర్లు!
ఎంజీ ఎం9లో ప్రయాణం లగ్జరీగా మారేలా అనేక హైఎండ్ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. ఎలక్ట్రిక్ స్లైడింగ్ డోర్లు, 6-వే అడ్జస్టబుల్ సెకండ్ రో సీట్లు ( హీటింగ్, వెంటిలేషన్, మసాజ్ ఫంక్షన్‌లతో), బాస్ మోడ్, వెల్కమ్ సీట్ ఫంక్షన్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
సేప్టీ, టెక్నాలజీ
ఎంజీ ఎం9 లో ప్రయాణం సౌకర్యవంతంగా, భద్రత, వినోదాన్ని మరింత మెరుగ్గా అందించేందుకు ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి. ముఖ్యంగా భద్రత కోసం EPB (ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్), ఆటో హోల్డ్ ఫీచర్, 7 ఎయిర్‌బ్యాగులు ఇవ్వబడ్డాయి.
డ్రైవింగ్ ఎక్స్‌పీరియెన్స్: 12.3 ఇంచ్ టచ్‌స్క్రీన్, 7 ఇంచ్ డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, 13 స్పీకర్ JBL సౌండ్ సిస్టం, ఎకో, నార్మల్, స్పోర్ట్ డ్రైవ్ మోడ్‌ల్లో డైవ్ చేయవచ్చు. ఈ ఫీచర్లతో ఎంజీ ఎం9 కేవలం లగ్జరీ MPV మాత్రమే కాకుండా, స్మార్ట్ డ్రైవింగ్‌కు బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తోంది.
ఆ విషయంలో ఎంజీ M9 సరైన ఎంపిక!
ప్రీమియం, సూపర్ లగ్జరీ, ఆధునిక ఫీచర్లతో నిండి ఉన్న MG M9 ఒక్కసారి ఛార్జ్ చేస్తే 548 కి.మీ. వరకు ప్రయాణించగలదు. స్మార్ట్ డిజైన్, టెక్నాలజీ, భద్రతా ఫీచర్లతో కూడిన ఈ లగ్జరీ ఎలక్ట్రిక్ కారులో ప్రతి ప్రయాణం మధురానుభూతిని ఇస్తుంది. మీ ఫ్యామిలీ ట్రిప్స్, లాంగ్ డ్రైవ్స్‌కు ఇది ఒక బెస్ట్ ఆప్షన్.
డెలివరీలు ఎప్పుడు?
సూపర్ లగ్జరీ ఎలక్ట్రిక్ MPV అయిన ఎంజీ M9 డెలివరీలు 2025 ఆగస్టు 10 నుండి అధికారికంగా లాంఛ్ కానున్నది. ఈ కారును MG Select అనే ప్రత్యేక డీలర్‌షిప్ సేవల ద్వారా కొనుగోలు చేయవచ్చు.
లక్ష రూపాయాలతో మీ ఇంటి ముందు
MG M9 ధర కొంత ఎక్కువగా అనిపించినా అందులో లభించే ఆధునిక సాంకేతికత, లగ్జరీ ఫీచర్లు, భద్రతా ప్రమాణాలు దానిని తన సెగ్మెంట్‌లో ఒక ప్రీమియం ఎంపికగా నిలబెడతాయి. స్మార్ట్ లుక్స్, 548 కి.మీ. రేంజ్, మసాజర్ సీట్లు, లెవల్ 2 ADAS వంటి ఫీచర్లు దీన్ని మరింత ప్రత్యేకం చేస్తాయి. ఇప్పుడు కేవలం ₹1 లక్ష బుకింగ్‌తో ఈ లగ్జరీ ఎలక్ట్రిక్ MPVని బుకింగ్ చేసుకోండి.