- Home
- Business
- Neo Electric Scooter: పెట్రోల్ అవసరం లేదు.. లైసెన్స్ అక్కర్లేదు.. రూ 52,000కే ఈ - బైక్..
Neo Electric Scooter: పెట్రోల్ అవసరం లేదు.. లైసెన్స్ అక్కర్లేదు.. రూ 52,000కే ఈ - బైక్..
ప్రస్తుతం భారత్ లో ఎలక్ట్రిక్ బైక్స్ ట్రెండ్ కొనసాగుతుంది. ఇప్పటికే ఓలా, ఏథర్, బజాజ్ చేతక్లాం లాంటి ఎలక్ట్రిక్ టూ-వీలర్స్ అందుబాటులో ఉన్నాయి. తాజాగా ఒడిస్సే కొత్త మోడల్ రేసర్ నియో (Racer Neo)ను మార్కెట్ లోకి తీసుకవచ్చింది. ఈ బైక్ ప్రత్యేకతలు, ధర?

Odysse Racer Neo
ప్రస్తుతం భారత్ లో ఎలక్ట్రిక్ స్కూటర్ల హవా నడుస్తోంది. ఇప్పటికే ఓలా, ఏథర్ 450, 450ఎక్స్, బజాజ్ చేతక్ ఈవీ, టీవీఎస్ ఐక్యూబ్ లాంటి ఎలక్ట్రిక్ టూ-వీలర్ ఆకట్టుకుంటున్నాయి. ఈ నేపధ్యంలో ఒడిస్సే ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా తన కొత్త మోడల్ ను మార్కెట్ లోకి తీసుకవచ్చింది. అదే.. రేసర్ నియో (Racer Neo) అనే తక్కువ-వేగం గల ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. ఈ బైక్ ప్రత్యేకతలు, ధర గురించి తెలుసుకుందాం.
అధునాతన ఫీచర్లతో
మీ ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు రేసర్ నియో అనేక ఆధునిక ఫీచర్లతో మార్కెట్ లోకి వస్తుంది. ఇందులో LED డిజిటల్ మీటర్, కీలెస్ స్టార్ట్/స్టాప్, క్రూయిజ్ కంట్రోల్, USB ఛార్జింగ్ పోర్ట్ ఉన్నాయి.
అంతేకాకుండా.. సిటీ మోడ్, రివర్స్ మోడ్, పార్కింగ్ మోడ్ వంటి ప్రత్యేకమైన డ్రైవింగ్ ఆప్షన్ అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ కలిపి దీన్ని బడ్జెట్‌లో బెస్ట్ ఫీచర్ స్కూటర్ గా నిలబెడతాయి.
బ్యాటరీ సామర్థ్యం
రేసర్ నియో స్కూటర్‌కు రెండు రకాల బ్యాటరీ ఉన్నాయి:
గ్రాఫిన్ బ్యాటరీ – 60V, 32AH లేదా 45AH
లిథియం-అయాన్ బ్యాటరీ – 60V, 24AH
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 90 నుండి 115 కి.మీ. వరకు ప్రయాణించవచ్చు. బ్యాటరీపై ఆధారపడి 4 నుంచి 8 గంటల లోపే పూర్తిగా ఛార్జ్ అవుతుంది.
రిజిస్ట్రేషన్ అవసరం లేని స్కూటర్
250W సామర్థ్యం గల ఈవీ బైక్ గంటకు 25 కి.మీ వేగంతో ప్రయాణించగలదు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ను నడపడానికి లైసెన్స్ లేదా రిజిస్ట్రేషన్ అవసరం లేదు. వాహనం నడపడం మొదలుపెట్టిన వారికీ, టీనేజర్లకీ ఇది చాలా అనుకూలంగా ఉంటుంది.
ధర ఎంతంటే?
ఆధునిక ఫీచర్స్ తో పాటు ఈ బైక్ ను ఐదు ఆకర్షణీయమైన రంగుల్లో అందుబాటులో ఉంది. ఫైర్ రెడ్, లూనార్ వైట్, టైటానియం గ్రే, పైన్ గ్రీన్, లైట్ సియాన్ రంగుల్లో లభిస్తుంది.
ధర ?
లో బడ్జెట్ లో భారతీయ రైడర్స్ కోసం ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ను కేవలం ₹52,000 (ఎక్స్-షోరూమ్) లకు అందుబాటులోకి తీసుకవచ్చింది. దేశవ్యాప్తంగా 150+ డీలర్‌షిప్, ఆన్‌లైన్‌లో లభిస్తుంది.