మేరా రేషన్ యాప్‌ను లాంచ్ చేసిన మంత్రిత్వ శాఖ.. ఇక దేశంలోని ఏ మూల నుండి అయినా రేషన్ పొందవచ్చు..

First Published Mar 16, 2021, 1:20 PM IST

వలస కూలీలకు సహాయం చేయడానికి ప్రభుత్వం మేరా రేషన్ యాప్‌ను ప్రారంభించింది. భారత ప్రభుత్వ వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ (ఒఎన్‌ఆర్‌సి) లో భాగంగా మేరా రేషన్ యాప్‌ను ఆహార, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ తీసుకొచ్చింది. జీవనం కోసం వలస వెళ్ళే  కార్మికులు, రేషన్ కార్డులు ఉన్న కార్మికులకు మై  రేషన్ యాప్ ఎంతో ఉపయోగపడనుంది. 32 రాష్ట్రాలు ఇంకా కేంద్రపాలిత ప్రాంతాలు ప్రస్తుతం మేరా  రేషన్ యాప్ నుండి లబ్ధి పొందుతున్నాయి.