- Home
- Business
- Car: మీ కారు కల నెరవేరుతుంది.. కేవలం రూ. 4 లక్షలకే కొత్త కారు మీసొంతం. భారీగా డిస్కౌంట్..
Car: మీ కారు కల నెరవేరుతుంది.. కేవలం రూ. 4 లక్షలకే కొత్త కారు మీసొంతం. భారీగా డిస్కౌంట్..
కారు కొనుగోలు చేయాలని ప్రతీ ఒక్కరూ ఆశిస్తుంటారు. అయితే ధర చూసి భయపడుతుంటారు. కానీ సొంత కారు కల నిజం చేస్తోంది మారుతి. దేశంలోనే అత్యంత చవకైన కార్లలో ఒకటైన మారుతి ఆల్టో K10పై కంపెనీ అదిరిపోయే డిస్కౌంట్లను ప్రకటించింది..

ఆల్టో K10పై రూ.53,100 డిస్కౌంట్
మారుతి సుజుకి ఇండియా ఫిబ్రవరిలో కార్లపై అద్భుతమైన డిస్కౌంట్లను ప్రకటించింది. దేశంలో చవకైన కారుగా పేరు సంపాదించుకున్న మారుతి ఆల్టో కే10ను తక్కువ ధరకే సొంతం చేసుకునే అవకాశం కల్పించారు. ఆల్టో కే10 2024,2025 మోడల్ కార్లపై భారీగా డిస్కౌంట్లను అందిస్తోంది. కారుపై క్యాష్ డిస్కౌంట్‌తో పాటు, ఎక్స్ఛేంజ్, కార్పొరేట్ బోనస్‌ను కూడా కంపెనీ అందిస్తోంది. ఆల్టో MY 2024, MY 2025 మోడళ్లపై రూ.53,100 వరకు డిస్కౌంట్ అందిస్తోంది. ఈ కారు ప్రారంభ ధర రూ.4.09 లక్షలుగా ఉంది. దేశంలోనే అత్యంత చవకైన కారు ఇదే కావడం విశేషం.
చవకైన కారు
ఈ హ్యాచ్‌బ్యాక్‌లో కొత్త తరం K-సిరీస్ 1.0 లీటర్ డ్యూయల్ జెట్, డ్యూయల్ VVT ఇంజిన్ ను అందించారు. ఈ ఇంజిన్ 5500rpm వద్ద 49kW (66.62PS) శక్తిని, 3500rpm వద్ద 89Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కంపెనీ ప్రకారం, ఆటోమేటిక్ వేరియంట్ లీటరుకు 24.90 కి.మీ మైలేజీని, మాన్యువల్ వేరియంట్ లీటరుకు 24.39 కి.మీ మైలేజీని అందిస్తుంది. అదే సమయంలో CNG వేరియంట్ లీటరుకు 33.85 కి.మీ మైలేజీని ఇస్తుంది.
ఆల్టో K10
ఆల్టో K10లో 7 అంగుళాల ఫ్లోటింగ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది. S-Presso, Celerio, Wagon-Rలలో కంపెనీ ఇప్పటికే ఈ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను అందించింది. ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటోతో పాటు, ఈ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ USB, బ్లూటూత్, AUX కేబుల్ కు కూడా సపోర్ట్ చేస్తుంది. స్టీరింగ్ వీల్‌కు కూడా కొత్త డిజైన్ అందించారు. ఇందులో ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌కు స్టీరింగ్‌లో మౌంటెడ్ కంట్రోల్ అందించారు.
మంచి మైలేజీ కారు
ఈ హ్యాచ్‌బ్యాక్‌లో ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (EBD), రివర్స్ పార్కింగ్ సెన్సార్, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS) వంటివి లభిస్తాయి. దీంతో పాటు, ఆల్టో K10లో ప్రీ-టెన్షనర్, ఫోర్స్ లిమిట్ ఫ్రంట్ సీట్ బెల్ట్‌లు అందించారు. సురక్షితమైన పార్కింగ్ కోసం రివర్స్ పార్కింగ్ సెన్సార్‌లు కూడా ఇందులో ఉన్నాయి. స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్, హై స్పీడ్ అలర్ట్‌తో పాటు అనేక భద్రతా ఫీచర్లు కారులో అందించారు. స్పీడీ బ్లూ, ఎర్త్ గోల్డ్, సిజ్లింగ్ రెడ్, సిల్కీ వైట్, సాలిడ్ వైట్, గ్రానైట్ గ్రే వంటి 6 కలర్ ఆప్షన్లలో ఆల్టో K10ని తీసుకొచ్చారు.
బెస్ట్ ఫ్యామిలీ కారు
అదే సమయంలో, 2025 ఫిబ్రవరి 1 నుంచి ఆల్టో K10 ధరను కంపెనీ పెంచింది. ఈ ఫ్యామిలీ కారు ధరను రూ.8,500 నుండి రూ.19,500 వరకు కంపెనీ పెంచింది. ధరల పెరుగుదల ఫిబ్రవరి 1 నుండి అన్ని వేరియంట్లకు వర్తిస్తుంది. శాతం ప్రకారం చూస్తే, 3.36% పెరుగుదల. ధర పెరిగినప్పటికీ, దేశంలోనే అత్యంత చవకైన కార్లలో ఒకటిగా మారుతి సుజుకి ఆల్టో K10 కొనసాగుతోంది.
టాప్ వేరియంట్ VXI Plus (O)ను పెంచింది. పెరిగిన ధర తర్వాత రూ.5.99 లక్షల ఎక్స్-షోరూమ్ ధరకు దీన్ని కొనుగోలు చేయవచ్చు. బేస్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ.4.09 లక్షలుగా ఉంది. ఉత్పత్తి ఖర్చు, ద్రవ్యోల్బణం, కొత్త భద్రతా ప్రమాణాలు, సాంకేతిక అప్‌గ్రేడ్‌లను పరిగణనలోకి తీసుకుని ప్రతి సంవత్సరం ఆటోమొబైల్ కంపెనీలు ధరను మార్చుతాయి.