MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Business
  • Financial Tasks: మార్చి 31 లోపు ఈ 3 పనులు చేయకపోతే చాలా నష్టపోతారు

Financial Tasks: మార్చి 31 లోపు ఈ 3 పనులు చేయకపోతే చాలా నష్టపోతారు

Financial Tasks: ఫైనాన్షియల్ ఇయర్ పూర్తయిపోతోంది. ఈ లోపు ఈ 3 పనులు చేయకపోతే మీరు చాలా డబ్బును నష్టపోతారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

2 Min read
Author : Naga Surya Phani Kumar
Published : Mar 26 2025, 06:22 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ఆర్థిక సంవత్సరం పూర్తయ్యే లోపు వ్యాపారులు, ఉద్యోగులు తమ ఆదాయ మార్గాల గురించి ప్రభుత్వానికి తెలియజేయాల్సి ఉంటుంది. వీటిని బట్టి ట్యాక్స్ లు ఎంత కట్టాలన్న విషయం నిర్ధారణ అవుతుంది. మీరు వ్యాపారాలు నిర్వహిస్తున్నా, ఉద్యోగాలు చేస్తున్నా ఈ సమాచారం మీకు కచ్చితంగా ఉపయోగపడుతుంది. మార్చి 31 లోపు కచ్చితంగా చేయాల్సిన 3 పనులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

TDS తగ్గించుకోవాలంటే..

మీరు ఏదైనా కంపెనీలో జాబ్ చేస్తున్నారా? అయితే మీరు మీ కంపెనీ యాజమాన్యం మీకు ఫారం 12బీబీ ఇచ్చి వివరాలు పూర్తి చేసి ఇమ్మని చెప్పి ఉంటుంది. ఈ ఫారం తిరిగి సబ్మిట్ చేయడానికి మార్చి 31 లాస్ట్ డేట్. ఒకవేళ కంపెనీ యాజమాన్యం(ఎంప్లాయర్)ఈ విషయం మర్చిపోయినా మీరే శ్రద్ధగా 12బీబీని సబ్మిట్ చేయాలి. లేకపోతే మీరు ఎక్కువ టీడీఎస్(TDS) కట్టాల్సి ఉంటుంది. ఒకవేళ ఇప్పటి వరకు మీరు 12 బీబీ ఫారం తీసుకోకపోతే వెంటనే తీసుకొని వివరాలతో తిరిగి సబ్మిట్ చేయండి.

35

ఈ ఫారం 12 బీబీ ఏంటి?

ఒక కంపెనీలో పనిచేసే ఎంప్లాయి తన ఎంప్లాయర్(యాజమాన్యం)కు విధేయతగా ఉండాలి. అంటే కంపెనీ ఇచ్చిన జీతం ఏ విధంగా ఉపయోగకరమైన పనులకు ఖర్చుపెడుతున్నాడో చెబితే కంపెనీ TDS(Tax deduction at source) తక్కువ కట్ చేస్తుంది. లేదంటే ఎక్కువ కట్ చేస్తుంది. 

12బీబీ ఫారంలో మీరు తీసుకున్న హోమ్, వెహికల్ లోన్స్, ఇన్స్యూరెన్స్ వివరాలు తదితర ఉపయోగకరమైన ఖర్చుల వివరాలు తెలియజేస్తూ 12బీబీ ఫారం ఇస్తే టీడీఎస్ తక్కువ పడుతుంది. 

45

ట్యాక్స్ బెనిఫిట్స్ పొందాలంటే..

మీరు ట్యాక్స్ ను ఆదా చేయాలనుకుంటున్నారా? సెక్షన్ 80సీ ద్వారా ఎక్కువ ట్యాక్స్ ను సేవ్ చేసుకోవచ్చు. అంటే సెక్షన్ 80సీ వర్తించే కొన్ని ఇన్వెస్ట్ మెంట్ ఆప్షన్స్ లో మీరు పెట్టుబడి పెడితే ట్యాక్స్ ఎక్కువ కట్టాల్సిన అవసరం ఉండదు. మీరు సెక్షన్ 80సీ ని ఉపయోగించుకుంటే రూ.1.50 లక్షల వరకు ట్యాక్స్ బెనిఫిట్స్ పొందవచ్చు. 

ఉదాహరణకు లైఫ్ ఇన్స్యూరెన్స్ ప్రీమియం తీసుకోవడం, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టడం, ఈపీఎఫ్, ఫిక్స్‌డ్ డిపాజిట్స్, సేవింగ్స్ లో ఇన్వెస్ట్ చేయడం, ఇన్య్సూరెన్స్ స్కీమ్స్ లో జాయిన్ అవ్వడం ఇలాంటి వాటిపై పెట్టుబడి పెట్టి ఆ వివరాలు ప్రభుత్వానికి తెలియజేస్తే ట్యాక్స్ డిడక్షన్ బెనిఫిట్ ని పొందవచ్చు. 

55

మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ స్కీమ్

మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం అద్భుతమైన స్కీమ్ తీసుకొచ్చింది. ఇందులో పెట్టుబడి పెట్టడానికి  మార్చి 31 లాస్ట్ డేట్. ఈ పథకం పేరు ‘మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్(MSSC)’. ఇందులో మహిళలు ఎవరైనా రూ.2 లక్షల వరకు పెట్టుబడి పెట్టొచ్చు. దీనికి 7.5 శాతం వడ్డీ వస్తుంది. ఈ స్కీమ్ లో పెట్టుబడి పెట్టాలంటే మీ సమీపంలోని పోస్టాఫీసు, లేదా బ్యాంకుకు MSSC అకౌంట్ ఓపెన్ చేయండి. ఇందులో మీరు ఎంతైనా పెట్టుబడి పెట్టొచ్చు. పెట్టుబడి పెట్టడానికి గరిష్ట పరిమితి రూ.2 లక్షలు. ఈ డబ్బు మీకు రెండేళ్ల తర్వాత 7.5 శాతం వడ్డీతో కలిపి వస్తుంది. ఈ స్కీమ్ లో చేరడానికి చివరి తేదీ కూడా మార్చి 31. 

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.
పర్సనల్ పైనాన్స్
బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
మ‌రో రంగంలోకి ముఖేష్ అంబానీ.. ధ‌ర‌ 10 రూపాయ‌ల‌ నుంచే ప్రారంభం
Recommended image2
Facts: చెక్‌పై రాసే మొత్తానికి చివర ‘Only’ ఎందుకు రాస్తారు.? అసలు కారణం ఏంటంటే
Recommended image3
7th vs 8th Pay Commission: 8వ పే కమిషన్‌తో మారనున్న జీతాలు.. మీ చేతికి ఎంత వస్తుందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved