MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Business
  • Mahindra cars: మహీంద్రా ఎలక్ట్రిక్ కార్లు అంత స్షెషలా? ప్రీ బుకింగే రూ.8,472 కోట్లా?

Mahindra cars: మహీంద్రా ఎలక్ట్రిక్ కార్లు అంత స్షెషలా? ప్రీ బుకింగే రూ.8,472 కోట్లా?

Mahindra cars: మహీంద్రా కంపెనీ కొత్త ఎలక్ట్రిక్ వాహనాలు లాంచ్ చేసింది. స్పెషల్ న్యూస్ ఏంటంటే.. లాంచ్ అయిన మొదటి రోజే 30,000కి పైగా బుకింగ్‌లతో రూ.8,472 కోట్ల విలువైన అమ్మకాలు జరిగాయట. మరి ఆ కార్లలో అంత స్పెషల్ ఫీచర్స్ ఏంటో తెలుసుకుందాం రండి. 

2 Min read
Author : Naga Surya Phani Kumar
Published : Feb 17 2025, 08:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

గత కొన్నేళ్లుగా మహీంద్రా ఎస్‌యూవీ మోడల్ కార్లు మొదటి రోజే భారీ బుకింగ్‌లు సాధిస్తున్నాయి. మహీంద్రా థార్ రాక్స్, మహీంద్రా ఎక్స్‌యూవీ 3XO, మహీంద్రా స్కార్పియో-Nలను గమనిస్తే ఇదే అర్థమవుతుంది. ఇప్పుడు కొత్త లాంచ్ చేసిన ఎలక్ట్రిక్ కార్లు మహీంద్రా BE 6, మహీంద్రా XEV 9eలతోనూ మహీంద్రా కంపెనీ ఈ ట్రెండ్ ను కొనసాగిస్తోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

ప్రీ బుకింగ్ ల విలువ రూ.8,472 కోట్లు

BE 6, XEV 9eల బుకింగ్‌లు వాలెంటైన్స్ డే అంటే ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యాయి. మహీంద్రా కంపెనీ ఇచ్చిన డేటా ప్రకారం ఈ రెండు వెహికల్స్ మొదటి రోజే మొత్తం 30,179 బుకింగ్‌లను సంపాదించాయి. వాటి మొత్తం బుకింగ్ విలువ రూ.8,472 కోట్లు. ఈ రెండు వాహనాలు వరుసగా 44 %, 56 % వాటా కలిగి ఉన్నాయి. రెండు మోడళ్లకు సంబంధించిన అన్ని బుకింగ్‌లలో 73 % 79 kWh బ్యాటరీ ఉన్న ప్రీమియం ప్యాక్ త్రీకి చెందినవే కావడం గమనార్హం.

35

కొనసాగిన రికార్డులు..

BE 6, XEV 9e లాంచ్ ద్వారా మహీంద్రా కంపెనీ మొదటి రోజు బుకింగ్ లో రికార్డుల సాధించడాన్ని మళ్లీ కొనసాగించింది. 2022లో స్కార్పియో-N లాంచ్ అయిన 30 నిమిషాల్లో ఒక మిలియన్ కంటే ఎక్కువ బుకింగ్‌లను సాధించింది. గత ఏడాది చివర్లో థార్ రాక్స్ లాంచ్ అయిన 60 నిమిషాల్లో 1,76,218 బుకింగ్‌లతో అన్ని రికార్డులను బద్దలు కొట్టింది. 2024 లో రిలీజ్ అయిన ఎక్స్‌యూవీ 3XO కూడా 60 నిమిషాల్లో 50,000 కంటే ఎక్కువ బుకింగ్‌లు సాధించింది. 

45

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహన మార్కెట్ ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. అయినప్పటికీ BE 6, XEV 9eల మొదటి రోజు బుకింగ్‌లు రికార్డు స్థాయిలో జరగడం ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న క్రేజ్ ను తెలియజేస్తోంది. 2024లో భారతదేశంలో 99,165 ఎలక్ట్రిక్ కార్లు అమ్ముడయ్యాయని ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ ఫెడరేషన్ (FADA) తెలిపింది. 

55

స్పెషల్ ఫీచర్స్ ఇవే..

BE 6, XEV 9eలు ఇంగ్లో(INGLO) ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటాయి. 59kWh, 79kWh అనే రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్‌లతో వస్తాయి. అలాగే 170kW, 210kW  మోటార్ ఆప్షన్‌లు కూడా ఇందులో ఉన్నాయి. 

BE 6 కారు 100 kmph వేగాన్ని కేవలం 6.7 సెకన్లలో అందుకుంటుంది. XEV 9e అయితే 6.8 సెకన్లలో అందుకుంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ 175kW DC ఛార్జర్‌తో 20 నిమిషాల కంటే తక్కువ సమయంలో 80 % ఛార్జింగ్ ఎక్కుతుందని కంపెనీ తెలిపింది. BE 6, XEV 9e వరుసగా 683 కి.మీ, 656 కి.మీ వరకు ప్రయాణించగలవు. 

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
మిరాకిల్ ఎప్పుడైనా జ‌ర‌గొచ్చు.. డీమార్ట్ ప్రారంభించే సమయానికి రాధాకిషన్ వయసు ఎంతో తెలుసా.?
Recommended image2
Low Investment Business: ఇంటి నుంచే సంపాదించాలనుకుంటున్నారా? 7 హోం బిజినెస్ ఐడియాస్
Recommended image3
Best Selfie Phones: రూ.20 వేల బడ్జెట్‌లో వచ్చే బెస్ట్ సెల్ఫీ ఫోన్ల జాబితా ఇదిగో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved