MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Business Idea : రూ.80 ఖర్చుతో రూ.800 లాభం... ఇంట్లోనే నెలకు రూ.30,000 సంపాదించే సూపర్ బిజినెస్

Business Idea : రూ.80 ఖర్చుతో రూ.800 లాభం... ఇంట్లోనే నెలకు రూ.30,000 సంపాదించే సూపర్ బిజినెస్

ఇంట్లో చిన్న స్థలం ఉంటే చాలు... కేవలం రూ.5000 పెట్టుబడితో కాంక్రీట్ ప్లాంటర్స్ బిజినెస్ మొదలుపెట్టొచ్చు. ఈ రోజుల్లో వీటికి ఫుల్ డిమాండ్ ఉంది. ఇంట్లో నుంచే నెలకి వేలల్లో సంపాదించవచ్చు.

2 Min read
Author : Arun Kumar P
Published : Apr 23 2026, 05:43 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
కాంక్రీట్ ప్లాంటర్‌ బిజినెస్...
Image Credit : Chat GPT

కాంక్రీట్ ప్లాంటర్‌ బిజినెస్...

ఈ రోజుల్లో పాత మట్టి కుండల బదులు అందరూ మోడ్రన్, స్టైలిష్‌గా ఉండే కాంక్రీట్ ప్లాంటర్లనే ఇష్టపడుతున్నారు. ఇవి చాలా గట్టిగా, ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి. సిమెంట్, ఇసుక వంటి ముడిసరుకులు అన్ని నగరాల్లో సులభంగా దొరుకుతాయి.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
తక్కువ పెట్టుబడి బిజినెస్
Image Credit : Pinterest

తక్కువ పెట్టుబడి బిజినెస్

ఈ బిజినెస్ కోసం మీకు సిమెంట్, ఇసుక, కొన్ని ప్లాస్టిక్ లేదా సిలికాన్ అచ్చులు (Moulds) కావాలి. ఆన్‌లైన్‌లో రకరకాల మౌల్డ్స్ దొరుకుతాయి. లేదా ఇంట్లో ఉండే పాత డబ్బాలతో కూడా మొదలుపెట్టొచ్చు. రూ.5000 పెట్టుబడితో సుమారు 20-30 రకాల అచ్చులు, సిమెంట్ కొనొచ్చు.

36
ఇలా చేస్తే లాభమే..
Image Credit : AI

ఇలా చేస్తే లాభమే..

ప్లాంటర్ ఆరిన తర్వాత, నునుపుగా ఉండటానికి సాండ్‌పేపర్‌తో రుద్దాలి. తర్వాత ట్రెండీగా ఉండే రంగులు వేయాలి. మెటాలిక్ గోల్డ్, పాస్టెల్ రంగులకు మంచి డిమాండ్ ఉంది. కస్టమర్లను ఆకట్టుకునే 'ప్రీమియం లుక్' దీనితోనే వస్తుంది. మీ బ్రాండ్‌కు మంచి పేరు పెట్టి, ఇన్‌స్టాగ్రామ్‌లో పేజీ ఓపెన్ చేసి ఫోటోలు పోస్ట్ చేయాలి.
46
గార్డెన్, బాల్కనీ కోసం పెద్ద సైజు కుండీలు
Image Credit : Gemini AI

గార్డెన్, బాల్కనీ కోసం పెద్ద సైజు కుండీలు

ఆఫీస్ టేబుల్స్ మీద పెట్టే చిన్న ప్లాంటర్ తయారీకి రూ.30 నుంచి రూ.50 ఖర్చవుతుంది. దీన్ని రూ.150 నుంచి రూ.250కి అమ్మొచ్చు. అదే గార్డెన్, బాల్కనీలో పెట్టే పెద్ద సైజు ప్లాంటర్ తయారీకి రూ.100 నుంచి రూ.150 ఖర్చయితే, మార్కెట్లో రూ.500 నుంచి రూ.800 వరకు అమ్ముకోవచ్చు. నర్సరీలు లేదా పెద్ద ప్రాజెక్టులకు సప్లై చేస్తే, ఒక్కో ఆర్డర్‌పై రూ.350 నుంచి రూ.650 వరకు లాభం వస్తుంది.

56
నెలకి రూ.30,000 సంపాదించడం సాధ్యమే..
Image Credit : Pinterest

నెలకి రూ.30,000 సంపాదించడం సాధ్యమే..

మొదట్లో పెద్దగా కాకుండా రోజుకు కేవలం 5 ప్లాంటర్లు అమ్మినా చాలు. ఈ లెక్కన, నెల చివరికి అన్ని ఖర్చులు పోగా రూ.15,000 నుంచి రూ.30,000 వరకు నికర లాభం సంపాదించవచ్చు. మీ బ్రాండ్‌కు ఆదరణ పెరిగే కొద్దీ, ఆన్‌లైన్‌లో అమ్మకాలు పెరిగితే ఈ సంపాదన ఇంకా పెరుగుతుంది.

66
మీ కాంక్రీట్ ప్లాంటర్లను ఎక్కడ అమ్మాలి..?
Image Credit : Pinterest

మీ కాంక్రీట్ ప్లాంటర్లను ఎక్కడ అమ్మాలి..?

స్థానిక నర్సరీలు: మీ నగరంలోని నర్సరీలతో మాట్లాడితే, వాళ్లు హోల్‌సేల్‌గా కొంటారు. 

ఆన్‌లైన్ మార్కెట్: Amazon, Flipkart, Etsy వంటి ప్లాట్‌ఫామ్స్‌లో వీటికి మంచి డిమాండ్ ఉంది.

కార్పొరేట్ గిఫ్టింగ్: ఆఫీసుల అలంకరణ కోసం కంపెనీలు బల్క్‌గా ఆర్డర్లు ఇస్తాయి. 

గమనిక: ఈ ఆర్టికల్ కేవలం సమాచారం కోసం మాత్రమే. ఏ వ్యాపారంలోనైనా రిస్క్ ఉంటుంది. ఇక్కడ చెప్పిన లాభాలు, ఖర్చులు మీ నగరం, మార్కెట్ డిమాండ్‌ను బట్టి మారొచ్చు. పెట్టుబడి పెట్టే ముందు సొంతంగా మార్కెట్ రీసెర్చ్ చేసి, నిపుణుల సలహా తీసుకోండి.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
వ్యాపారం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Success Story: రూ.3లక్షలతో మొదలై రూ.100 కోట్ల టర్నోవర్ వరకు.. టీ అమ్ముతూ కోట్లు సంపాదిస్తున్న ముగ్గురు ఫ్రెండ్స్
Recommended image2
Amazon Sale: వాషింగ్ మెషీన్ కొనేందుకు ఇదే మంచి టైమ్.. అమెజాన్ లో బెస్ట్ డీల్స్ ఇవిగో
Recommended image3
Gold Price Fall: నవరాత్రి వేళ పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. మధ్యప్రాచ్యంలో మళ్లీ ఉద్రిక్తతలు.. దిగొచ్చిన బంగారం
Related Stories
Recommended image1
Business Ideas : కేవలం లక్ష పెట్టుబడితో చేతినిండా సంపాదించొచ్చు.. అలాంటి టాప్ 5 ఐడియాలు ఇవే..!
Recommended image2
Business Idea: తాగిపడేసిన బొండాలతో నెలకు రూ. 2 లక్షలు.. వేసవిలో ఎవర్‌గ్రీన్ బిజినెస్ ఇది.!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved