- Home
- Business
- ఫ్యూచర్ Multibagger Stocks కోసం వెతుకుతున్నారా, అయితే ఈ స్టాక్స్ లో మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేశాయట..
ఫ్యూచర్ Multibagger Stocks కోసం వెతుకుతున్నారా, అయితే ఈ స్టాక్స్ లో మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేశాయట..
స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే వారు ఎప్పుడు మల్టీబ్యాగర్ స్టాక్‌ల కోసం వెతుకుతూ ఉంటారు. ఎందుకంటే అలాంటి స్టాక్స్ తక్కువ ధర లోనే సొంతం చేసుకుంటే తరువాత సంవత్సరాలలో వందల రెట్ల లాభం పొందే వీలుంది.

రూ.10 ఉన్న షేరు ఐదేళ్లలో రూ.100గా మారడం మీరు తరచుగా చూసే ఉంటారు అలాంటి స్టాక్స్ నే multibagger stocks అంటారు. మ్యూచువల్ ఫండ్ మేనేజర్లు రూ. 3 వేల కోట్ల కంటే తక్కువ మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీల షేర్లను విపరీతంగా కొనుగోలు చేస్తున్నారు, కాబట్టి ఈ స్టాక్స్ రాబోయే రోజుల్లో మంచి రాబడిని అందించే వీలుంది.
విశేషమేమిటంటే, ఈ మైక్రోక్యాప్ స్టాక్స్ ఇతర సూచీలను భారీ మార్జిన్‌తో అధిగమించాయి. ఈ సంవత్సరం ఇప్పటివరకు, నిఫ్టీ మైక్రోక్యాప్ 250 - 8% రాబడిని అందించగా, నిఫ్టీ మిడ్‌క్యాప్ 150 - 3% లాభాలను ఇచ్చింది. గత మూడు నెలల్లో మ్యూచువల్ ఫండ్ మేనేజర్లు కొనుగోలు చేసిన టాప్ మైక్రోక్యాప్ స్టాక్స్ గురించి తెలుసుకుందాం. మార్కెట్ క్యాపిటలైజేషన్ మ్యూచువల్ ఫండ్ బాడీ AMFI వర్గీకరణ ప్రకారం పోర్ట్‌ఫోలియో డేటా 30 సెప్టెంబర్ 2022 నాటికి సంబంధించింది అని గమనించాలి.
ఫండ్ మేనేజర్లు ఈ స్టాక్‌లపై పందెం కాశారు…
Kirloskar Pneumatic Company Ltd: ఫ్రాంక్లిన్ ఇండియా, ఆదిత్య బిర్లా వంటి మ్యూచువల్ ఫండ్స్ కిర్లోస్కర్ న్యూమాటిక్ (Kirloskar Pneumatic Company Ltd) కంపెనీలో షేర్లను కొనుగోలు చేశాయి. ఈ కంప్రెసర్ పంప్ మేకర్ మార్కెట్ క్యాప్ రూ.2712 కోట్లు.
Kirloskar Oil Engines Ltd: ఫ్రాంక్లిన్ ఇండియా మహీంద్రా మాన్యులైఫ్ మల్టీ క్యాప్ ఫండ్ కిర్లోస్కర్ ఆయిల్ ఇంజిన్ ( Kirloskar Oil Engines Ltd) స్టాక్‌పై పందెం వేసాయి. ఈ డీజిల్ ఇంజిన్ మేకర్ మార్కెట్ క్యాప్ రూ.2181 కోట్లు.
Mayur Uniquoters Ltd: మయూర్ యూనికోటర్స్‌లో ఐసిఐసిఐ ప్రూ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఐటిఐ మల్టీ క్యాప్ ఎల్ అండ్ టి కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్ షేర్లను కొనుగోలు చేశాయి. తోలు, దానితో తయారు చేసిన ఉత్పత్తులను తయారు చేసే ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.1834 కోట్లు.
Butterfly Gandhimathi Appliances Ltd: ఆదిత్య బిర్లా SL ఇండియా ICICI మల్టీక్యాప్ ఫండ్ బటర్‌ఫ్లై గాంధీమతి అప్లయెన్సెస్‌లో వాటాలను కొనుగోలు చేశాయి. గృహోపకరణాలను తయారు చేసే ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2343 కోట్లు.
Valiant Organics Ltd: నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ నవీ ELSS టాక్స్ సేవర్ ఫండ్ వాలియంట్ ఆర్గానిక్స్ స్టాక్‌లో వాటాను కొనుగోలు చేశాయి. ఈ స్పెషాలిటీ కెమికల్ మేకర్ మార్కెట్ క్యాప్ రూ.2412 కోట్లు.
Ujjivan Small Finance Bank Ltd: ఆదిత్య బిర్లా SL బ్యాంకింగ్ & ఫైనాన్షియల్ సర్వీసెస్ ఆదిత్య బిర్లా SL స్మాల్ క్యాప్ ఫండ్ ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లో షేర్లను కొనుగోలు చేశాయి. ఈ బ్యాంకింగ్ రంగ కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.2997 కోట్లు.