MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • రోజుకి మీరు రూ. 45 పొదుపు చేస్తే రూ.25 లక్షల బీమా పొందొచ్చు. LICలో అద్భుతమైన పాలసీ ఇది

రోజుకి మీరు రూ. 45 పొదుపు చేస్తే రూ.25 లక్షల బీమా పొందొచ్చు. LICలో అద్భుతమైన పాలసీ ఇది

దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ బీమా సంస్థ అయిన ఎల్ఐసీ అద్భుతమైన పాలసీని అందిస్తోంది. జీవిత బీమాతో పాటు మంచి రిటర్న్స్ కూడా ఈ పాలసీలో పొందవచ్చు. అదే ఎల్ఐసీ జీవన్ ఆనంద్ పాలసీ. ప్రతి రోజు రూ. 45 పొదుపు చేసి LIC జీవన్ ఆనంద్ పాలసీలో పెడితే మీరు రూ. 25 లక్షలు పొందొచ్చు. ఆ తర్వాత కూడా 100 ఏళ్ల వరకు బీమా కవరేజీ ఉంటుంది. ఇంత తక్కువ అమౌంట్ తో LIC అందిస్తున్న మంచి పాలసీ గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం రండి. 

2 Min read
Author : Naga Surya Phani Kumar
| Updated : Nov 28 2024, 02:58 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ఈ కాలంలో ప్రతి ఒక్కరికీ పాలసీ అనేది తప్పనిసరి ఉండాలి. మార్కెట్లో చాలా రకాల పాలసీలు ఉన్నాయి. అయితే హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు కచ్చింతంగా తీసుకోవాలి. వీటితో పాటు ఏదైనా సేవింగ్స్ కి సంబంధించిన పాలసీ తీసుకోవడం కూడా మంచిది. దీని వల్ల భవిష్యత్తులో మీరు ఎదుర్కొనే ఇబ్బందులకు ఈ నగదు చాలా ఉపయోగపడుతుంది. 

చిన్న పొదుపుతో పెద్ద మొత్తం నగదు పొందాలని అందరూ కోరుకుంటారు కదా.. LIC జీవన్ ఆనంద్ పాలసీ  కరెక్ట్ గాా మీకు ఇలాంటి ప్రయోజనాన్ని అందిస్తుంది. దీని ద్వారా మీరు రోజుకి రూ. 45 పొదుపుతో రూ. 25 లక్షలు పొందొచ్చు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

తక్కువ ప్రీమియంతో పెద్ద మొత్తం పొందాలనుకుంటే LIC జీవన్ ఆనంద్ పాలసీ మంచి ఎంపిక. ఇది ఒకరకంగా టర్మ్ పాలసీ లాంటిది. ఈ పాలసీ ద్వారా చాలా ప్రయోజనాలున్నాయి. కనీస బీమా రూ. 1 లక్ష. మాక్సిమం మీరు ఎంతైనా కట్టొచ్చు. ఎలాంటి పరిమితి లేదు.

35

LIC జీవన్ ఆనంద్ పాలసీలో రూ.5 లక్షల ఆప్షన్ ఎంచుకున్నట్లయితే 35 ఏళ్ల మెచ్యూరిటీ టర్మ్ తీసుకుంటే మీ చేతికి రూ.25 లక్షలు అందుతాయి. ఈ 35 ఏళ్ల పాటు ఏడాదికి రూ.16,300 చెల్లించాల్సి ఉంటుంది. అంటే నెలకు రూ.1,358, రోజుకు కేవలం రూ.45 మాత్రమే పడుతుంది. మీకు మెచ్యూరిటీ సమయంలో చేతికి దాదాపు రూ.25 లక్షల వరకు అందుతాయి. అందులో బీమా మొత్తం రూ.5 లక్షలు, బోనస్ రూ.8 లక్షలు, ఎఫ్‌ఏబీ రూ.11.5 లక్షలు కలిసి ఉంటాయి. 15 ఏళ్ల తర్వాత రెండుసార్లు బోనస్ వస్తుంది. అలాగే ఈ పాలసీ మెచ్యూరిటీ తర్వాత కూడా 100 ఏళ్ల వరకు లైఫ్ టైమ్ కవరేజీ ఉంటుంది. ఒకవేళ పాలసీ కడుతున్న సమయంలోనే పాలసీదారుడు మరణించినట్లయితే డెత్ క్లెయిమ్ లభిస్తుంది. 

45

LIC జీవన్ ఆనంద్ పాలసీలో పన్ను మినహాయింపు లేదు. కానీ, ప్రమాద మరణం, అంగవైకల్యం, ప్రమాద ప్రయోజనం, కొత్త టర్మ్ భీమా, కొత్త క్రిటికల్ బెనిఫిట్ రైడర్ లాంటివి ఉన్నాయి. 

LIC జీవన్ ఆనంద్ పాలసీలో డెత్ క్లెయిమ్ బెనిఫిట్స్ ఉన్నాయి. పాలసీదారుడు మరణిస్తే నామినీకి 125% ప్రయోజనం లభిస్తుంది. పాలసీ ముగిసేలోపే మరణిస్తే నామినీకి కచ్చితమైన కాలానికి సమానమైన డబ్బు వస్తుంది.

55

ఎల్ఐసీ తమ కస్టమర్ల కోసం జీవన్ ఆనంద్ పాలసీతో పాటు వివిధ రకాల పాలసీను అందుబాటులోకి తీసుకొచ్చింది. అందులో టర్మ్ ప్లాన్స్, చిల్డ్రన్స్ ప్లాన్, మనీ బ్యాంక్ పాలసీలు వంటి వివిధ రకాల పాలసీలు ఉన్నాయి. ఇందులో పెన్షన్ ప్లాన్స్ కూడా ఉన్నాయి. వాటిల్లోంచి మీకు నచ్చిన పాలసీని ఎంచుకోవచ్చు. 

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Prices: పసిడి పరుగులు..బంగారం రేట్లు ఎందుకు పెరుగుతున్నాయో తెలుసా?
Recommended image2
Credit Score : మీ సిబిల్ స్కోరు 730 కంటే తక్కువుందా? అయితే మీకు ఆర్‌బీఐ కొత్త రూల్స్‌ తెలియాల్సిందే
Recommended image3
Railway: రైలులో బైక్ పార్శిల్ చేయడానికి ఎంత ఖ‌ర్చ‌వుతుంది.? ప్రాసెస్ ఏంటో తెలుసా.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved