- Home
- Business
- LIC IPO: ఎల్ఐసీ ఐపీవో అప్లై చేస్తున్నారా..ఎంత పెట్టుబడి పెట్టాలి..లాట్ సైజు ఎంత, గరిష్టంగా ఎంత డబ్బు పెట్టాలి
LIC IPO: ఎల్ఐసీ ఐపీవో అప్లై చేస్తున్నారా..ఎంత పెట్టుబడి పెట్టాలి..లాట్ సైజు ఎంత, గరిష్టంగా ఎంత డబ్బు పెట్టాలి
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పబ్లిక్ ఇష్యూ ఆఫర్ (ఐపిఓ) రిటైల్ ఇన్వెస్టర్ల కోసం నేటి నుంచి ప్రారంభమైంద. ఎల్‌ఐసీ ఐపీఓ (LIC IPO) నేటి నుంచి ప్రైమరీ మార్కెట్‌లో ప్రారంభం కానుంది. మే 9 వరకు ఇన్వెస్టర్లు ఈ ఐపీవోలో డబ్బును పెట్టుబడి పెట్టడానికి అవకాశం ఉంది.

LIC IPO : ఒక్కో షేరు ధర ఇదే..
LIC IPO యొక్క ధర బ్యాండ్ ఒక్కో షేరుకు రూ. 902 నుండి 949 వరకు నిర్ణయించారు. రిటైల్ కేటగిరీ నుండి పాలసీదారుల వరకు కూడా ఇందులో డబ్బు పెట్టుబడి పెట్టవచ్చు. ఉద్యోగులకు, పాలసీ దారులకు ఇందులో డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఉద్యోగులకు ఒక్కో షేరుకు రూ.45 తగ్గింపు ఇవ్వగా, పాలసీ హోల్డర్లకు ఒక్కో షేరుపై రూ.60 తగ్గింపు అందుబాటులో ఉంది.
ఇక రిటైల్ ఇన్వెస్టర్లు ఎల్ఐసీ ఐపీవోలో పాల్గొనేందుకు ఒక్కో షేరు రూ.902 నుంచి రూ.949 వరకు కోట్ చేయాల్సిఉంటుంది. ఎల్ఐసీ ఐపీఓలో కనీస లాట్ సైజు 15 షేర్లుగా నిర్ణయించారు. అంటే కనీసం 15 షేర్లను కొనాల్సి ఉంటుంది. రిటైల్ ఇన్వెస్టర్లు గరిష్టంగా 14 లాట్స్ వరకు అప్లై చేసుకోవచ్చు.
రిటైల్ పెట్టుబడిదారులు, LIC ఉద్యోగులు, LIC పాలసీదారులు కనీసం 1 లాట్ కోసం అప్లై చేయవచ్చు. 1 లాట్‌లో 15 షేర్లు ఉన్నాయి. పెట్టుబడిదారులు గరిష్టంగా 14 లాట్స్ లేదా రూ. 2 లక్షలకు మించకుండా అప్లై వేయవచ్చు. దీని ప్రకారం రూ. 1,99,290 మొత్తానికి 210 షేర్ల వరకూ కొనుగోలు చేసే వీలుంది.
ఐపీఓ నుంచి రూ.21,008 కోట్లు సమీకరించాలని ప్రభుత్వం భావిస్తోంది
LIC IPOలో, ప్రభుత్వం తన 22,13,74,920 షేర్లను విక్రయిస్తోంది. పెట్టుబడిదారులు LIC IPOలో భౌతికంగా, డిజిటల్‌గా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని పొందుతున్నారు. గ్రే మార్కెట్‌లో కూడా షేర్ ధర మంచి ట్రెండింగ్‌లో ఉంది. భారత ప్రభుత్వం తన IPO ఆఫర్ ద్వారా రూ.21,008 కోట్లను సమీకరించాలనుకుంటోంది. ఇది పూర్తిగా 100% OFS ఆఫర్ ఫర్ సేల్ ప్రాతిపదికన అమ్ముతున్నారు.
IPOకి ముందు, మంగళవారం ఎల్‌ఐసి తన పాలసీదారులకు వాటా విక్రయం గురించి SMS సహా ఇతర మార్గాల ద్వారా తెలియజేసింది. LIC తన పాలసీదారులకు వారి మొబైల్ ఫోన్‌లలో పంపిన సందేశంలో IPOకి సంబంధించిన సమాచారాన్ని అందించింది. LIC చాలా నెలలుగా ప్రింట్, టీవీ ఛానెల్‌ల ద్వారా ఈ IPO గురించి సమాచారాన్ని ప్రచారం చేస్తోంది.
దేశంలో ఉన్న అన్ని ప్రముఖ బ్రోకరేజ్ సంస్థలు, మార్కెట్ నిపుణులు ఎల్ఐసీ ఐపీఓ ఇన్వెస్ట్ చేయాలని సూచిస్తున్నారు. ఈ ఐపీఓపై భారీ అంచనాలే ఉన్నాయి. లిస్టింగ్ కూడా అదరగొడుతుందనే అంచనాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి ఎల్ఐసీ ఐపీఓకి మంచి స్పందన లభించింది. యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 5,627 కోట్లు సమీకరించామని, ఇందులో దేశీయ కంపెనీలు పుష్కలంగా ఉన్నాయని ఎల్‌ఐసీ తెలిపింది. ఒక్కో ఈక్విటీ షేర్‌కు రూ.949 చొప్పున 5.92 కోట్ల షేర్లు యాంకర్ ఇన్వెస్టర్ల కోసం రిజర్వ్ చేయబడ్డాయి. ఎల్‌ఐసీ తన 3.5 శాతం షేర్లను ఐపీఓ ద్వారా విక్రయించబోతోంది. 20,557 కోట్లు సమీకరించే అవకాశం ఉంది.