- Home
- Business
- ఇన్ కం ట్యాక్స్ ఫైలింగ్ చివరి తేదీ: ఐటిఆర్ ఇ-ఫైలింగ్ చేసేటప్పుడు ఈ డాక్యుమెంట్స్ చూసుకోండి..
ఇన్ కం ట్యాక్స్ ఫైలింగ్ చివరి తేదీ: ఐటిఆర్ ఇ-ఫైలింగ్ చేసేటప్పుడు ఈ డాక్యుమెంట్స్ చూసుకోండి..
ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు చేయడానికి చివరి తేదీ సమీపిస్తోంది. ఆదాయపు పన్ను రిటర్న్‌ను దాఖలు చేయడానికి చివరి తేదీ 31 డిసెంబర్ 2021. అయితే ఇప్పుడు మీరు చాలా సులభమైన మార్గంలో ITR ఫైల్ చేయవచ్చు. దీనిని ఇ-ఫైలింగ్ పోర్టల్ ద్వారా చేయవచ్చు.

ఈ పని చేయడానికి ముందు పాన్, ఆధార్ కార్డ్, బ్యాంక్ ఖాతా నంబర్ వంటి అన్ని అవసరమైన డాక్యుమెంట్స్ మీ వద్ద ఉన్నాయని నిర్ధారించుకోవడం అవసరం. ముఖ్యంగా మొదటిసారి ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయబోతున్న వారికి ఈ వార్త చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ డాక్యుమెంట్లు మీ దగ్గర లేకుంటే ఐటీఆర్ ఫైల్ చేసే ప్రక్రియ మధ్యలో నిలిచిపోతుంది.
ఫారమ్ 16
ఫారం-16 అనేది ఉద్యోగస్తులందరికీ అత్యంత ముఖ్యమైన డాక్యుమెంట్. దీని సహాయంతో ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేస్తారు. ఈ డాక్యుమెంట్ కంపెనీ తరపున ఏ ఉద్యోగికైనా ఇవ్వబడుతుంది. ఇందులో, ఉద్యోగి జీతం నుండి మినహాయించిన పన్ను గురించి పూర్తి సమాచారం అలాగే ఇచ్చిన జీతం గురించి సమాచారం ఉంటుంది.
టాక్స్ సేవింగ్ ఇన్వెస్ట్‌మెంట్
చాలా మంది వ్యక్తులు పన్ను ఆదా చేయడానికి కొన్ని టాక్స్ సేవింగ్ ఇన్వెస్ట్‌మెంట్స్ పెడతారు. నిర్ణీత గడువులోగా ఈ డాక్యుమెంట్ యజమాని/ సంస్థకి ఇవ్వలేని వారు ఆదాయపు పన్ను రిటర్న్‌ను దాఖలు చేసేటప్పుడు దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అందించాలి. ఈ టాక్స్ సేవింగ్ ఇన్వెస్ట్‌మెంట్ డాక్యుమెంట్స్ LIC ప్రీమియం రిసిప్ట్, PPF ఇన్వెస్ట్‌మెంట్స్ పాస్‌బుక్, ELSS డాక్యుమెంట్, డొనేషన్ రిసిప్ట్, ట్యూషన్ ఫీజు రిసిప్ట్ మొదలైనవి కావచ్చు.
ఇన్ కం వెరిఫికేషన్ డాక్యుమెంట్
మీరు బ్యాంకు లేదా పోస్టాఫీసులో డిపాజిట్ చేసినట్లయితే లేదా ఎవరైనా వడ్డీ పథకాలలో డబ్బును సంపాదించినట్లయితే బ్యాంక్ స్టేట్‌మెంట్ నుండి వచ్చే సర్టిఫికేట్ కూడా ఉంచుకోవడం చాలా ముఖ్యం, ఎందుకంటే సరైన సమాచారాన్ని ఫైల్ చేసేటప్పుడు ఆదాయపు పన్ను రిటర్న్ నింపవచ్చు. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80TTA ప్రకారం మీరు రూ. 10,000 వరకు సంపాదించే వడ్డీపై పన్ను మినహాయింపు పొందవచ్చు.
వైద్య బీమాతో సహా
మీరు సెక్షన్ 80డి కింద రూ. 25,000 వరకు ఆరోగ్య బీమా ప్రీమియంపై పన్ను మినహాయింపును క్లెయిమ్ చేయవచ్చు. ఈ బీమా పాలసీలు మీకు, మీ జీవిత భాగస్వామికి, పిల్లలకు కావచ్చు. మీరు సీనియర్ సిటిజన్ అయితే రూ. 50,000 వరకు ఆరోగ్య బీమా ప్రీమియంపై పన్ను మినహాయింపు పొందవచ్చు. కాబట్టి ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేసేటప్పుడు ఈ రిసీప్టులు మీ దగ్గర ఉంచుకోండి.
ఈ డాక్యుమెంట్స్ మీ వద్ద ఉండటం అవసరం
1- పాన్ కార్డ్
2- ఆధార్ కార్డ్
3- బ్యాంక్ ఖాతా వివరాలు
4- ఇన్వెస్ట్‌మెంట్స్ ఫ్రూఫ్ వివరాలు
5- ఫారం 16
సులభంగా ITR ఫైల్ చేయడం ఎలా..?
- ముందుగా (https://eportal.incometax.gov.in/)కి లాగిన్ అవ్వండి .
మీ యూజర్ IDని ఎంటర్ చేసి, ప్రొసీడ్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. తర్వాత పాస్‌వర్డ్‌తో లాగిన్ చేయండి.
- పాస్‌వర్డ్ గుర్తు లేకుంటే ఫర్ గాట్ పాస్‌వర్డ్ ఆప్షన్ ద్వారా మీరు కొత్త పాస్‌వర్డ్‌ను సృష్టించవచ్చు.
లాగిన్ అయినప్పుడు ఓపెన్ పేజీలోని ఇ-ఫైల్ పై క్లిక్ చేయండి.
దీని తర్వాత, మీరు ఫైల్ ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్ ఆప్షన్ ఎంచుకోవాలి.
ఇప్పుడు 2021-22 అసెస్‌మెంట్ ఇయర్‌ని సెలెక్ట్ చేసుకొని ఆపై ప్రొసీడ్ క్లిక్ చేసి
దీని తర్వాత మీరు ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ ఎంపికను పొందుతారు.
మీరు ఆన్‌లైన్‌ని ఎంచుకుని, పర్సనలైజ్ ఆప్షన్ ఎంచుకోండి.
ఆపై ఐటిఆర్-1 (ITR-1) లేదా ITR-4 ఆప్షన్ ఎంచుకోండి.
మీరు జీతం పొందుతున్నట్లయితే, మీరు ITR-1 ఆప్షన్ ఎంచుకోవాలి.
దీని తర్వాత ITR రిటర్న్ ఫారమ్ మీ సిస్టమ్‌లో డౌన్‌లోడ్ చేయబడుతుంది.
అప్పుడు ఫిల్లింగ్ టైప్‌లో 139(1)- ఒరిజినల్ రిటర్న్‌ని ఎంచుకోండి. ఇది ఎంచుకున్న ఫారమ్‌ను తెరుస్తుంది.
అందులో అభ్యర్థించిన సమాచారాన్ని నింపడం ద్వారా సేవ్ చేసుకోండి. బ్యాంకు ఖాతా వివరాలను సరిగ్గా ఎంటర్ చేయండి
ఆన్‌లైన్ ప్రక్రియలో ధృవీకరించండి తరువాత రిటర్న్ హార్డ్ కాపీని ఆదాయపు పన్ను శాఖకు పంపండి.