MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
  • Home
  • Business
  • Kinetic e-Luna: 200 కిలోమీటర్ల మైలేజ్‌.. అదిరిపోయే అప్డేట్స్‌తో కొత్త ఎలక్ట్రిక్‌ లూనా

Kinetic e-Luna: 200 కిలోమీటర్ల మైలేజ్‌.. అదిరిపోయే అప్డేట్స్‌తో కొత్త ఎలక్ట్రిక్‌ లూనా

ప్రస్తుతం ఎలక్ట్రిక్‌ వాహనాలకు మార్కెట్లో డిమాండ్‌ పెరుగుతోంది. ప్రారంభంలో కేవలం స్కూటీలకు మాత్రమే పరిమితమైన ఎలక్ట్రిక్‌ వేరియంట్‌ వాహనాలు ఆ తర్వాత క్రమంగా బైక్‌లకు కూడా విస్తరించాయి. ఇక సరకు రవాణాకు ఉపయోగించే మోపెడ్‌లు కూడా ఎలక్ట్రిక్‌ వేరియంట్‌లో వచ్చేస్తున్నాయి. ఈ క్రమంలోనే మార్కెట్లోకి కొత్త లూనా వచ్చేస్తోంది..  

2 Min read
Author : Narender Vaitla
| Updated : Apr 03 2025, 02:12 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

ప్రముఖ ఎలక్ట్రిక్‌ టూ వీలర్‌ తయారీ సంస్థ కైనెటిక్‌ గ్రీన్‌ మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్‌ లూనాను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే మార్కెట్లోకి తీసుకొచ్చిన ఎలక్ట్రిక్‌ మోపెడ్‌కు అప్డేటెడ్‌ వెర్షన్‌ను తీసుకొస్తున్నారు. ఇప్పటికే ఈ లేటెస్ట్‌ మోపెడ్‌ వెర్షన్‌కు సంబంధించి కంపెనీ డిజైన్‌ పేటెంట్‌ను రిజిస్టర్‌ చేస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో సరుకుల రవాణా కోసం స్కూటీలను ఉపయోగించే వారికి ఇది బాగా ఉపయోగపడనుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

కొత్త కైనెటిక్‌ ఈ లూనా డిజైన్‌ పేటెంట్‌ ఇంటర్నల్ కంబస్టన్ ఇంజన్‌తో రానుందని కంపెనీ చెబుతోంది. ఈ ఎలక్ట్రిక్‌ లూనాలో స్క్వేర్ హెడ్‌ల్యాంప్, చిన్న ట్యాబ్ లాంటి ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ వంటి ఫీచర్లను అందించనున్నారు. ఎక్స్‌ఎల్‌ బండ్లను పోలిన విధంగా కాళ్ల ముందు ఖాళీ స్థలాన్ని అందించనున్నారు. ఈ కంపెనీ నుంచి ఇది వరకు వచ్చిన లూనాతో పోల్చితే తాజా డిజైన్‌లో ముఖ్యమైన మార్పులు కనిపిస్తున్నాయి. 

34

ముఖ్యంగా రైడర్ సీటు, హ్యాండిల్‌బార్ మధ్యలో ఉన్న కొత్త స్టోరేజ్ బాక్స్. ఈ బాక్స్ నిల్వ సామర్థ్యాన్ని పెంచడంలో సహాయపడుతుంది లేదా అదనపు బ్యాటరీ ప్యాక్‌ను అమర్చేందుకు ఉపయోగపడవచ్చు. ఇది ఈ ఎలక్ట్రిక్ మోపెడ్ ఓవరాల్ రైడింగ్ రేంజ్‌ను పెంచుతుందని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఈ లూనాలో 2 కేడబ్ల్యూహెచ్‌ బ్యాటరీ ప్యాక్‌ను అందించారు. దీనిని ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 110 కి.మీలు నాన్‌ స్టాప్‌ దూసుకెళ్తుంది. 

ప్రస్తుతం అందుబాటులో ఉన్న లూనాలో టాప్‌ స్పీడ్‌ గంటకు 50 కిలోమీటర్లుగా ఉంది. దీనిని పూర్తిగా ఛార్జ్‌ చేసేందుకు దాదాపు 4 గంటల సమయం పడుతుంది. అయితే త్వరలోనే మార్కెట్లోకి రానున్న కొత్త మోడల్‌లో తీసుకొస్తున్న అదనపు బ్యాటరీ ద్వారా రేంజ్‌ భారీగా పెరగనుందని తెలుస్తోంది. ఒక్కసారి ఫుల్‌ ఛార్జ్‌ చేస్తే ఏకంగా 200 కిలోమీటర్లు వెళ్తుందని అంచనా వేస్తున్నారు. 
 

44

ఇదిలా ఉంటే ఈ కొత్త ఇ-లూనాలో బ్యాటరీ ఎలా ఇస్తారన్నదానిపై క్లారిటీ లేదు. ఫిక్డ్స్‌ బ్యాటరీ ఉంటుందా.? లేదా డిటాచబుల్‌ బ్యాటరీని ఇస్తారా అన్నది తెలియాల్సి ఉంది. కాగా ఈ కొత్త లూనా లాంచ్‌కి సంబంధించి ఇప్పటి వరకు కంపెనీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే కచ్చితంగా ఈ ఏడాది చివరి లోపు ఈ ఈవీ మార్కెట్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. 

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
పర్సనల్ పైనాన్స్
భారతీయ ఆటోమొబైల్
బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold: బంగారం, వెండి మాత్రమే మిమ్మల్ని కాపాడతాయి.. అసలు సంగతి చెప్పిన రాబర్ట్ కియోసాకి !
Recommended image2
Cheapest Gold : ఇండియాలో అత్యంత చౌకగా బంగారం దొరికే సిటీ ఏది? ఇక్కడ ఎందుకంత తక్కువ ధర?
Recommended image3
Gold Price Crash: మళ్లీ పశ్చిమాసియాలో ముదిరిన యుద్ధం..పాతాళానికి పడిపోతున్న పసిడి, సిల్వర్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved