Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Business
  • మీ ఫ్రెండ్స్ కి 5G డేటాను గిఫ్ట్ గా ఇవ్వొచ్చు! ఎలాగో తెలుసా?

మీ ఫ్రెండ్స్ కి 5G డేటాను గిఫ్ట్ గా ఇవ్వొచ్చు! ఎలాగో తెలుసా?

జియో కస్టమర్లకు శుభవార్త. రిలయన్స్ జియో కొత్తగా ఏడాది పాటు అన్ లిమిటెడ్ 5G డేటా వినియోగించడానికి ఒక అద్భుతమైన ప్లాన్ తీసుకొచ్చింది. ఇందులో గొప్ప విషయం ఏంటంటే.. ఈ డాటా ప్లాన్ ను మీ స్నేహితులు లేదా కుటుంబ సభ్యులకు గిఫ్ట్ గా కూడా ఇవ్వవచ్చు. 5G డేటా గిఫ్ట్ వోచర్ గురించి మరిన్ని వివరాలు ఇక్కడ ఉన్నాయి. 

Naga Surya Phani Kumar | Published : Dec 26 2024, 01:10 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
15
Asianet Image

జియో తన వినియోగదారులకు అన్ లిమిటెడ్ 5G డేటాను అందించడానికి చక్కటి ఆఫర్ ని తీసుకొచ్చింది. న్యూ ఇయర్ సందర్భంగా ఈ ఆఫర్ వినియోగదారులకు ఆకట్టుకుంటుందని జియో ఆశిస్తోంది. ఈ ఆఫర్ ఏంటంటే.. మీరు సంవత్సరం పాటు అన్ లిమిటెడ్ 5G డేటాను ఆస్వాదించడానికి రూ.601 పెట్టి ‘జియో ట్రూ 5G గిఫ్ట్ వోచర్’ తీసుకోవాలి. దీన్ని యాక్టివేట్ చేసుకుంటే సంవత్సరం మొత్తం 5జీ సేవలు పొందవచ్చు. 

25
Asianet Image

మీరు రూ.601 పెట్టి 5G అప్‌గ్రేడ్ గిఫ్ట్ వోచర్ ను తీసుకొని మై జియో యాప్ ద్వారా రిడీమ్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్ లో ఉన్న గొప్ప విషయం ఏంటంటే దీన్ని 4జీ వినియోగదారులు కూడా ఉపయోగించుకోవచ్చు. అంటే ఇప్పటికే 4జీ సేవలు పొందుతున్న జియో వినియోగదారులు 5జీ సేవలు పొందేందుకు ఈ వోచర్ ద్వారా అప్ గ్రేడ్ చేసుకోవచ్చు. 

35
Asianet Image

అయితే ఈ 5G డేటా వోచర్‌ను ఉపయోగించాలంటే ఇప్పటికే కనీసం 1.5 GB 4G డేటాకు నెలవారీ లేదా త్రైమాసిక ప్లాన్‌లో రీఛార్జ్ చేసి ఉండాలి. ఇంకో విషయం ఏంటంటే రోజుకు 1 GB డేటా ప్లాన్‌లో ఉన్న వారికి, రూ.1,899 వార్షిక రీఛార్జ్ ప్లాన్‌లో ఉన్న వారికీ ఈ వోచర్ పనిచేయదు. అంటే రోజుకు 1 GB డేటా వినియోగించే వారు 5G సేవలను పొందలేరు. 

 

45
Asianet Image

జియో ట్రూ 5G అపరిమిత డేటా గిఫ్ట్ వోచర్

వినియోగదారులు జియో ట్రూ 5G గిఫ్ట్ వోచర్‌ను తమకోసమే కాకుండా ఫ్రెండ్స్, రిలేటివ్స్ కి కూడా గిఫ్ట్ గా ఇవ్చొచ్చు. మై జియో యాప్ ద్వారా ఈ వోచర్ ని వేరొకరికి బహుమతిగా ఇవ్వవచ్చు. అయితే మీరు ఈ గిఫ్ట్ ఇవ్వాలనుకున్న వారు ఈ వోచర్‌ను ఉపయోగించి అదనపు ప్రయోజనాలను పొందడానికి అర్హత కలిగి ఉండాలని మర్చిపోకండి. అంటే వారు కనీసం బేసిక్ ప్లాన్‌లో ఉన్నారో లేదో చెక్ చేసుకొని ఈ గిఫ్ట్ వోచర్ ఇవ్వండి. 

 

55
Asianet Image

జియో అపరిమిత 5G డేటా వోచర్ రూ.199, రూ.239, రూ.299, రూ.319, రూ.329, రూ.579, రూ.666, రూ.769, రూ.899 రీఛార్జ్ ప్లాన్‌లలో ఉన్నవారికి పనిచేస్తుంది. వినియోగదారుల బేసిక్ ప్లాన్‌ను బట్టి 5G డేటా వోచర్ చెల్లుబాటు ఉంటుంది. గరిష్టంగా 30 రోజులు చెల్లుబాటు అవుతుంది.

5G డేటా వోచర్ యాక్టివేట్ అయిన తర్వాత వినియోగదారులు 3 GB రోజువారీ 4G డేటాతో పాటు, అపరిమిత 5G డేటాను కూడా పొందుతారు. ఇది కాకుండా జియో రూ.51 (1 నెల), రూ.101 (2 నెలలు), రూ.151 (3 నెలలు) ధరలలో 5G వోచర్ ప్లాన్‌లను కూడా అందిస్తోంది.

Naga Surya Phani Kumar
About the Author
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది. Read More...
 
Recommended Stories
Top Stories