MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Business
  • జియో సూపర్ ప్లాన్ : కేవలం 3 రూపాయలకే అన్ లిమిటెడ్ కాలింగ్, డాటా, మెసేజెస్ ... 23 రోజులకు రూ.75 మాత్రమే..!!

జియో సూపర్ ప్లాన్ : కేవలం 3 రూపాయలకే అన్ లిమిటెడ్ కాలింగ్, డాటా, మెసేజెస్ ... 23 రోజులకు రూ.75 మాత్రమే..!!

రిలయన్స్ జియో రీచార్జ్ ప్లాన్ ధరల పెంపుతో నారాజ్ అయ్యారా... అయితే జియోలో అతి చౌక రీచార్జ్ ప్లాన్స్ కూడా వున్నాయని తెలుసుకొండి. కేవలం రోజుకు 3 రూపాయలతో అన్ లిమిటెడ్ కాలింగ్, డాటా, ఎస్ఎంఎస్ లు పొందే ఆఫర్ జియోలో వుందంటే నమ్ముతారా..!

2 Min read
Author : Arun Kumar P
Published : Aug 20 2024, 09:12 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Reliance JIO

Reliance JIO

రిలయన్స్ జియో... టెలికాం రంగంలో ఈ పేరు ఓ సంచలనం. భారతీయులందరికీ ఉచితంగానే అన్ లిమిటెడ్ కాలింగ్స్, ఇంటర్నెట్ డాటా, ఎస్ఎంఎస్ లను అందించి టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికింది. ఇలా దేశవ్యాప్తంగా విస్తరించిన జియో నెట్ వర్క్ వినియోగదారులకు అత్యుత్తమ, అత్యాధునిక సేవలను అందిస్తోంది. దేశంలో మొదటిసారి 5G సేవలను ప్రారంభించి ఇంటర్నెట్ విప్లవానికి నాంది పలికింది జియో. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Reliance JIO

Reliance JIO

అయితే ఇటీవల ఒక్కసారిగా జియో కుదుపుకు గురయ్యింది. రీచార్జ్ ప్లాన్స్  ధరలు భారీగా పెంచి వినియోగదారులకు షాక్ ఇచ్చింది జియో... దీంతో ఇతర నెట్ వర్క్ లోకి జంప్ అయి వినియోగదారులు కూడా రిటర్న్ షాక్ ఇచ్చారు. ముఖ్యంగా ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బిఎస్ఎన్ఎల్ లోకి లక్షలాదిమంది జియో వినియోగదారులు చేరారు...మరికొందరు ఇతర నెట్ వర్క్స్ లోకి మారారు. దీంతో ప్రమాదాన్ని పసిగట్టిన జియో జాగ్రత్త చర్యలు చేపట్టింది. పెంచిన  రీచార్జ్ ధరలను కొనసాగిస్తూనే వినియోగదారులను నిలుపుకునే చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే కొత్తగా రీచార్జ్ ప్లాన్స్ ని తీసుకువచ్చింది.  

35
Reliance JIO

Reliance JIO

రూ.75 రీచార్జ్ తో 23 రోజుల వ్యాలిడిటీ ప్లాన్..: 

జియో రీచార్జ్ ధరలు అమాంతం పెంచేసాక ఏ ప్లాన్ చూసినా రూ.200 పైనే వున్నాయి. వందల నుండి వేల రూపాయల్లోపై అన్ని రీచార్జ్ ప్లాన్స్ వున్నాయి. అలాంటిది కేవలం రూ.75 రూపాయల రీచార్జ్ ప్లాన్ ఏంటని ఆశ్చర్యపోతున్నారా..!! కానీ మీరు విన్నది నిజమే. జియోలో 75 రూపాయలతో అన్ లిమిటెడ్ కాలింగ్స్, ఎస్ఎంఎస్ తో పాటు డాటాను అందించే ప్లాన్ వుంది.  
 

45
Reliance JIO

Reliance JIO

కేవలం 75 రూపాయలతో రీచార్జ్ చేసుకుంటే చాలు... 23 రోజులపాటు అన్ లిమిటెడ్ కాలింగ్స్, 50 ఎస్ఎంఎస్ లతో పాటు ఇంటర్నెట్ డాటా లభిస్తుంది. రోజుకు 100ఎంబి చొప్పున 23 రోజులకు 2.5 జిబి డేటా లభిస్తుంది. దీనికి అదనంగా మరో 200ఎంబి డేటాను కూడా బోనస్ గా పొందవచ్చు. అంతేకాదు ఈ ప్లాన్ తో జియో టివి, జియో సినిమా, జియో క్లౌడ్, జియో సెక్యూరిటీ ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా పొందవచ్చు. 

55
Reliance JIO

Reliance JIO

అయితే ఈ ప్లాన్ జియో వినియోగదారులందరికీ కాదు... కేవలం జియో ఫోన్ వినియోగదారులకు మాత్రమే. ఇంటర్నెట్ డేటా ఎక్కువగా వాడేవారికి కూడా ఈ ప్లాన్ అంతగా ఉపయోగపడకపోవచ్చు. కేవలం అన్ లిమిటెడ్ కాలింగ్ కోరుకునేవారికి ఈ జియో ప్లాన్ చాలాబాగా ఉపయోగపడుతుంది. 


 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Worlds Cheapest House: ప్రపంచంలోనే అత్యంత చౌకైన ఇల్లు.. కేవలం 1 డాలర్‌ మాత్రమే !
Recommended image2
మీ పిల్ల‌లు కూడా గుడ్డులో తెల్ల‌ది తిని, ప‌చ్చ‌ది ప‌డేస్తున్నారా.? ఈ గ్యాడ్జెట్ ఉంటే అలా కుదరదు
Recommended image3
తెలియ‌కుండానే వంట నూనె ఎక్కువ‌గా వాడుతున్నారా.? ఈ ప్రొడ‌క్ట్ ఉంటే స‌మ‌స్య‌కు చెక్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved