జియో ఫైబర్ దివాళీ బంపర్ ఆఫర్ JioFiber Double Festival Bonanza కింద రూ. 6000 సెట్ టాప్ బాక్స్ ఫ్రీ..
దీపావళి సందర్భంగా, రిలయన్స్ జియో 'జియోఫైబర్ డబుల్ ఫెస్టివల్ బొనాంజా' ఆఫర్‌ను ప్రవేశపెట్టింది.ఈ ఆఫర్ అక్టోబర్ 18 నుండి 28 వరకు చెల్లుబాటులో ఉంటుంది. ఇందులో, వినియోగదారులకు అనేక రకాల బెనిఫిట్స్ ఉన్నాయి.
డబుల్ ఫెస్టివల్ బొనాంజా ఆఫర్ కింద కంపెనీ రూ. 599, రూ. 899 రెండు ఫైబర్ ప్లాన్‌లతో అందిస్తోంది. ఆఫర్ కింద, ఈ ప్లాన్‌లతో వినియోగదారులకు రూ.6,500 విలువైన బెనిఫిట్స్ అలాగే ఫ్రీగా 4K JioFiber సెట్ టాప్ బాక్స్ అందుకోనున్నారు. కొత్త కనెక్షన్‌తో మాత్రమే కస్టమర్‌లు ఈ ఆఫర్‌లను పొందుతారు. అంటే ఈ పదిరోజుల మధ్య కొత్తగా ఫైబర్ ప్లాన్ తీసుకునే కస్టమర్లకు కంపెనీ ఈ బెనిఫిట్ అందుబాటులో ఉంటుంది.
డబుల్ ఫెస్టివల్ బొనాంజా ఆఫర్ కింద, కస్టమర్లు కొత్త కనెక్షన్ తీసుకొని 6 నెలల పాటు రూ.599 రూ.899 ప్లాన్‌లకు సబ్‌స్క్రయిబ్ చేసుకున్న, వారికి అనేక అదనపు బెనిఫిట్స్ అందుబాటులోకి వస్తాయి.
599 x 6 నెలల ప్లాన్: ఈ ఆఫర్ కింద వినియోగదారులు 30Mbps వేగం, 14+ OTT యాప్‌లు 550+ ఆన్-డిమాండ్ ఛానెల్‌లను పొందుతారు. ఈ ప్లాన్ కోసం రూ. 4,241 (రూ. 3,494 + రూ. 647 జిఎస్‌టి) చెల్లిస్తే, కొత్త కస్టమర్‌లు రూ. 4,500 వోచర్‌ను పొందుతారు. ఈ వోచర్‌లు 4 విభిన్న బ్రాండ్‌ల కోసం ఉంటాయి. రూ. 1,000 AJIO, రిలయన్స్ డిజిటల్ కోసం రూ. 1,000 వోచర్, NetMeds కోసం రూ. 1,000 వోచర్ IXIGO కోసం రూ. 1,500 వోచర్ ఉన్నాయి. దీని కొత్త కస్టమర్లకు 15 రోజుల అదనపు వాలిడిటీ కూడా ఇవ్వబడుతుంది.
899 x 6 నెలల ప్లాన్: ఇందులో, కస్టమర్‌లు 100Mbps వేగం, 14+ OTT యాప్‌లు 550+ ఆన్-డిమాండ్ ఛానెల్‌లను పొందుతారు. ఈ ప్లాన్ కోసం రూ. 6,365 (రూ. 5,394 + 971 జీఎస్‌టీ) చెల్లిస్తే, కొత్త కస్టమర్‌లు రూ. 6,500 వోచర్‌ను పొందుతారు. ఈ వోచర్‌లు 4 విభిన్న బ్రాండ్‌ల కోసం ఉంటాయి. IXIGO కోసం రూ. 2,000 AJIO వోచర్, రూ. 1,000 రిలయన్స్ డిజిటల్ వోచర్, రూ. 500 నెట్‌మెడ్స్ వోచర్ రూ. 3000 వోచర్ ఉన్నాయి. దీని కొత్త కస్టమర్లకు 15 రోజుల అదనపు వాలిడిటీ కూడా ఇవ్వబడుతుంది.
jio
899 x3 నెలల ప్లాన్: ఇందులో, కస్టమర్‌లు 100Mbps వేగం, 14+ OTT యాప్‌లు 550+ ఆన్-డిమాండ్ ఛానెల్‌లను పొందుతారు. ఈ ప్లాన్ కోసం రూ. 2,697 (రూ. 3,182 + 485 GST) చెల్లించిన తర్వాత, కొత్త కస్టమర్‌లు రూ. 3,500 వోచర్‌ను పొందుతారు. ఈ వోచర్‌లు 4 విభిన్న బ్రాండ్‌ల కోసం ఉంటాయి. AJIO కోసం రూ. 1,000 వోచర్ రిలయన్స్ డిజిటల్‌కు రూ. 500, నెట్‌మెడ్స్‌కు రూ. 500 IXIGO కోసం రూ. 1,500 ఉన్నాయి. ఇందులో కస్టమర్లకు 15 రోజుల అదనపు వ్యాలిడిటీ ఇవ్వబడదని గమనించాలి. కస్టమర్‌లు పైన పేర్కొన్న ప్లాన్‌లలో దేనినైనా కొనుగోలు చేస్తే, వారు ఎటువంటి ఛార్జీ లేకుండా 4K JioFiber సెట్ టాప్ బాక్స్‌ను కూడా పొందుతారు, దీని ధర రూ. 6,000 కావడం గమనార్హం.