ట్రాయ్ దెబ్బకు దిగొచ్చిన జియో, ఎయిర్‌టెల్: తగ్గిన రీఛార్జ్ ధరలు
గత కొన్నేళ్లుగా భారతదేశంలో మొబైల్ ఫోన్ రీఛార్జ్ ధరలు బాగా పెరిగిపోయాయి. దీనికి అడ్డుకట్ట వేయడానికి టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) చర్యలు తీసుకుంటోంది. మొబైల్ కంపెనీలకు ధరలు తగ్గించాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో జియో, ఎయిర్ టెల్, వోడాఫోన్-ఐడియా రీఛార్జ్ ప్లాన్స్ ధరలు తగ్గించాయి. ఎంత తగ్గాయో చూద్దాం రండి.

మన దేశంలో చాలా మంది కీ ప్యాడ్ ఫోన్లు వాడుతున్నారు. వారు కాల్స్ మాత్రమే చేస్తారు. వారికి డేటా ప్యాక్ అవసరం లేదు. అయితే ఇప్పుడున్న చాలా రీఛార్జ్ ప్లాన్స్ ఇంటర్నెట్ సేవలతో కలిపి వస్తున్నాయి. దీంతో చాలా మంది తప్పక ఎక్కువ డబ్బులు పెట్టి డేటా అవసరం లేకపోయినా అలాంటి రీఛార్జ్ లు చేసుకుంటున్నారు. అందుకే డేటా వాడని వారికి తక్కువ ధర రీఛార్జ్ ప్లాన్‌లు రూపొందించాలని ట్రాయ్ ఆదేశించింది. ట్రాయ్ ఆదేశాల మేరకు ఎయిర్‌టెల్, జియో, వోడాఫోన్-ఐడియా రీఛార్జ్ ధరలు తగ్గించాయి.
ఇప్పుడు ఎవరి చేతిలో చూసినా స్మార్ట్ ఫోన్లు కనిపిస్తాయి. అయితే గ్రామీణ ప్రాంతాల్లో యువత వద్ద తప్ప రైతులు, మహిళలు ఇంటర్నెట్ సేవలను ఉపయోగించలేరు. అందువల్ల యువత వద్ద తప్ప మిగిలిన చాలా మంది కీ ప్యాడ్ ఫోన్లు వాడుతున్నారు. వారు కేవలం కాల్స్ మాట్లాడటానికి ఈ ఫోన్లు వాడతారు.
అందుకే ట్రాయ్ తక్కువ రీఛార్జ్ ప్లాన్స్ అమలు చేయాలని ఆదేశాలిచ్చింది. ట్రాయ్ ఆదేశాలతో డేటా లేని కాల్స్, SMS రీఛార్జ్ ప్లాన్‌లను జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ అందిస్తున్నాయి. అవేంటో చూద్దాం రండి.
రూ.469 ప్లాన్‌లో 84 రోజుల వ్యాలిడిటీ
ఎయిర్‌టెల్ రూ.469 ప్లాన్‌లో 84 రోజులకు అన్‌లిమిటెడ్ కాల్స్, 900 SMSలు, అపోలో 24/7 సర్కిల్ మెంబర్‌షిప్, హలో ట్యూన్స్ లభిస్తాయి. రోజుకు రూ.5.58 మాత్రమే ఖర్చవుతుంది.
రూ.1849 ప్లాన్‌లో అదనపు బెనిఫిట్స్
ఎయిర్‌టెల్ రూ.1849 ప్లాన్‌లో 365 రోజులకు అన్‌లిమిటెడ్ కాల్స్, 3600 SMSలు, అపోలో 24/7, హలో ట్యూన్స్ లభిస్తాయి. రోజుకు రూ.5.06 మాత్రమే ఖర్చవుతుంది.
వోడాఫోన్ ఐడియా తక్కువ ధర ప్లాన్‌లు ఇవిగో
వోడాఫోన్ ఐడియా రూ.470 ప్లాన్‌లో 84 రోజులకు అన్‌లిమిటెడ్ కాల్స్, 900 SMSలు లభిస్తాయి. రోజుకు రోజుకు రూ.5.59 మాత్రమే ఖర్చవుతుంది.
రూ.1849 ప్లాన్‌లో అదనపు బెనిఫిట్స్
వోడాఫోన్ ఐడియా రూ.1849 ప్లాన్‌లో 365 రోజులకు అన్‌లిమిటెడ్ కాల్స్, 3600 SMSలు లభిస్తాయి. రోజుకు రూ.5.06 మాత్రమే ఖర్చవుతాయి.
జియో కొత్త రీఛార్జ్ ప్లాన్‌లు
జియో రూ.448 ప్లాన్‌లో 84 రోజులకు అన్‌లిమిటెడ్ కాల్స్, 1000 SMSలు, జియో క్లౌడ్, జియో సినిమా, జియో టీవీ లభిస్తాయి. రోజుకు రూ.5.33 మాత్రమే ఖర్చవుతుంది.
జియో రూ.1748 ప్లాన్
జియో రూ.1748 ప్లాన్‌లో 336 రోజులకు అన్‌లిమిటెడ్ కాల్స్, 3600 SMSలు, జియో క్లౌడ్, జియో టీవీ, జియో సినిమా లభిస్తాయి.