అమెజాన్ సి‌ఈ‌ఓ జెఫ్ బెజోస్ సక్సెస్ స్టోరీ.. ప్రపంచ ధనవంతుడిగా ఎలా మారాడో తెలుసుకోండి..

First Published Feb 6, 2021, 7:33 PM IST

ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు, అమెజాన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) తన పదవి నుంచి తొలగిపోతున్నట్లు  ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే జెఫ్ బెజోస్ దాదాపు మూడు దశాబ్దాలుగా అమెజాన్ సి‌ఈ‌ఓ పదవిలో ఉన్నారు. సంస్థలోని ఇతర భాగాలపై దృష్టి పెట్టడానికి జెఫ్  బెజోస్ పదవీ విరమణ చేయనున్నట్లు తెలిపారు. కానీ సీఈఓ పదవి నుంచి వైదొలిగిన తరువాత అమెజాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా కొనసాగుతారు. జెఫ్ బెజోస్ తరువాత అమెజాన్  సి‌ఈ‌ఓ పదవిని ప్రస్తుతం కంపెనీలో రెండవ స్థానంలో ఉన్న ఆండీ జెస్సి నియామకం కానున్నారు.