Jeep Offers: జీప్ కారు కొనుక్కోవాలంటే ఇదే మంచి టైమ్: రూ.4 లక్షల వరకు డిస్కౌంట్
Jeep Offers: జీప్ ఇండియా జూన్ 2025లో మూడు మోడళ్లపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. ఏకంగా రూ.4 లక్షల వరకు తగ్గింపు ఇవ్వడంతో పాటు అదనపు సౌకర్యాలు కూడా అందిస్తోంది. వాటి గురించి వివరంగా తెలుసుకుందామా?
- FB
- TW
- Linkdin
Follow Us
)
రెండవ ప్రపంచ యుద్ధంలోనే జీప్ ఉంది
జీప్ అనేది ఒక ఫేమస్ బ్రాండ్. ఇది ఒక అమెరికన్ ఆటోమొబైల్ బ్రాండ్. ఇప్పుడు మల్టీ నేషనల్ కంపెనీ అయిన స్టెల్లాంటిస్ యాజమాన్యంలో ఉంది. కాని జీప్ కంపెనీ వాహనాలను రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో ఎక్కువగా ఉపయోగించారు. ఆ తర్వాత నుంచి జీప్ వాహనాలకు క్రేజ్ పెరిగింది. చాలా మంది జీప్ అనగానే పోలీస్ జీప్ అనుకుంటారు. కాని అందులో చాలా మోడల్స్ ఉన్నాయి. జూన్ నెలలో డిస్కౌంట్ ఆఫర్లపై లభిస్తున్న జీప్ వెహికల్స్ గురించి తెలుసుకుందాం.
జీప్ కంపాస్ పై రూ.2.95 లక్షల వరకు డిస్కౌంట్
2025 జూన్ నెలలో జీప్ ఇండియా తన వాహన శ్రేణిలోని వివిధ మోడల్స్ పై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. అమ్మకాలను పెంచుకోవడానికి, కస్టమర్లను ఆకర్షించడానికి కంపాస్, గ్రాండ్ చెరోకీ, మెరిడియన్ మోడళ్లపై అధిక డిస్కౌంట్లు అందిస్తోంది. జీప్ కంపాస్ కొనుక్కొనే వారికి మొత్తం రూ.2.95 లక్షల వరకు డిస్కౌంట్ లభిస్తుంది.
జీప్ గ్రాండ్ చెరోకీపై రూ.3 లక్షల వరకు తగ్గింపు
ఇందులో రూ.1.70 లక్షల వరకు ప్రత్యక్ష కస్టమర్ డిస్కౌంట్, రూ.1.10 లక్షల వరకు కార్పొరేట్ డిస్కౌంట్ కూడా ఉన్నాయి. అదనంగా రూ.15,000 ప్రత్యేక డిస్కౌంట్ కూడా ఉంది. ఇది వైద్యులు, లీజింగ్ కంపెనీలు, ఎంపిక చేసిన భాగస్వాములకు మాత్రమే వర్తిస్తుంది.
ఇక గ్రాండ్ చెరోకీ(O) ట్రిమ్ ధర రూ.67.50 లక్షలు, దీనిపై రూ.3 లక్షల డిస్కౌంట్ అందిస్తున్నారు. అయితే ఈ డిస్కౌంట్లు కార్ల లభ్యత, సిటీ, ఇతర నిబంధనలకు లోబడి ఉంటాయని మర్చిపోవద్దు.
జీప్ మెరిడియన్ పై రూ.4 లక్షల వరకు డిస్కౌంట్
మీరు గాని జీప్ మెరిడియన్ కొనుక్కోవాలనుకుంటే గరిష్టంగా రూ.2.30 లక్షల కస్టమర్ డిస్కౌంట్ పొందొచ్చు. ఇది కాకుండా రూ.1.30 లక్షల కార్పొరేట్ డిస్కౌంట్, రూ.30,000 ప్రత్యేక డిస్కౌంట్‌తో కలిపి మొత్తం రూ.3.90 లక్షల వరకు లభిస్తుంది.
జీప్ మెరిడియన్ లాంగిట్యూడ్, లాంగిట్యూడ్ ప్లస్, లిమిటెడ్ (O), ఓవర్‌ల్యాండ్ అనే నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. దీని ప్రాథమిక ధర రూ.24.99 లక్షల నుండి రూ.38.79 లక్షల వరకు ఉంది.
జీప్ కంపాస్ రూ.18.99 లక్షల నుండి రూ.32.41 లక్షల వరకు లభిస్తుంది.
జీప్ కార్ల డిస్కౌంట్లు
జీప్ కార్లలో 170 PS పవర్, 350 Nm టార్క్ కలిగిన 2.0 లీటర్ డీజిల్ ఇంజిన్ ఉపయోగించారు. ఇవి 6 స్పీడ్ మాన్యువల్ లేదా 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వస్తాయి.
పైన పేర్కొన్న డిస్కౌంట్లు వివిధ వెబ్‌సైట్ల నుండి సేకరించిన సమాచారం ఆధారంగా తెలిపినవి. ఈ డిస్కౌంట్లు రాష్ట్రం, నగరం, డీలర్, కార్ల లభ్యతను బట్టి మారుతాయి. కారు కొనుగోలు చేసే ముందు మీ స్థానిక డీలర్‌ను సంప్రదించి సరైన డిస్కౌంట్ వివరాలను తెలుసుకోండి.