- Home
- Business
- ITR Update : గడువు ముగిసినప్పటికీ, వీరు మాత్రమే జరిమానా లేకుండా ITR ఫైల్ చేయవచ్చు...ఎవరో తెలుసా..?
ITR Update : గడువు ముగిసినప్పటికీ, వీరు మాత్రమే జరిమానా లేకుండా ITR ఫైల్ చేయవచ్చు...ఎవరో తెలుసా..?
ఆదాయపు పన్ను ఫైలింగ్ ముగిసేందుకు మరికొద్ది గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. అయితే గడువు ముగిసినప్పటికీ, ఈ వ్యక్తులు మాత్రమే జరిమానా లేకుండా ITR ఫైల్ చేయవచ్చు అది ఎలాగో తెలుసుకుందాం.

ఆదాయపు పన్ను శాఖ విడుదల చేసిన సమాచారం ప్రకారం జూలై 30 వరకు 5 కోట్ల మంది తమ ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేశారు. డిపార్ట్‌మెంట్ తరపున ITR ఫైల్ చేయడానికి చివరి తేదీ 31 జూలై 2022గా నిర్ణయించబడింది. అది కూడా మరికొద్ది గంటల్లోనే ముగియనుంది.
ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం, జూలై 31 తర్వాత ఐటీఆర్ ఫైల్ చేసినప్పటికీ, ఎలాంటి పెనాల్టీ చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ నియమం ఏమిటో తెలుసుకోండి.
జూలై 31లోపు ఐటీఆర్ ఫైల్ చేయడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తులు ఈ-ఫైలింగ్ కోసం వెబ్‌సైట్ హ్యాంగ్ అవుతోందని చెబుతున్నారు. మరోవైపు ఆదాయపు పన్ను శాఖ ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అవగాహన కల్పిస్తోంది. ఎలాంటి పెనాల్టీ పడకుండానే సమయానికి ఐటీఆర్ ఫైల్ చేయాలని డిపార్ట్‌మెంట్ తెలిపింది.
కానీ కొన్ని సందర్భాల్లో జరిమానా లేకుండా గడువు తేదీ తర్వాత కూడా ఐటీఆర్ ఫైల్ చేయవచ్చు. ఆదాయపు పన్ను సెక్షన్ 234ఎఫ్ ప్రకారం, ఆర్థిక సంవత్సరంలో ఒక వ్యక్తి యొక్క మొత్తం ఆదాయం ప్రాథమిక మినహాయింపు పరిమితిని మించకపోతే, ఐటీఆర్ ఆలస్యంగా దాఖలు చేయడానికి అవకాశం ఉందని పన్ను నిపుణులు అంటున్నారు.
సరళమైన భాషలో చెప్పాలంటే, 2021-22 ఆర్థిక సంవత్సరం వరకు మీ మొత్తం ఆదాయం రూ. 2.5 లక్షలు లేదా అంతకంటే తక్కువ, మీరు జూలై 31 తర్వాత ఆదాయపు పన్నును దాఖలు చేసినందుకు ఎలాంటి పెనాల్టీ చెల్లించాల్సిన అవసరం లేదు. మీ తరపున దాఖలు చేసిన ITRని జీరో ITR అంటారు.