MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Business
  • ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్‌ (ITR) ఇంకా ఫైల్‌ చేయలేదా? ఇవాళే చివరి తేదీ.. మిస్సయితే ఎంతెంత ఫైన్ కట్టాలో తెలుసా?

ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్‌ (ITR) ఇంకా ఫైల్‌ చేయలేదా? ఇవాళే చివరి తేదీ.. మిస్సయితే ఎంతెంత ఫైన్ కట్టాలో తెలుసా?

ఉద్యోగులు, వ్యాపారులకు డెడ్‌లైన్‌ వచ్చేసింది. పన్ను చెల్లింపుదారులు తమ ఇన్‌కమ్ ట్యాక్స్‌ రిటర్న్‌ (ఐటీఆర్‌) ఫైల్‌ చేసేందుకు నేడే (నవంబర్‌ 15) లాస్ట్‌ డేట్‌. ఇవాళ మిస్ అయ్యారంటే.. ఫైన్‌తో ఐటీఆర్ ఫైల్‌ చేయాల్సి ఉంటుంది మరి...

2 Min read
Author : Galam Venkata Rao
| Updated : Nov 15 2024, 10:36 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ITR Filing

ITR Filing

ఉద్యోగులు, వ్యాపారులకు డెడ్‌లైన్‌ వచ్చేసింది. పన్ను చెల్లింపుదారులు తమ ఇన్‌కమ్ ట్యాక్స్‌ రిటర్న్‌ (ఐటీఆర్‌) ఫైల్‌ చేసేందుకు నేడే (నవంబర్‌ 15) లాస్ట్‌ డేట్‌. ఇవాళ మిస్ అయ్యారంటే.. ఫైన్‌తో ఐటీఆర్ ఫైల్‌ చేయాల్సి ఉంటుంది మరి... 
అనివార్య కారణాల వల్ల నవంబరు 15వ తేదీలోపు ఐటీఆర్‌ ఫైల్‌ చేయడంలో విఫలమైతే.. డిసెంబరు 31 2024 వరకు అవకాశం ఉంది. అయితే, నవంబర్‌ 15 తర్వాత ఆలస్యంగా ఐటీ రిటర్న్‌ (ఐటీఆర్‌ లేట్‌ ఫైలింగ్‌)ను సమర్పించడాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Last date for ITR Filing

Last date for ITR Filing

2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి (అసెస్‌మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్న్‌ల (ITR) ఇ-ఫైలింగ్ 2024 ఏప్రిల్ 1న ప్రారంభమైంది. అయితే, వివిధ వర్గాల పన్ను చెల్లింపుదారులకు వేర్వేరు గడువులను సంబంధిత శాఖ నిర్దేశించింది. 

2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను రిటర్నులను (ITR) దాఖలు చేయడానికి గడువు మొదటి సెప్టెంబర్ 30 - 2024గా నిర్ణయించారు. అయితే, అది అక్టోబర్ 7వ తేదీ వరకు పొడిగించారు. ఆ తర్వాత అక్టోబర్ 31వరకు పొడిగించారు. మరోసారి ఐటీఆర్ ఫైలింగ్ గడువును పొడిగించి... నవంబర్ 15వ తేదీ వరకు డెడ్ లైన్ విధించింది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ). పన్ను చెల్లింపుదారులు తమ రిటర్న్‌లను సమర్పించే ముందు క్షుణ్ణంగా ఆడిట్ చేయడానికి తగిన సమయాన్నిచ్చింది. 

35
November 15 deadline

November 15 deadline

నవంబర్ 15లోగా ఎవరెవరు ఐటీఆర్‌ ఫైల్‌ చేయాలి?

ఇప్పటికే పలుమార్లు ఐటీఆర్‌ ఫైలింగ్‌ గడువును పొడిగించిన సీబీడీటీ.. నవంబర్ 15వ తేదీనే చివరి అవకాశమిచ్చింది. ఏదైనా కార్పొరేట్ సంస్థ, ఆదాయపు పన్ను చట్టం లేదా ఏదైనా ఇతర వర్తించే చట్టం ప్రకారం ఆడిట్ చేయాల్సిన వ్యక్తిగత పన్ను చెల్లింపుదారుడు, ఆదాయపు పన్ను చట్టం లేదా మరేదైనా ఆర్థిక రికార్డుల ప్రకారం ఆడిట్ చేయాల్సిన సంస్థకు చెందిన భాగస్వామి వర్తించే చట్టం, లేదా సెక్షన్ 5A (పోర్చుగీస్ సివిల్ ద్వారా నిర్వహించబడే జీవిత భాగస్వాముల మధ్య ఆదాయ భాగస్వామ్యానికి సంబంధించి) వర్తించే వారందరూ లేదా సంస్థలు ఈ గడువులోగా ఐటీఆర్‌ ఫైల్‌ చేయాలి. 

ట్యాక్స్‌ ఆడిట్‌ రిపోర్ట్‌ 

ఆదాయపు పన్ను ఆడిట్‌కు లోబడి ఉన్న పన్ను చెల్లింపుదారు తప్పనిసరిగా ఆడిట్‌కు సంబంధించిన నిర్దిష్ట వివరాలను వారి ఆదాయపు పన్ను రిటర్న్ (ITR)లో తప్పనిసరిగా అందించాలి. ట్యాక్స్‌ ఆడిట్‌ రిపోర్ట్‌ సమర్పించిన తేదీ, రసీదు సంఖ్య తప్పనిసరిగా పొందుపర్చాలి. ఈ వివరాలను నమోదు చేయకుండా ITR ఫైలింగ్‌ పూర్తికాదు. అందువల్ల, పన్ను చెల్లింపుదారులు తమ ఐటీఆర్‌ను ఫైల్ చేయడానికి ముందు ఈ వివరాలు తప్పనిసరిగా చెక్‌ చేసుకోవాలి. 

45
deadline for submitting the income tax audit report

deadline for submitting the income tax audit report

ఐటీఆర్‌ ఫైలింగ్‌ కంటే ముందు గడువులోగా ఆదాయపు పన్ను ఆడిట్ నివేదిక (ట్యాక్స్‌ ఆడిట్‌ రిపోర్ట్‌)ను తప్పనిసరిగా సమర్పించాలి. అలా చేయకపోతే రెండు చట్టపరమైన ఉల్లంఘనలకు పాల్పడినట్లే ఐటీ శాఖ పరిగణిస్తుంది. ఒకటి ఐటీఆర్ ఫైల్‌ చేయకపోవడం, రెండోది పన్ను ఆడిట్ నివేదికను సమర్పించకపోవడం. నవంబరు 15వ తేదీలోగా ఇది పూర్తవకపోతే సెక్షన్ 271 (బి) ప్రకారం జరిమానాతో పాటు బకాయి పన్ను మొత్తాలపై వడ్డీతో సహా ఫైన్‌ చెల్లించాల్సి ఉంటుంది. 
 

55
Penalty For Delayed ITR Filing

Penalty For Delayed ITR Filing

నవంబర్ 15 గడువు దాటితే..

పన్ను చెల్లింపుదారులు నవంబర్ 15, 2024లోగా ఐటీఆర్ దాఖలు చేయలేకపోతే.. డిసెంబర్ 31వ తేదీలోగా డిలేడ్ రిటర్న్ ఫైలింగ్ ఆప్షన్ ఎంచుకోవచ్చు. అప్పుడు మీరు ఆలస్యంగా ఐటీఆర్ ఫైల్ చేస్తున్న కారణంగా సెక్షన్ 234ఏ, 234బీ కింద వడ్డీ ఛార్జీలు, పలు రకాల జరిమానాలు కట్టాల్సి ఉంటుంది. సెక్షన్ 234ఎఫ్ కింద ఆదాయ స్థాయిని బట్టి రూ.వెయ్యి నుంచి రూ.5వేల వరకు జరిమానా చెల్లించాల్సి రావచ్చు. 

ట్యాక్స్ ఆడిట్ రిపోర్టును గడువులోగా సమర్పించకపోతే రూ.లక్షన్నర వరకు జరిమానా లేదా మొత్తం అమ్మకాల్లో 0.5 శాతం జరిమానా విధించే అవకాశం ఉంది.

About the Author

GV
Galam Venkata Rao
వెంకట్ 8 సంవత్సరాలకు పైగా ప్రింట్, టెలివిజన్, డిజిటల్ మీడియా రంగాల్లో అనుభవం కలిగిన జర్నలిస్ట్. ఈనాడులో జర్నలిజం ప్రయాణాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో వీడియో - సోషల్ మీడియా విభాగాలను పర్యవేక్షిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Crash: బంగారం కొనే వారికి గుడ్ న్యూస్.. ఒక్కరోజే రూ.2,070 తగ్గిన పసిడి!
Recommended image2
మ‌రో రంగంలోకి ముఖేష్ అంబానీ.. ధ‌ర‌ 10 రూపాయ‌ల‌ నుంచే ప్రారంభం
Recommended image3
Facts: చెక్‌పై రాసే మొత్తానికి చివర ‘Only’ ఎందుకు రాస్తారు.? అసలు కారణం ఏంటంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved