ఏటిఎం కార్డు పోయిందా.. ఎవరైనా దొంగిలించారా.. అయితే ఏం చేయాలో తెలుసుకోండి..
ఏటిఎం లేదా డెబిట్ కార్డ్ మనందరికీ చాలా ముఖ్యమైనది. డబ్బులు ఏటిఎం నుండి విత్ డ్రా చేయడానికి ఏటిఎం కార్డ్ ఎక్కువగా ఉపయోగిస్తుంటాం. అయితే ఏటిఎం కార్డ్ ఒకవేళ పాడైతే లేదా విరిగిపోతే కొత్త ఏటిఎం కార్డు కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలుసుకోండి..? మనందరికీ ఒక డెబిట్ కార్డ్ తో రోజుకి ఒక్కసారైనా అవసరం ఉంటుంది.

కష్ట సమయాల్లో డబ్బును ఉపసంహరించుకోవడంలో లేదా డబ్బు చెల్లింపుల్లో ఏటిఎం కార్డ్ కీలకంగా మారుతుంది. అయితే మారుతున్న కాలంతో పాటు డెబిట్ కార్డ్‌లో కూడా ఎన్నో మార్పులు వచ్చాయి. ఇంతకు ముందు మాగ్నెటిక్ స్ట్రిప్ ఏటిఎం కార్డులు ఉపయోగించేవారు. ఇప్పుడు స్మార్ట్ చిప్ ఏటిఎం కార్డులు పెద్ద ఎత్తున ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు ప్రతి బ్యాంకు వారి ఖాతాదారులకు ఏటిఎం కార్డును అందిస్తుంది. అయితే మీ బ్యాంక్ నుండి ఏటిఎం కార్డు కోసం ఎలా అప్లయి చేసుకోవచ్చో తెలుసుకోండి.. ఈ ప్రక్రియ చాలా సులభం కూడా..
పాత ఏటిఎం గడువు ముగిసిన తర్వాత కొత్త ఏటిఎం కోసం
మీకు ఏదైనా పాత ఏటిఎం కార్డు ఉంటే దాని గడువు ముగిసినట్లయితే అప్పుడు బ్యాంక్ మీ ఇంటికి కొత్త ఏటిఎం కార్డును పంపుతుంది. ఒకవేళ అలా జరగకపోతే మీరు మీ బ్యాంక్ శాఖకు వెళ్లి ఫారమ్ నింపడం ద్వారా ఏటిఎం కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఫారమ్ నింపిన కొన్ని రోజుల తర్వాత మీకు కొత్త ఏటిఎం కార్డు వస్తుంది.
ఏటిఎం దొంగతనం జరిగితే ఇలా చేయండి
మీ ఏటిఎం కార్డు దొంగిలించబడితే ముందుగా చేయవలసిన పని ఏమిటంటే బ్యాంక్ కస్టమర్ కేర్ నంబర్‌కు కాల్ చేయడం ద్వారా దాన్ని బ్లాక్ చేయడం. ఆ తర్వాత మీరు కొత్త ఏటిఎం కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసిన కొన్ని రోజుల తర్వాత మీ ఏటిఎం కార్డు మీ ఇంటికి వస్తుంది.
కొత్త ఏటిఎం కార్డ్ కోసం ఎలా అప్లై చేయాలి
మీరు 18 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నట్లయితే మీరు మీ బ్యాంక్ నుండి కొత్త ఏటిఎం కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కొత్త ఏటిఎం కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడానికి మీరు ముందుగా మీ కేవైసిని బ్యాంకులో సబ్మిట్ చేయాలి. ఆ తర్వాత మీరు కొత్త ఏటిఎం కార్డు కోసం దరఖాస్తు ఫారమ్ నింపాలి. దరఖాస్తు చేసిన కొన్ని రోజుల తర్వాత, కొత్త ఏటిఎం కార్డు మీ ఇంటికి వస్తుంది.