Diwali Bonus: దీపావళికి బోనస్ అందుకున్నారా? ఈ బోనస్ కి కూడా ట్యాక్స్ కట్టాలా..?
Diwali Bonus: దీపావళికి మీ కంపెనీ నుంచి బోనస్ అందుకున్నారా? మీరు అందుకున్న బోనస్ కి కూడా ట్యాక్స్ కట్టాల్సి వస్తుందనే విషయం మీకు తెలుసా? అసలు ఎలాంటి బోనస్ లకు ట్యాక్స్ కట్టాలో తెలుసా?

Diwali Bonus
అందరికీ నచ్చే పండగల్లో దీపావళి కూడా ఒకటి. దీపావళి పండుగ దగ్గర పడుతున్న కొద్దీ, చాలా మంది ఉద్యోగులు తమ యజమానుల నుండి పండుగ బోనస్‌లు, బహుమతులు, గిఫ్ట్ వోచర్‌ల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. అయితే, ఈ పండుగ ఉత్సాహంలో ట్యాక్స్ విషయాన్ని మర్చిపోతూ ఉంటారు. ఎందుకంటే అన్ని రకాల బోనస్ లు, బహుమతులు పన్ను రహితంగా ఉండవు. ఆదాయ పన్ను శాఖ నుంచి అనుకోని నోటీసులు రాకుండా ఉండాలంటే.. ట్యాక్స్ లేకుండా వచ్చే బోనస్ లు, బహుమతులు ఏమి ఉంటాయో తెలుసుకుందాం...
వీటికి ట్యాక్స్ ఉండదు...
పండుగ సమయంలో ఉద్యోగులకు యజమానులు ఇచ్చే కొన్ని చిన్న బహుమతులు పన్ను నుండి పన్ను మినహాయింపు ఉంటుంది. ఉదాహరణకు —
స్వీట్లు,
దుస్తులు
లేదా రూ. 5,000 లోపు విలువ కలిగిన గాడ్జెట్‌లు లేదా గిఫ్ట్ వోచర్‌లు.
ఇలాంటి బహుమతులు “టోకెన్ ఆఫ్ అప్రిషియేషన్” (Token of Appreciation)గా పరిగణిస్తారు. సాధారణంగా పన్ను రహితంగా ఉంటాయి.
వీటికి ట్యాక్స్ ఉంటుంది...
రూ. 5,000 కంటే ఎక్కువ విలువ ఉన్న బహుమతులు ఉదాహరణకు, ఖరీదైన మొబైల్ ఫోన్లు, ఆభరణాలు, ల్యాప్‌టాప్‌లు లేదా ఇతర హై-ఎండ్ వస్తువులకు పన్ను కచ్చితంగా ఉంటుంది. ఈ బహుమతుల విలువను ఉద్యోగి వార్షిక ఆదాయంలో కలిపి, సాధారణ జీతం ఆదాయంలా పరిగణించి, ఆయా స్లాబ్ రేటుకు అనుగుణంగా పన్ను విధిస్తారు
నగదు రూపంలో బోనస్ ఇస్తే....
ఇప్పుడు నగదు బోనస్‌ల విషయానికి వస్తే, ఇవి ఎప్పుడూ ఉద్యోగి జీతంలో భాగంగానే పరిగణిస్తారు.
ఉదాహరణకు, మీరు దీపావళి సందర్భంగా రూ. 30,000 బోనస్ పొందితే, అది మీ వార్షిక ఆదాయానికి జోడిస్తారు. మీ ఆదాయపు పన్ను స్లాబ్ ప్రకారం పన్ను విధిస్తారు. ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్న్ చేసేటప్పుడు సరిగా ఫైల్ చేయాలి. లేకపోతే మీరే నష్టపోతారు.
సింపుల్ గా చెప్పాలంటే....
రూ. 5,000 వరకు ఉన్న బహుమతులు — సాధారణంగా పన్ను రహితం.
రూ. 5,000 కంటే ఎక్కువ బహుమతులు లేదా నగదు బోనస్‌లకు కూడా ట్యాక్స్ కట్టాలి.
నగదు బోనస్ — ఎల్లప్పుడూ జీతంలో భాగంగానే పరిగణిస్తారు.